ప్రతిపక్ష సభ్యులా..వీధి రౌడీలా ?

సీఎం వైయస్‌ జగన్‌ ఆగ్రహం
 

అసెంబ్లీ: ప్రతిపక్ష టీడీపీ సభ్యులు సభలో వీధి రౌడీల మాదిరిగా ప్రవర్తిస్తున్నారని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ సభ్యులు పోడియం వద్దకు వెళ్లి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం పట్ల సీఎం అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వైయస్‌ జగన్‌ మాట్లాడుతూ..పోడియం మెట్లు పైకి ఎక్కి స్పీకర్‌ చైర్‌ పక్కనే కూర్చుని ఇంతటి దారుణంగా ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారు. మొత్తం 10 మంది ఉన్నా కూడా అల్లరి చేస్తున్నారు. ఇక్కడేమో 151 మంది ఓపికతో కూర్చొని వింటున్నారు. వాళ్లమే స్పీకర్‌ చైర్‌ను చుట్టుముట్టి అగౌరవ పరుస్తున్నారు. అలాంటి పరిస్థితిలో ఇక్కడి సభ్యులు రెచ్చపోకుండా ఎలా ఉంటారు. సంస్కారం లేని ఇలాంటి వ్యక్తులు, వీరు సభకు ఎందుకు వస్తున్నారో తెలియదు. చేతనైతే సలహాలు ఇవ్వాలి. అక్కడికి వచ్చి రెచ్చగొట్టే విధంగా వ్యవహరిస్తే ఎలా..దాడి చేస్తున్నారని మళ్లీ దిక్కుమాలిన వార్తలు రాస్తారు. ఆ మెట్లు రింగ్‌ దాటి అక్కడికి వస్తే ఎవరైనా సరే మార్సల్స్‌ ఎత్తుకెళ్లే విధంగా చర్యలు తీసుకోండి. వెంటనే మార్సల్స్‌ను పిలిచి రింగ్‌ ఏర్పాటు చేయండి. వీధి రౌడీలు మాదిరిగా ప్రవర్తిస్తున్నారు. వీధి రౌడీలను ఏరివేయాల్సిన అవసరం ఉంది. 

Back to Top