కోన భ‌ర‌త్‌కు సీఎం వైయ‌స్ జ‌గ‌న్ శుభాకాంక్ష‌లు

తాడేపల్లి: ఆంధ్రప్రదేశ్‌కు చెందిన కోన భరత్‌ భారత క్రికెట్‌ జట్టులోకి అరంగేట్రంపై ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఆస్ట్రేలియాతో జరుగుతున్న టెస్ట్‌ మ్యాచ్‌తో అంతర్జాతీయస్థాయి క్రికెట్‌కు అరంగేట్రం చేసిన కోన భరత్‌కు సీఎం వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు.. ‘‘మన వాడు కోనభరత్ ఈ రోజు ఆస్ట్రేలియాతో జరుగుతున్న టెస్ట్‌లో భారత క్రికెట్ జట్టుతో అరంగేట్రం చేస్తున్నాడు. ఆయనకు నా అభినందనలు, శుభాకాంక్షలు. మన తెలుగు జెండా రెపరెపలాడుతోంది’‘ అంటూ సీఎం వైయస్‌ జగన్‌ ట్వీట్‌ చేశారు.

Back to Top