రైతులకు ఇచ్చే గౌరవానికి ప్రతీక సంక్రాంతి

భోగి, మ‌క‌ర సంక్రాంతి శుభాకాంక్ష‌లు తెలిపిన‌ సీఎం వైయ‌స్ జ‌గ‌న్ ‌

తాడేప‌ల్లి : ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్ర ప్రజలందరికీ భోగి, మకర సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. బుధవారం ఆయన ట్విటర్‌ వేదికగా స్పందిస్తూ.. ‘‘ రాష్ట్ర ప్రజలందరికీ భోగి, మకరసంక్రాంతి శుభాకాంక్షలు. మన సంస్కృతి సంప్రదాయాలకు,సొంత గ్రామాల మీద మమకారానికి, రైతులకు ఇచ్చే గౌరవానికి ప్రతీక సంక్రాంతి. పండుగ సంబరాలతో తెలుగులోగిళ్లు శుభాలకు, సుఖసంతోషాలకు నెలవు కావాలని,రైతుల ఇంట ఆనందాలు వెల్లివిరియాలని ఆకాంక్షిస్తున్నాను’’ అని పేర్కొన్నారు.  

రాష్ట్ర ప్రజలందరికీ భోగి, మకరసంక్రాంతి శుభాకాంక్షలు. మన సంస్కృతి సంప్రదాయాలకు,సొంత గ్రామాల మీద మమకారానికి, రైతులకు ఇచ్చే గౌరవానికి ప్రతీక సంక్రాంతి. పండుగ సంబరాలతో తెలుగులోగిళ్లు శుభాలకు, సుఖసంతోషాలకు నెలవు కావాలని,రైతుల ఇంట ఆనందాలు వెల్లివిరియాలని ఆకాంక్షిస్తున్నాను#Sankranthi

— YS Jagan Mohan Reddy (@ysjagan) January 13, 2021

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top