క్యాంపు ఆఫీస్‌లో ఘనంగా సీఎం పుట్టిన రోజు వేడుక  

కేక్‌ కట్‌ చేసిన ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌

తాడేపల్లి: ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పుట్టిన రోజు వేడుకను తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. సీఎం పుట్టిన రోజు సందర్భంగా తిరుమల తిరుపతి దేవస్థాన అర్చకులు ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ను ఆశీర్వదించి శ్రీవారి తీర్థప్రసాదాలు అందించారు. అనంతరం ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ తన బర్త్‌ డే కేక్‌ కట్‌ చేశారు. మంత్రులు, ఉన్నతాధికారులు సీఎంకు కేక్‌ తినిపించి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సీఎస్‌ నీలం సాహ్ని, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి, మంత్రులు వెల్లంపల్లి శ్రీనివాస్, ఆదిమూలపు సురేష్, విశ్వరూప్, బాలినేని శ్రీనివాస్‌రెడ్డి, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్యే మల్లాది విష్ణు, దేవినేని అవినాష్, డీజీపీ గౌతమ్‌ సవాంగ్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top