ఇంజనీరింగ్‌ నిపుణుల కమిటీతో సీఎం వైయస్‌ జగన్‌ సమీక్ష

అమరావతి: ఇంజనీరింగ్‌ నిపుణుల కమిటీతో సీఎం వైయస్‌ జగన్‌ సమావేశమయ్యారు. ప్రాజెక్టుల నిర్మాణంపై  దృష్టి పెట్టిన సీఎం.. ఇప్పటికే ఇంజనీరింగ్‌ పనుల్లో జరిగిన అక్రమాలపై కమిటీని నియమించారు.గత ఐదేళ్లలో జరిగిన అక్రమాలపై ఎలాంటి చర్యలు తీసుకోవాలనే దానిపై ఇంజనీరింగ్‌ నిపుణుల కమిటీతో భేటీ అయ్యారు.సిఆర్‌డిఏ,మున్సిపల్,గ్రామీణ నీటి పారుదల వంటి ఐదు ప్రధాన అంశాలపై సమీక్ష నిర్వహిస్తున్నారు.గత ఐదేళ్లలో టీడీపీ పాలనలో  అవినీతి ఆరోపణలు,ప్రభుత్వ నిధుల దుర్వినియోగంపై  సీఎం సమీక్ష చేస్తున్నారు.ఈ సమావేశంలో ఇంజనీరింగ్‌  నిపుణుల కమిటీ సభ్యులు,మంత్రి అనిల్‌కుమార్‌ యాదవ్‌ పాల్గొన్నారు. మధ్యాహ్నం ఆర్థిక శాఖ అధికారులతో సీఎం జగన్‌ సమీక్ష నిర్వహించనున్నారు.
 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top