తాడేపల్లి: ఎంఎస్‌ఎంఈలపై ప్రత్యేక దృష్టిపెట్టాలని ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఎంఎస్‌ఎంఈల ఉత్పత్తులకు మార్కెటింగ్‌పై దృష్టిపెట్టాలన్నారు. ఇతరదేశాల్లో ఎంఎస్‌ఎంఈల నిర్వహణ, నాణ్యమైన ఉత్పాదనల విధానాలను ఇక్కడ కూడా అమల్లోకి తీసుకురావాలని సూచించారు. వినూత్న ఉత్పాదనలు, సాంకేతిక పరిజ్ఞానం బదిలీపై దృష్టిపెట్టాలని సీఎం వైయస్ జగన్ ఆదేశించారు. రాష్ట్రంలో కొత్తగానిర్మిస్తున్న పోర్టులు, ఫిషింగ్ హార్బర్లపై క్యాంపు కార్యాలయంలో సీఎం వైయస్.జగన్ సమీక్ష నిర్వహించారు.
-పోర్టులు, ఫిషింగ్ హార్బర్ల నిర్మాణ పనుల పురోగతిని సీఎంకు వివరించిన అధికారులు.
-రామాయపట్నం పోర్టు పనుల ప్రగతిని అడిగి తెలుసుకున్న సీఎం.
- ఇప్పటికే సౌత్ బ్రేక్ వాటర్, నార్త్ బ్రేక్‌వాటర్ పనులు దాదాపుగా పూర్తయ్యాయన్న అధికారులు.
- సెప్టెంబరుకల్లా డ్రెడ్జింగ్, రెక్లిమేషన్ పనులు పూర్తవుతాయన్న అధికారులు.
- రామాయపట్నం తొలిదశలో నాలుగు బెర్తులు ఏర్పాటు, తద్వారా ఏడాదికి 34 మిలియన్ మెట్రిక్ టన్నుల కార్గో రవాణా లక్ష్యమని వివరించిన అధికారులు.
- అంతిమంగా రామాయపట్నంలో 19 బెర్తులు, 138 మిలియన్ మెట్రిక్ టన్నుల కార్గో రవాణా లక్ష్యంగా నిర్మాణం కానున్న పోర్టు.
-రామాయపట్నం పోర్టు అన్నిదశలలో కలిపి మొత్తం నిర్మాణ వ్యయం అంచనా రూ. 3,736 కోట్లు ఖర్చు.
మచిలీపట్నం పోర్టు నిర్మాణ పనులను వివరించిన అధికారులు.
- తొలిదశలో నాలుగు బెర్తులు ఏర్పాటు.
- తద్వారా తొలివిడత కింద 35 మిలియన్ మెట్రిక్ టన్నుల కార్గో రవాణా.
- అంతిమంగా 16 బెర్తులతో, 115 మిలియన్ మెట్రిక్ టన్నుల కార్గో రవాణా సామర్ధ్యంతో నిర్మాణం కానున్న మచిలీపట్నం పోర్టు.
- మచిలీపట్నం పోర్టు అన్నిదశలలో కలిపి మొత్తం నిర్మాణ ఖర్చు రూ. 5,155 కోట్లు.
- ప్రస్తుతం పనులు చురుగ్గా కొనసాగుతున్నాయని తెలిపిన అధికారులు.
- నార్త్ బ్రేక్ వాటర్, సౌత్ బ్రేక్ వాటర్ పనులు కొనసాగుతున్నాయన్న అధికారులు.
- గ్రౌండ్ ఇంప్రూవ్‌మెంట్ పనులు కూడా కొనసాగుతున్నాయన్న అధికారులు.
- శ్రీకాకుళం జిల్లా మూలపేటలో పోర్టు నిర్మాణ పనుల ప్రగతిని వివరించిన అధికారులు.
- సౌత్ బ్రేకింగ్ వాటర్ పనులు ప్రారంభమయ్యామన్న అధికారులు.
- మూలపేట పోర్టులో తొలిదశ కింద 4 బెర్తులు ఏర్పాటు.
- చురుగ్గా జరుగుతున్న 1, 2 బెర్తుల నిర్మాణ పనులు.
- తొలిదశలో ఏడాదికి 23 మిలియన్ మెట్రిక్ టన్నుల కార్గో రవాణా.
- అంతిమంగా 10 బెర్తులు ఏర్పాటు, ఏడాదికి 83 మిలియన్ మెట్రిక్ టన్నుల కార్గో రవాణా సామర్థ్యం.
- మూలపేట పోర్టు అన్ని దశలలో కలిపి మొత్తం నిర్మాణ వ్యయం రూ.4,361 కోట్లు.
- కాకినాడ గేట్‌వే పోర్టు లిమిటెడ్ నిర్మాణ పనుల ప్రగతిని సీఎంకు వివరించిన అధికారులు.
- ఫేజ్ -1 కింద మూడు బెర్తుల ఏర్పాటు.
- తొలిదశలో ఏడాదికి 16 మిలియన్ మెట్రిక్ టన్నుల రవాణా సామర్థ్యం.
- మొత్తంగా 60 మిలియన్ మెట్రిక్ టన్నుల రవాణాకు విస్తరణ.
- ఇప్పటికే 1.1 కిలోమీటర్ల మేర సౌత్ బ్రేక్ వాటర్ నిర్మాణ పనులు.
- కేజీపీఎల్ మొత్తం అన్నిదశలలో కలిపి నిర్మాణ వ్యయం రూ.2,123 కోట్లు.
-
ఫిషింగ్ హార్బర్ల నిర్మాణంపైనా సమీక్ష నిర్వహించిన సీఎం.
- 10 ఫిషింగ్ హార్బర్ల నిర్మాణ పనులపై సమీక్ష.
- తొలిదశలో నిర్మిస్తున్న ఉప్పాడ, మచిలీపట్నం, నిజాంపట్నం, జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ల నిర్మాణాలపై సమీక్షించిన సీఎం.
- జువ్వలదిన్నెలో 86 శాతం పనులు పూర్తి, నిజాంపట్నంలో 62 శాతం, మచిలీపట్నంలో 56.22 శాతం, ఉప్పాడలో 55.46శాతం పనులు పూర్తి.
- జువ్వలదిన్నెలో ఫిషింగ్ హార్బర్ మరో 40 రోజుల్లో సిద్ధం అవుతుందన్న అధికారులు.
- మొదటి దశలో అన్ని ఫిషింగ్ హార్బర్లు డిసెంబర్‌కల్లా పూర్తవుతాయన్న అధికారులు.
- మొదటి దశలోనే మంచినీళ్లపేట ఫిషింగ్ హార్బర్ నిర్మాణాన్ని పూర్తిచేసేలా తగిన చర్యలు తీసుకోవాలన్న సీఎం.
- రెండోదశలో బుడగట్లపాలెం, పూడిమడక, కొత్తపట్నం, ఓడరేవు, బియ్యపుతిప్పలో పిషింగ్ హార్బర్ల నిర్మాణం.
- మొత్తంగా 10 ఫిషింగ్ హార్బర్ల నిర్మాణం.
ఫిష్ ల్యాండ్ సెంటర్లు
ఇవికాక నెల్లూరు జిల్లా నేలటూరులో జెట్టీ నిర్మాణం, భీమిలి, అనకాపల్లి జిల్లా రాజయ్యపేట, విజయనగరం జిల్లా చింతపల్లి, తిరుపతి జిల్లా రాయదరువు, అనకాపల్లి జిల్లా దొండవాక, కాకినాడ జిల్లా ఉప్పులంకలో ఫిష్‌ల్యాండింగ్ సెంటర్ల ఏర్పాటు.
ఎంఎస్‌ఎంఈలపైనా సమీక్ష.
సీఎం ఆదేశాలమేరకు ఎంఎస్‌ఎంఈల అభివృద్ధిపై ప్రత్యేక చర్యలు.
ఎంఎస్‌ఎంఈలకు చేయూతనివ్వనున్న ప్రభుత్వం.
ఈ సందర్భంగా సీఎం ఏమన్నారంటే….:
- ఎంఎస్‌ఎంఈలపై ప్రత్యేక దృష్టిపెట్టాలన్న సీఎం.
- ఎంఎస్‌ఎంఈల ఉత్పత్తులకు మార్కెటింగ్‌పై దృష్టిపెట్టాలన్న సీఎం
- ఇతరదేశాల్లో ఎంఎస్‌ఎంఈల నిర్వహణ, నాణ్యమైన ఉత్పాదనల విధానాలను ఇక్కడకూడా అమల్లోకి తీసుకురావాలన్న సీఎం.
- వినూత్న ఉత్పాదనలు, సాంకేతిక పరిజ్ఞానం బదిలీపై దృష్టిపెట్టాలన్న సీఎం.
- ఎంఎస్‌ఎంఈలకు తక్కువ ధరలతో విద్యుత్ అందించడంతో పాటు, రుణాలు కూడా తక్కువ వడ్డీలకు ఇవ్వగలిగితే అవి పోటీ ప్రపంచంలో నిలదొక్కుకోగలవన్న సీఎం.
- అలాగే ప్రపంచవ్యాప్తంగా మార్కెటింగ్ సౌకర్యంతోపాటు, అత్యుత్తమ సాంకేతిక పరిజ్ఞానాన్ని కూడా అందించగలగాలన్న సీఎం.
- దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి.. ఆమేరకు విధానాలను తీసుకురావడంద్వారా ఎంఎస్‌ఎంఈలకు చేయూతనిచ్చేలా కార్యక్రమాలను మరింత సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్లాలన్న సీఎం.
- పర్యావరణ హిత విధానాలకు ఎంఎస్‌ఎంఈల్లో పెద్దపీట వేయాలన్న సీఎం.
- హ్యాండ్‌లూమ్స్, గ్రానైట్ రంగాల్లో ఎంఎంస్‌ఎంఈలను క్లస్టర్లుగా విభజించాలన్న సీఎం.
- ఎంఎస్‌ఎంఈలను క్లస్టర్లగా విభజించగలిగితే అక్కడ మౌలికసదుపాయాల వృద్ధి తదితర అంశాలపై మరింత దృష్టిపెట్టేందుకు వీలుంటుందన్న సీఎం.