అప్రమత్తంగా ఉండాలి

డీజీపీకి ముఖ్యమంత్రి ఆదేశం

 
 అమరావతి: అధికార పార్టీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలపై ఒకే రోజున దాడి జరగడంపై ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి డీజీపీతో మాట్లాడారు. ఈ విషయంపై డీజీపీకి ఫోన్‌ చేసిన ఆయన ప్రజా జీవనానికి భంగం కలిగించే ఇలాంటి చర్యల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఆదేశించినట్టు సమాచారం. 

దాడి చేసిన వారిని గుర్తించే పనిలో పోలీసులు
కాగా, ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై జరిగిన హత్యాయత్నంపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటనకు బాధ్యులైన వారిని గుర్తిస్తున్నామని గుంటూరు ఐజీ వినీత్‌ బ్రిజ్‌లాల్‌ మీడియాకు తెలిపారు. శాంతియుతంగా ఆందోళన చేసుకుంటామనే పేరుతో హింసాయుత ఘటనలకు పాల్పడ్డారని చెప్పారు. పిన్నెల్లిపై దాడి ఉద్దేశపూర్వకంగానే జరిగినట్టు తేలిందన్నారు. నిరసన పేరుతో దాడులకు దిగితే సహించేది లేదని, కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

Back to Top