అతి పెద్ద హైడల్‌ పవర్‌ ప్లాంట్‌కు కర్నూలు వేదికవడం గర్వకారణం

సీఎం వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి

 ఇంటిగ్రేటెడ్‌ పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టుకు సీఎం వైయ‌స్ జ‌గ‌న్ శంకుస్థాప‌న‌

క‌ర్నూలు: ప్రపంచంలోనే ప్రపంచంలోనే అతి పెద్ద ఇంటిగ్రేటెడ్ పునరుత్పాదక పవర్ ప్రాజెక్టు కు కర్నూలు వేదికవడం గర్వకారణమని సీఎం వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి  అన్నారు. ఇంటిగ్రేటెడ్‌ పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టుకు కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలం గుమ్మితం తాండాలో ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి అంకురార్పణ చేశారు.  పవర్‌ ప్రాజెక్ట్‌ త్రీడీ మోడల్‌ నమూనాను ముఖ్య‌మంత్రి  ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా ఏర్పాటు చేసిన స‌భ‌లో సీఎం వైయ‌స్ జ‌గ‌న్ మాట్లాడుతూ.. కర్నూలులో హైడల్‌ పవర్‌ ప్రాజెక్ట్‌ ఏర్పాటు చేయడం సంతోషంగా ఉంద‌న్నారు. 'ఇంటిగ్రేటెడ్‌ పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టు కోసం గ్రీన్‌కో ఎనర్జీస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ రూ.15 వేల కోట్ల పెట్టుబడి పెట్టబోతోంద‌న్నారు. 

ఈ ప్రాజెక్టు ద్వారా జిల్లాలోని నిరుద్యోగులకు భారీగా ఉపాధి, ఉద్యోగావకాశాలు రానున్నాయి. హైడల్‌ పవర్‌ ప్రాజెక్టు నిర్మాణ సమయంలో 15 వేల ఉద్యోగాలొస్తాయి. ఐదేళ్ల పాటు నిర్మాణ పనులు కొనసాగుతాయి. తరువాత ప్రత్యక్షంగా 3 వేల మందికి.. పరోక్షంగా మరో 5 వేల మంది ఉపాధి పొందుతార‌ని సీఎం వైయ‌స్ జగన్‌ అన్నారు. ఈ ప్రాజెక్టు నిర్మాణాన్ని రాబోయే 5 ఏళ్లలో పూర్తి చేసి విద్యుత్‌ ఉత్పత్తిని ప్రారంభిస్తార‌ని తెలిపారు. రూ.15 వేల కోట్ల పెట్టుబడితో స్థాపించే ఈ పవర్‌ ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేసుకుంటే 23 వేల మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉద్యోగ, ఉపాధి అవకాశాల లభిస్తాయ‌ని సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌ చెప్పారు.  

Back to Top