సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌ పుట్టినరోజున సేవా కార్యక్రమాలు

వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి సజ్జల రామ‌కృష్ణారెడ్డి

తాడేప‌ల్లి:  ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గన్ మోహ‌న్ రెడ్డి జన్మదినం సందర్భంగా ఈ నెల‌ 21వ తేదీన రాష్ట్రవ్యా ప్తంగా సేవా కార్యక్రమాలు నిర్వహించాలని పార్టీ శ్రేణులకు వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ  రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. విద్యార్థులకు పుస్తకాల పంపిణీ,  దుస్తుల పంపిణీ, రక్తదానం. అన్నదానం, మొక్కలు నాటడం తదితర సేవా కార్య‌క్ర‌మాలు చేప‌ట్టాల‌ని సజ్జల రామ‌కృష్ణారెడ్డి సూచించారు.

Back to Top