తాడేపల్లి: రాష్ట్రంలోని ప్రతి ఇంటి కుటుంబ సభ్యుడిగా ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి నిలిచారని వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ప్రియతమ నేత వైయస్ రాజశేఖరరెడ్డి తనయుడిగా తనను దగ్గరకు తీసుకున్న ప్రజలకు భరోసా ఇచ్చే స్థాయికి ఎదిగి.. ఆ ప్రజల ఆశీస్సులతోనే అధికారంలోకి వచ్చి.. ఇలాంటి నాయకుడే కావాలి.. ఇతనే అసలైన నాయకుడు అని ప్రజల్లో ధీమా కలించారన్నారు. ఇది కేవలం ఒక ముఖ్యమంత్రి పుట్టిన రోజు అని కాకుండా.. ప్రజలంతా తమ ఇంట్లో అన్నా, తమ్ముడి పుట్టిన రోజుగా జరుపుకుంటున్నారన్నారు. తాడేపల్లిలోని వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో ముఖ్యమంత్రి వైయస్ జగన్ పుట్టిన రోజు వేడుకను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి హాజరై రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. అనంతరం పేదలకు దుస్తులు, వికలాంగులకు దుప్పట్లు, ట్రైసైకిళ్లు పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. 'ముఖ్యమంత్రి వైయస్ జగన్.. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలకు మేటినాయకుడిగా నిలిచారు. తొలిసారి పార్లమెంట్ సభ్యుడుగా ఎన్నికై.. పత్రికా రంగంలో ఒక సంచలనం సృష్టించారు. ఒక బిజినెస్ మెన్‌గా, యువ రాజకీయ నాయకుడిగా.. వైయస్‌ఆర్ తనయుడిగా అందరికీ తెలిసిన నాయకుడు తండ్రి మరణం తరువాత ఒక విషాదకరమైన సమయంలో ముందుకొచ్చి అన్ని ఆటుపోట్లు తట్టుకొని ప్రజల అవసరాలు, ఆకాంక్షలు లోతుగా అధ్యయనం చేసిన నాయకుడిగా ఎదిగారు. కనుకే ఏడాదిన్నర పాలనలోనే దశాబ్దాల్లో చేయని చరిత్రాత్మక చట్టాలు, జన జీవితాల్లో మౌలిక మార్పులకు దోహదం చేసే విధానాలు తీసుకువచ్చారు. డీబీటీ ద్వారా ఎవరి ప్రమేయం లేకుండా.. రూ.60 వేల కోట్లకు పైగా నిధులు ప్రజల బ్యాంకు ఖాతాల్లో జమ చేశారు. ప్రజా సంక్షేమం, పారదర్శకత, అవినీతి రహిత పాలనే ధ్యేయంగా అడుగులు పడుతున్నాయి. టెండర్లలో అంతకు ముందు ఏం జరుగుతుందో తెలియని దగ్గర నుంచి రివర్స్‌టెండరింగ్ తీసుకువచ్చి వేల కోట్లు ఆదా చేస్తున్నారు. సంక్షేమ పథకాలు ఎక్కువ కావడంతో ఒక వర్గం వారికి అభివృద్ధి కనిపించడం లేదు. సంక్షేమం, అభివృద్ధి రెండు సమానంగా జరుగుతున్నాయి. గతేడాది గ్రోత్‌రేట్‌తో పోలిస్తే.. ఈ ఏడాది 5 శాతం పాజిటివ్ గ్రోత్ రేట్ వస్తుందని ఓ అధికారి చెప్పారు. కరోనాతో ఇబ్బందులు ఎదురైనా.. సెప్టెంబర్ నుంచి సాధారణ శైలి వచ్చిందంటే.. సీఎం వైయస్ జగన్.. రీస్టార్ట్ ప్యాకేజీలు, ఇండస్ట్రీకి ప్యాకేజీలు, రైతులకు మద్దతు ధర ఇచ్చి ఆదుకోవడం. సంక్షేమ పథకాల వల్ల నగదు బదిలీ జరగడం వల్లే. సంక్షోభ సమయంలో ప్రపంచమంతా చేయాలనుకున్నది.. సీఎం వైయస్ జగన్ సహజంగానే అంతుకు ముందు నుంచే చేసుకుంటూ రావడం వల్ల అప్పటికే ప్రజలకు అండగా నిలబడడం వల్ల ఈ రోజు ధీమాగా రాష్ట్రం ముందడుగు వేస్తోంది. సంక్షేమం అనేది స్కూల్ వెళ్లే పిల్లాడిని అడిగినా బ్యాగ్ చూపించి జగన్ మామ ఇచ్చాడని చెప్తాడు. మా అన్న అమ్మఒడి ఇచ్చాడని తల్లి చెబుతుంది. గతంలో ఒకరు చనిపోతే గానీ పెన్షన్ వచ్చేది కాదు.. కానీ, మా మనవడు 1వ తేదీన పెన్షన్ అందిస్తున్నారని అవ్వ చెబుతుంది. ప్రకృతి వైపరీత్యాలకు ఇన్‌పుట్ సబ్సిడీ వెంటనే అందిస్తున్నారు. కోవిడ్ సమయంలో అరటి, దొండకాయలు కూడా ధరలస్థిరీకరణ నిధితో కొనుగోలు చేశారు. ఇది దేశ చరిత్రలో రికార్డు’ అని సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు.