హైదరాబాద్ : ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి తన సోదరి షర్మిల కుమారుడి వివాహ నిశ్చితార్థ వేడుకకు హాజరయ్యారు. రాజారెడ్డి, ప్రియ నిశ్చితార్థ వేడుకలో ముఖ్యమంత్రి వైయస్ జగన్ దంపతులు, వైయస్ విజయమ్మ పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు. సీఎం వైయస్ జగన్ వెంట పార్టీ రీజనల్ కో-ఆర్డినేటర్లు వైవీ సుబ్బారెడ్డి, ససజ్జల రామకృష్ణారెడ్డి ఉన్నారు. గండిపేటలో నిశ్చితార్థం గండిపేటలోని గోల్కొండ రిసార్ట్స్‌లో షర్మిల కుమారుడు రాజారెడ్డి నిశ్చితార్థం అట్లూరి ప్రియతో జరుగుతోంది. షర్మిల కుమారుడు రాజారెడ్డి ఇటీవలే అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రం డాలస్ లో అప్లైడ్ ఎకనామిక్స్ & ప్రిడిక్టివ్ అనలటిక్స్‌లో MS పూర్తి చేసి యూనివర్సిటీ నుంచి పట్టా అందుకున్నారు. అమెరికాలోనే చదువుతున్న ప్రియ అట్లూరితో గత నాలుగేళ్లుగా పరిచయం ఉంది. ఇవాళ గండిపేటలో నిశ్చితార్థం జరుగుతోంది.