సీఎంను సత్కరించిన ఎంపీ, ఎమ్మెల్యేలు

 వెలగపూడి: ముఖ్యమంత్రి హోదాతో తొలిసారి సచివాలయంలో అడుగుపెట్టిన సీఎం వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని వైయస్‌ఆర్‌ సీపీ నాయకులు, ప్రజాప్రతినిధులు, ఉద్యోగులు ఘనంగా సత్కరించారు. తన ఛాంబర్‌లో సీఎం వైయస్‌ జగన్‌ ప్రత్యేక పూజలు చేసిన అనంతరం వేదపండితుల ఆశీర్వాదం తీసుకున్నారు. అనంతరం పార్టీ రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి, పార్టీ సీనియర్‌ నేత, ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, సజ్జల రామకృష్ణారెడ్డి, పార్లమెంట్‌ సభ్యులు నందిగం సురేష్, ఎమ్మెల్యేలు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, కోలగట్ల వీరభద్రస్వామి, ఆదిమూలపు సురేష్, ధర్మాన కృష్ణదాస్, శ్రీకాంత్‌రెడ్డి, బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, బాలినేని శ్రీనివాస్‌రెడ్డి, గుమ్మనూరు జయరాం తదితరులు ముఖ్యమంత్రి పుష్పగుచ్ఛాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ముఖ్యమంత్రి వెంట ప్రభుత్వ ముఖ్య సలహాదారు అజేయ్‌ కల్లం, సీఎస్‌ ఎల్వీ సుబ్రమణ్యం, ధనుంజయరెడ్డి, డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ తదితరులు ఉన్నారు.

 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top