రేణిగుంట ఎయిర్‌పోర్టుకు చేరుకున్న సీఎం

ఘనస్వాగతం పలికిన మంత్రులు, పార్టీ నేతలు

తిరుపతి: రెండు రోజుల తిరుమల పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్నారు. రేణిగుంట ఎయిర్‌పోర్టుకు చేరుకున్న సీఎం వైయస్‌ జగన్‌కు డిప్యూటీ సీఎం నారాయణస్వామి, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీలు రెడ్డప్ప, డాక్టర్‌ గురుమూర్తి, పార్టీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు ఘనస్వాగతం పలికారు. రేణిగుంట ఎయిర్‌పోర్టు నుంచి నేరుగా తిరుపతి బర్డ్‌ ఆస్పత్రికి సీఎం వైయస్‌ జగన్‌ చేరుకుంటారు. అక్కడ నిర్మించిన చిన్నపిల్లల గుండె జబ్బు చికిత్స ఆస్ప‌త్రిని సీఎం ప్రారంభిస్తారు. అనంతరం అలిపిరి వద్దకు చేరుకొని శ్రీవారి పాదాల వద్ద తిరుమలకు నడక మార్గం, పైకప్పు, గోమందిరాన్ని సీఎం ప్రారంభిస్తారు. సాయంత్రం తిరుమలలోని బేడి ఆంజనేయస్వామి ఆలయానికి చేరుకొని స్వామి దర్శనం చేసుకుంటారు. అనంతరం శ్రీవారి ఆలయానికి చేరుకొని స్వామివారికి ప్రభుత్వం తరఫున పట్టవస్త్రాలు సమర్పిస్తారు. స్వామివారి దర్శనం అనంతరం ఇతర కార్యక్రమాల్లో పాల్గొంటారు. తర్వాత పద్మావతి అతిథి గృహానికి చేరుకొని, రాత్రికి అక్కడే బస చేస్తారు. 

Back to Top