స‌త్వ‌ర న్యాయం జ‌రిగితే నేరాలను ఆప‌గ‌లం

 బాధితుల‌కు చ‌ట్టాలు, న్యాయ వ్య‌వ‌స్థ‌పై న‌మ్మ‌కం క‌ల‌గాలి

దీనికి వేగ‌వంత‌మైన విచార‌ణ, శిక్ష‌లు అవ‌స‌రం

స్ప‌ష్ట‌మైన ఆధారాలున్న కేసుల్లో నిందితుల‌కు 21 రోజుల్లో ఉరి శిక్ష‌ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్

 

రాష్ట్రంలో మ‌హిళ‌ల మీద దాడులు జ‌రుగుతుంటే విప్ల‌వాత్మ‌క మార్పులు తీసుకురావాల‌నే ఉద్దేశ్యంతో ఈ చ‌ట్టం తీసుకొచ్చాం. ఇలాంటి ప‌రిస్థితులు మారాలి. దానిరి విప్ల‌వాత్మ‌క‌మైన నిర్ణ‌యాలు తీసుకోక‌త‌ప్ప‌దు. ప‌క్క రాష్ట్రం తెలంగాణ‌లో ఒక మ‌హిళా డాక్ట‌ర్‌ను దారుణంగా హ‌త‌మార్చిన సంఘ‌ట‌న దేశ వ్యాప్తంగా సంచ‌ల‌నం రేపింది. ప్ర‌తి గుండెను క‌ల‌చివేసింది. ఆ నిందితుల‌కు ఎలాంటి శిక్ష విధించినా త‌క్కువేన‌ని స‌మాజం ముక్త కంఠంతో తీర్పు చెప్పింది. తెలంగాణ ప్ర‌భుత్వం మీద చాలా ఒత్తిడి ఉండింది. ఈ ఘ‌ట‌న‌ల‌కు చారిత్రాత్మ‌కంగా తీర్పు చెబితే త‌ప్ప ప‌రిస్థితులు మార‌వు. తెలంగాణ ప్ర‌భుత్వం కూడా అదే చేసింది. కానీ త‌ద‌నంత‌ర ప‌రిణామాలు బాధాక‌రంగా ఉన్నాయి. ఎన్‌హెచ్ఆర్సీ రంగంలోకి దిగి ప్ర‌భుత్వ నిర్ణ‌యాలను త‌ప్పప‌డుతుంటే.. రాబోయే రోజుల్లో నిందితుల‌ను శిక్షించ‌డానికి ఏ పోలీసూ ముందుకు రాడు. ఇదే అద‌నుగా నిందితులు చెల‌రేగిపోతూనే ఉంటారు. ఆ అనుభ‌వాల నుంచి రూపొందించిందే ఏపీ దిశ యాక్టు. మ‌న ఇంటి ఆడ‌వారికే సమ‌స్య వ‌స్తే మ‌నం ఎలా బాధ ప‌డ‌తామో గుర్తించి ఈ చ‌ట్టాన్ని తీసుకొచ్చాం. బాధితుల‌కు స‌త్వ‌ర న్యాయం జ‌రిగితేనే చ‌ట్టాల‌పై, న్యాయాల‌పై సామాన్యుల‌కు గౌర‌వం పెరుగుతుంది.  త్వ‌రిత‌గ‌తిన శిక్ష‌లు అమ‌లుకావాలి. కేంద్ర రాష్ట్ర ప్ర‌భుత్వాలు సంయుక్తంగా నిర్ణ‌యం తీసుకునేలా ఈ దిశ యాక్టు రూపొందించాం. ఈ చ‌ట్టాలు కేంద్ర రాష్ట్ర ప్ర‌భుత్వాల ప‌రిధికి సంబంధించేలా త‌యారు చేయ‌బ‌డింది. ఈ చ‌ట్టం రాష్ట్రప‌తి వ‌ద్ద‌కు ఎప్పుడైతే వెళ్తుందో అప్పుడు దేశ‌వ్యాప్తంగా చ‌ర్చ‌కు దారితీస్తుంది. అలాంట‌ప్పుడు స‌త్వ‌ర‌ న్యాయం జ‌రుగుతుంది. రెండు చ‌ట్టాల్లో ఒకదానిని రాష్ట్ర ప‌రిధిలోనే నిర్ణ‌యం తీసుకుని శిక్ష అమ‌లు చేస్తారు. మ‌రొక‌రి రాష్ట్ర‌ప‌తి దృష్టికి తీసుకెళ్తాం. 

ప్ర‌తి జిల్లాలో ప్రత్యేక న్యాయస్థానం

13 జిల్లాల్లో ప్ర‌త్యేక‌మైన న్యాయ స్థానాల‌ను ఏర్పాటు చేస్తాం. ఇవి ప్ర‌తి రాష్ట్రాల్లో ఉన్నా.. ప్ర‌తి జిల్లాలో మాత్రం ఏర్పాటు చేస్తున్న రాష్ట్రం మాత్రం మ‌న‌దే. మ‌హిళ‌ల మీద దాడులు, సోష‌ల్ మీడియాలో వేధింపులు, అత్యాచారాలు జ‌రిగితే ఈ కోర్టుల్లో త‌క్ష‌ణం శిక్ష‌లు అమ‌లు చేస్తారు. ఆయా కోర్టుల్లో ప్రత్యేకంగా న్యాయ‌వాదుల నియామ‌కాలు చేప‌డ‌తాం. నిందితులు రెడ్ హ్యాండెడ్‌గా దొరికినా, స్ప‌ష్ట‌మైన ఆధారాలుంటే త‌క్ష‌ణ‌మే మ‌ర‌ణ‌శిక్ష విధించేలా చ‌ట్టం చేశాం. అందుకనుగుణంగా సెక్ష‌న్‌కు 376కి స‌వ‌ర‌ణ చేస్తున్నాం. జ‌డ్జిమెంట్ పీరియ‌డ్‌ను కూడా 21 రోజుల‌కు కుదిస్తున్నాం. విచార‌ణ 7 రోజుల్లో, ట్ర‌య‌ల్ 14 రోజుల్లో పూర్తి చేసి 21 రోజుల్లో నిందితుల‌కు శిక్ష విధించేలా చ‌ట్టాల‌కు మార్పు తీసుకొస్తున్నాం. క్రిమిన‌ల్ ప్రొసీజ‌ర‌ల్ యాక్ట్ 173, 309కి మార్పులు చేస్తున్నాం. చిన్నారుల‌ మీద దాడులు, లైంగిక వేధింపుల‌కు పాల్ప‌డితే పాస్కో యాక్టు ప్ర‌కారం మూడేళ్ల నుంచి ఏడేళ్ల వ‌ర‌కు ఉంది. ఇప్పుడు దానిని మార్చి జీవిత‌ఖైదు విధించేలా చ‌ట్టం చేయ‌బోతున్నాం. 

సోష‌ల్ మీడియాలో వేధిస్తే 2నుంచి నాలుగేళ్లు జైలు

సోష‌ల్ మీడియా కార‌ణంగా కూడా ఆడ‌వాళ్ల‌కు భ‌ద్ర‌త లేకుండా పోయింది. దుర‌దృవ‌శాత్తు అలాంటివాటికి ఇప్ప‌టి వ‌రకు చ‌ట్టం లేదు. దానికీ ఇప్పుడు చ‌ట్టం చేస్తున్నాం. వారిని మొద‌టిసారి త‌ప్పుకు రెండేళ్ల జైలుకు, రెండోసారీ అదే నేరానికి పాల్ప‌డితే నాలుగేళ్లు జైలు శిక్ష విధిస్తాం. 354E అనే చ‌ట్టాన్ని తీసుకొస్తున్నాం. నిందితుల వివ‌రాలు అన్ని డిజిట‌లైజ్ చేయ‌బోతున్నాం. 

గ‌త ఐదేళ్ల‌లో మహిళ‌లు, చిన్నారులపై జ‌రిగిన నేరాలు 

మ‌హిళ‌లు      రేప్ కేసులు             సంవ‌త్స‌రం      చిన్నారులు      
13549                  937                                  2014             4032                    
13088                  1014                                2015              4114
13948                  969                                  2016             4477
14696                  1046                                2017             4672
14048                   1096                               2018             4215

Read Also: సీఎం వైయస్‌ జగన్‌ మాట రామబాణం

Back to Top