సీఎస్ఐ చ‌ర్చిలో ఘ‌నంగా క్రిస్మ‌స్ వేడుకలు

ప్రార్థ‌న‌ల్లో పాల్గొన్న సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌, కుటుంబ స‌భ్యులు

కేక్‌క‌ట్ చేసి, క్యాలెండ‌ర్ ఆవిష్క‌రించిన సీఎం

వైయ‌స్ఆర్ జిల్లా: పులివెందుల భాక‌రాపురం సీఎస్‌ఐ చర్చిలో జరిగిన క్రిస్మస్‌ వేడుకలకు ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి హాజరయ్యారు. చర్చిలో నిర్వ‌హించిన ప్రత్యేక పార్థనల్లో పాల్గొన్నారు. అనంతరం ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి, వైయస్‌ఆర్‌ సీపీ గౌరవ అధ్యక్షురాలు వైయస్‌ విజయమ్మ, కుటుంబ స‌భ్యులు కేక్‌క‌ట్ చేశారు. సీఎం వైయస్‌ జగన్ మాట్లాడుతూ.. రాష్ట్ర‌ ప్రజలకు క్రిస్మస్‌ శుభాకాంక్షలు తెలిపారు. అనంత‌రం సీఎస్ఐ చ‌ర్చి నూతన సంవత్సర క్యాలెండర్‌ను సీఎం ఆవిష్కరించారు. చ‌ర్చిలో ప్రార్థ‌న‌ల‌కు హాజ‌రైన వారంతా సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌కు క్రిస్మ‌స్ శుభాకాంక్ష‌లు తెలిపి.. సీఎంతో ఫొటోలు దిగారు. సీఎం వెంట డిప్యూటీ సీఎం అంజాద్‌బాషా, మంత్రులు ఆదిమూలపు సురేష్, ఎంపీ వైయస్‌ అవినాష్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. సీఎస్‌ఐ చర్చి కాంపౌండ్‌లో ఏర్పాటు చేసిన షాపింగ్‌ కాంప్లెక్స్‌ను సీఎం ప్రారంభించారు.

Back to Top