అమరావతి: అధికారం లేదని చంద్రబాబు, దుష్ట చతుష్టానికి బాధ ఉంటే..మేం ప్రజలకు మంచి చేసేందుకు బాధ్యతగా పరిపాలన చేస్తున్నామని ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి పేర్కొన్నారు. పారిశ్రామిక ప్రగతి చంద్రబాబు హయాంలో కంటే ఇప్పుడు బాగుందని చెప్పారు. వరుసగా మూడో ఏడాది ఈజ్ ఆఫ్ డూయింగ్‌లో ఏపీ నంబర్ వన్‌గా నిలిచిందని వివరించారు. గతం కంటే అధికంగా రాష్ట్రానికి పెట్టుబడులు వస్తున్నాయని చెప్పారు. ప్రభుత్వ విధానాలపై పారిశ్రామిక వేత్తలు సంతృప్తిగా ఉన్నారని, ఎంఎస్‌ఎంఈ రంగానికి ప్రభుత్వం అండగా ఉంటోందని తెలిపారు. ఎంఎస్‌ఎంఈ రంగానికి రూ.2,500 కోట్ల ఇన్సెంటివ్‌లు ఇచ్చామని, చిన్న తరహా పరిశ్రమలను పోత్రహిస్తున్నామని వివరించారు. మూడేళ్లలో 99 భారీ పరిశ్రమలు రాష్ట్రంలో ఉత్పత్తిని ప్రారంభించినట్లు ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి తెలిపారు. భారీ పరిశ్రమల ద్వారా 46,280కోట్ల పెట్టుబడులు వచ్చాయని, వీటి ద్వారా రాష్ట్రంలో 62వేల 541 మందికి ఉపాధి లభించిందని వెల్లడించారు. పారిశ్రామిక అభివృద్ధిపై అసెంబ్లీలో సోమవారం చర్చ జరిగింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి మాట్లడారు.
ఈ సందర్భంగా సీఎం ఏమన్నారంటే..:
రాష్ట్రంలో పారిశ్రామికంగా, ఉద్యోగల కల్పన పరంగా గడిచిన మూడు సంవత్సరాలుగా ఏ రకమైన అడుగులు పడ్డాయి. దానివల్ల రాష్ట్రానికి ఏరకంగా మంచి జరిగింది అనే అంశంమీద చర్చలో పాల్గొంటున్నాను. ఈ చర్చ జరుగుతున్నప్పుడు ఈ మధ్య కాలంలో జరిగిన ఓ సంఘటనను ఒక ఉదాహరణగా చెప్పాలి.
రాష్ట్రానికి రూ. 1000 కోట్లతో బల్క్ డ్రగ్ పార్క్ ఇస్తాం అని కేంద్ర ప్రభుత్వం ఈ మధ్యకాలంలో ముందుకొచ్చింది. ఈ పార్క్ తెచ్చుకునేందుకు 17 రాష్ట్రాలు పోటీ పడ్డాయి. దేశవ్యాప్తంగా మూడు పార్కులు మాత్రమే ఇచ్చారు. ఒకటి గుజరాత్, ఇంకొకటి ఆంధ్రప్రదేశ్‌కు వస్తే.. మరొకటి హిమాచల్‌ప్రదేశ్‌కు వచ్చింది. ఇటువంటి ప్రతిష్టను పెంచే ఒక గొప్ప అధ్యయనం మనం చూశాం. 17 రాష్ట్రాలు పోటీ పడితే అందులో మన రాష్ట్రం ఆ పోటీని తట్టుకుని నిలబడితే మనకు ఆ పార్క్ వచ్చింది.
అటువంటి పార్క్ మన రాష్ట్రానికి వస్తుంటే.. ఈ పార్క్ మన రాష్ట్రానికి వద్దు అని.. ఏకంగా ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబునాయుడు, ఆయన పార్టీ లేఖలు రాశారు.
ప్రతిపక్షనాయకుడుగా ఉంటూ... ఈయన పార్టీకి సంబంధించిన నాయకుడు యనమల రామకృష్ణుడు లేఖ రాశారు. ఆయన కౌన్సిల్‌లో టీడీపీ పార్టీకు సంబంధించిన అధ్యక్షుడు. తెలుగుదేశం పార్టీ అధికారికంగా కేంద్ర ప్రభుత్వానికి ఈ పార్కు వద్దు అని లేఖ రాసింది. ఏ స్ధాయిలోకి దిగజారిపోయారో గమనిస్తే తెలుస్తుంది. ఒక్క లేఖ కూడా కాదు... రెండు లేఖలు రాశారు. ఏకంగా లేఖలే రాస్తుంటే వీళ్లు మనుషులేనా అని అడాలనిపిస్తుంది. ఇదే చంద్రబాబునాయుడు గారు ముఖ్యమంత్రిగారు ఉంటూ.. ఇక్కడే దివీస్ అనే ఫార్మాస్యూటికల్ కంపెనీకి తానే దగ్గరుండి ఏర్పాటు చేసే కార్యక్రమం చేశాడు. ఆ రోజు చంద్రబాబునాయుడు గారికి ఫార్మా రంగం ఇక్కడకి వస్తే పొల్యూషన్ వస్తుందనో.. ఇంకొకటో అన్న విషయం కనిపించలేదా.
అసలు రూ.1000 కోట్లు కేంద్ర ప్రభుత్వం ఎందుకు ఇస్తుంది. పూర్తిగా ఆక్లెయిన్ ట్రీట్‌మెంట్ ప్లాంట్ పెట్టడమే కాకుండా.. అన్నిరకాలుగా దీన్ని శుద్ధి చేసి, జీరో డిశ్చార్జ్ కింద దీన్ని కన్వెర్ట్ చేసినప్పటికీ కూడా దీన్నించి ఎటువంటి 40 నుంచి 50 కిలోమీటర్లు పొడవైన పైప్‌లైన్ కూడా వేస్తున్నాం. ఎక్కడా కూడా ఎవరికీ ఇబ్బంది లేకుండా జరుగుతుంది. రూ.వేయి కోట్లతో పార్కు పనులు జరుగుతుంటే అడ్డుకునే కార్యక్రమం చేస్తున్నారు. దీనివల్ల ప్రతక్షంగానూ, పరోక్షంగా 30 వేల మందికి ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. దాదాపు 17 రాష్ట్రాలతో పోటీపడి తెచ్చుకున్న ప్రాజెక్టు. ఇటువంటి ప్రాజెక్టును వీళ్లు అడ్డుకుంటుంటే... ఇంత కన్నా చరిత్రహీనులు ఎవరైనా ఉంటారా ? అని రాష్ట్ర ప్రజలు ఆలోచన చేయాలి.
పక్కనున్న తెలంగాణ ఐటీ, పరిశ్రమల మంత్రి కేటీఆర్ గారు మాకు ఎందుకు ఇవ్వరు అని ఇదే బల్క్ డ్రగ్ పార్క్ గురించి కేంద్రాన్ని ప్రశ్నిస్తున్నాడు.
మహారాష్ట్ర ముఖ్యమంత్రి మాకెందుకు ఆ బల్క్ డ్రగ్ పార్క్ ఇవ్వలేదు అని కేంద్రాన్ని ప్రశ్నిస్తున్నాడు. పక్కరాష్ట్రాలు మాకెందుకు ఇవ్వడం లేదు అని అడుగుతున్న దాన్ని... రాష్ట్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలతో పోటీలో నిలబడి గెలిచి.. ఈ ప్రాజెక్టు తెచ్చుకుంటే ? దానివల్ల 30 వేల మంది ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితి కల్పిస్తా ఉంటే... అడ్డుకునేందుకు శాయుశక్తులగా ప్రయత్నిస్తుంటే ఇలాంటి వాళ్లను ఏమనాలి ?
వీరు మన ఆర్ధిక వ్యవస్ధ గురించి, పారిశ్రామిక రంగం గురించి కూడా రోజుకొక దుష్ప్రచారం చేస్తుంటారు. మన కర్మ ఏమిటంటే.. ఆంధ్రప్రదేశ్‌లో మీడియా పూర్తిగా పోలరైజ్ అయిన పరిస్థితుల్లో మనం బ్రతుకున్నాం. ఇది బాధాకరమైన వాస్తవం. ఒక ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5, ఒక చంద్రబాబు ఇంతమంది కలిసి కేవలం వాళ్లకు సంబంధించిన వ్యక్తి ముఖ్యమంత్రి స్ధానంలో లేడు కాబట్టి... ఆ వ్యక్తిని సీఎం స్ధానంలో ఎలాగోలో కూర్చోబెట్టాలని ప్రభుత్వం మీద ఉన్నవీ లేనివీ వేసి, దుర్భిద్ధితో వ్యతిరేక ప్రచారం చేయాలన్న ఆలోచనతో రాష్ట్రాన్ని అప్రతిష్ట పాలు చేసే కార్యక్రమం చేస్తున్నారు. ఇలాంటి నీచమైన సంస్కృతి, రాజకీయాలు ఇవాళ రాష్ట్రంలో జరుగుతున్నాయి.
చంద్రబాబు పాలనలో కంటే రాష్ట్ర ఆర్ధిక వ్యవస్ధ.... మన పాలనలో బాగుందని ఏకంగా సాక్ష్యాధారలతో సహా (కాగ్ డేటా) స్లైడ్స్ తో చూపించాం.
ఇంతగా చూపించేసరికి చంద్రబాబు గారి కోపం గురించి పక్కనపెడితే.. .ఈనాడు రామోజీరావు, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ వీళ్లకు కోపం ఎక్కువపోయింది. వీళ్ల పేపర్లలో రాతలు, టీవీలలో చర్చలు చూస్తుంటే ఎంతలా వీళ్లు జీర్ణించుకోలేకపోతున్నారో ఆశ్చర్యం కలిగిస్తోంది.బాబు మీద ఈగ వాలినా కూడా వీళ్లకు కోపం వచ్చేస్తుంది.
దుష్టచతుష్టయం మధ్య ఈ బంధం ఎంత బలమైనదంటే, పెవికాల్ అడ్వరై్టజ్‌మెంట్ వస్తుంది, అది కూడా పక్కకు వెళ్లిపోవాలి. ఆ స్ధాయిలో అంత గట్టి బంధం. ఆ బంధానికి కారణం కూడా ఉంటుంది దాన్ని నేను కాదనడం లేదు. ఆ కడుపు మంట కూడా ఉంటుంది. ఆ టైంలో దోచుకో, పంచుకో, తినుకో అని పూర్తిగా చంద్రబాబునాయుడు దోచే యడం, తర్వాత ఈనాడుకి ఇంత అని, ఆంధ్రజ్యోతి, టీవీ5 ఇంత, దత్తపుత్రుడుకి ఇంత అని పంచుకునేవారు. ఒక పద్దతి ప్రకారం జరిగేది కాబట్టి.. ఎవరూ రాయరు, ఎవరూ చూపించరు, ఎవరూ మాట్లాడరు. అయితే దేవుడు, ప్రజలు వారికి మెట్టికాయలు వేసారు. వారి ప్రభుత్వం పోయి, మన ప్రభుత్వం వచ్చింది. వచ్చే ఆదాయం పోయింది కాబట్టి.. సహజంగానే జీర్ణించుకోలేక బీపీలు, టెన్షన్‌లు బయటపడుతున్నాయి. ఒక్కోసారి వాళ్ల రాతలు, టీవీల్లో వారి డిబేట్లు చూసి భయమేస్తుంది. తట్టుకోలేక ఎక్కడ వాళ్లకు గుండెపోటు వస్తుందేమోనని నాకే బాధగా అనిపిస్తుంది. ఎందుకంటే ఒక మనిషి మీద ఆ స్ధాయిలో ఈర్ష్య పెట్టుకోవడం ఎక్కడా కూడా కనీవీనీ ఎరుగం.
‘వారిది బాధ – మాది బాధ్యత’ కాబట్టి, పారిశ్రామిక రంగం గురించి క్లుప్తంగా కొన్ని విషయాలు ఈ సభ ముందు, తద్వారా ప్రజల ముందు ఉంచుతాను.
పారిశ్రామిక ప్రగతి కూడా మన పాలనలో, చంద్రబాబు కంటే బాగుంది.
ప్రపంచాన్నే కుదిపేసిన... కోవిడ్‌లో కూడా, ఇంతగా ఎఫ్‌డీఐ అన్నది తగ్గిపోయిన పరిస్థితిలో కూడా... రాష్ట్రంలో మాత్రం పారిశ్రామిక రంగంలో పెట్టుబడులు... బాగున్నాయి.
పారిశ్రామిక వేత్తలు సంతోషంగా ఉన్నారు కాబట్టే, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో వారి అభిప్రాయాలను కూడా తీసుకోవటం ప్రారంభించాక, వరసగా రెండేళ్ళలో, మొత్తంగా వరసగా మూడో ఏడాది ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో దేశంలో నంబర్ 1గా ఉన్నాం. ఈజ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో గతంలో కేవలం 10 శాతం మార్కులే పారిశ్రామిక వేత్తల అభిప్రాయాలకు చోటు ఉంటే... ఈ రోజు వందకు వంద మార్కులు కూడా పారిశ్రామిక వేత్తల అభిప్రాయాల మేరకే వేస్తున్నారు ఈ రోజు మారిన ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో. ఇటువంటి పరిస్థితుల్లో మన రాష్ట్రం వరుసగా మూడో ఏడాది ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో దేశంలోనే నెంబర్‌వన్‌గా ఉన్నామంటే పారిశ్రామిక వేత్తలు మన హయాంలో ఎంత సంతోషంగా ఉన్నారు అని చెప్పడానికి ఇదొక నిదర్శనం.
చంద్రబాబు హయాంలో డావోస్ నుంచి వచ్చిన పెట్టుబడులను కూడా గమనిస్తే.. ఆయన అక్కడ నుంచి తె తెచ్చిందానికన్నా కూడా మనం డావోస్ నుంచి తెచ్చిన పెట్టుబడులు అంత కన్నా చాలా ఎక్కువ. మొన్న దావోస్ పర్యటన, కేబినెట్‌లో ఆమోదం తెలిపినవి చూస్తే మనకు అర్ధమవుతుంది.
ఈ రాష్ట్రంలో ప్రజలంతా నా వాళ్ళే. మనకుకు ఓటు వేయని వారికి కూడా అన్ని పథకాలూ శాచురేషన్‌లో అందాలి అన్న ఆలోచన మనదైతే... చంద్రబాబు పరిస్థితి ఎలా ఉంటుందంటే.... పారిశ్రామిక వేత్తల్ని కూడా నా వాళ్ళు... నా వాళ్లు కాని వాళ్ళు ఎవరు అని చూసే కార్యక్రమం చేస్తారు. ఈ రకంగా వ్యత్యాసం చూపించే పరిస్తితి మన రాష్ట్రంలో తప్ప దేశంలో ఎక్కడా ఉండదు.
మన ఫోకస్ అంతా ఉపాధి అవకాశాలు ఎక్కువగా ఉన్న ఎంఎస్‌ఎంఈ రంగం మీద, దాన్ని నిలబెట్టే కార్యక్రమం మీద ∙ఉంది. మూడేళ్లలో దాదాపు 12 లక్షల మందికి ఉపాధి కల్పిస్తున్న ఈ రంగం మీద ఫోకస్ పెట్టాం. పారిశ్రామిక రంగానికి రూ. 2858 కోట్లకు పైగా ఇన్‌సెంటివ్స్(ప్రోత్సాహకాలు) ఇస్తే.. ఇందులో ఒక్క ఎంఎస్‌ఎంఈ రంగానికి మాత్రమే రూ.2500 కోట్లు ఇచ్చాం. ఇందులో రూ.2200 కోట్లు చంద్రబాబు నాయుడు గారి హయాంలో బకాయిలు. చిన్న చిన్న వాళ్లు పరిశ్రమలు పెడుతున్నారు. వీళ్లకు ప్రభుత్వం నుంచి రావాల్సిన ఇన్సెంటివ్‌లు రాకపోతే వీళ్లు ఎలా పరిశ్రమలు నడపగలగుతారు. వీళ్లు నడపలేకపోతే వీళ్లతో ముడిపడి ఉన్న ఉద్యోగుల పరిస్థితి ఏమిటి ? చిన్న చిన్నవాళ్లు తట్టుకోగలుగుతారా? అనే ధ్యాస కూడా గత ప్రభుత్వంలో పెట్టిన పాపానపోలేదు. ఏకంగా రూ.2200 కోట్లు గత ప్రభుత్వంలోని బకాయిలే అంటే ఏ రకంగా ఎంఎంస్‌ఎంఈ రంగాన్ని చంద్రబాబు నాయుడు గారు ఖూనీ చేశారు అన్నది అర్ధం చేసుకోవచ్చు. అటువంటి ఈ సెక్టార్ నిలదొక్కుకుంది. రూ.2500 కోట్లు ప్రోత్సాహకాలిస్తున్నాం. ఎరియర్స్ క్లియర్ చేశాం. ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా ఆ సంవత్సరానికి సంబంధించిన ఇన్సెంటివ్‌లు ఇచ్చే కార్యక్రమం రాష్ట్రంలో జరుగుతుంది. ఒక గొప్ప విప్లవాత్మక మార్పు తీసుకునిరావడం వల్ల... పారిశ్రామిక రంగం నిలబడగలుగుతుంది.
కొద్ది రోజుల క్రితమే గ్రానైట్ పరిశ్రమకు ప్రోత్సాహకాలు ప్రకటించాం.
పరిశ్రమలకు కావాల్సిన స్కిల్డ్ మ్యాన్ పవర్ విషయంలో ఏ రాష్ట్రం పెట్టని విధంగా దృష్టి సారించాం. కారణం 75 శాతం ఉద్యోగాలు అన్ని స్ధానికులకు రిజర్వ్ చేయాలని చట్టం చేశాం కాబట్టి, దానితో పాటు బాధ్యత కూడా ప్రభుత్వంపై ఉంది. అటువంటి స్కిల్డ్ మేన్‌పవర్‌ను అందుబాటులో ఉంచడం ముఖ్యమైన పాయింట్. స్కిల్డ్ మేన్‌పవర్ క్రియేట్ చేయడం కోసం ప్రత్యేక దృష్టి పెట్టాం.
పారదర్శకంగా పారిశ్రామిక విధానానాన్ని అమలు చేస్తున్నాం. నీళ్లు, విద్యుత్, రోడ్లు, రైల్వేలైన్లకు సంబం«ధించిన మౌలిక సదుపాయాలు ఎవరికి కావాలన్నా మనం కల్పిస్తున్నాం. నిజాయితీగా మనం చెప్పింది చేస్తున్నాం. ఏది చేయగలుగుతామో అదే చెబుతున్నాం, ఏది చెబుతున్నామో అదే చేస్తున్నాం. ఇష్టమొచ్చినట్టు ప్రామిస్ చేసి, తర్వాత దాన్ని ఎగరగొట్టే కార్యక్రమానికి పుల్‌స్టాప్ పడి ఏదైతే చేయగలుగుతామో అది మాత్రమే చెపుతున్నాం. ఈ గొప్ప మార్పుతో రాష్ట్ర ప్రభుత్వంపై పారిశ్రామికవేత్తలకు నమ్మకం పెరిగింది.
రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూలేని విధంగా పారిశ్రామిక దిగ్గజాలు, వారి సంస్థలు రాష్ట్రంలో కార్యకలాపాలను ప్రారంభిస్తున్నాయి. మన రాష్ట్రంవైపు ఎప్పుడూ చూడని వాళ్లు కూడా ఇవాళ మన రాష్ట్రం వైపు అడుగులు వేస్తున్నారు. ఎప్పుడైనా సెంచురీ ప్లైవుడ్ భజాంకాలు, శ్రీసిమెంట్స్ బంగర్లు, సన్ ఫార్మా సింఘ్వీలు, బిర్లాలు లాంటి వారంతా రాష్ట్రానికి వస్తున్నారు. కుమార మంగళంబిర్లా తన ప్లాంట్ కోసం మన దగ్గరికే వచ్చి, ముఖ్యమంత్రితో ప్రయాణం చేసి ఏకంగా ప్లాంట్‌ను ప్రారంభించారు. ఇదంతా నమ్మకానిస్తున్నాయి. భజంకాలు, బంగర్‌లు, సింఘ్వీలు, బిర్లాలు, ఆదానీలు, ఆర్సిలర్ మిట్టల్, ఆదిత్య బిర్లా, టాటాలు వీళ్లంతా మన రాష్ట్రానికి వస్తున్నారు. మనరాష్ట్రంలో పరిశ్రమలు పెట్టడానికి అడుగులు ముందుకు వేస్తున్నారు. వాళ్లందరికీ ఇక్కడికి వచ్చిన తర్వాత పూర్తిస్థాయిలో వారికి మద్దతిచ్చే కార్యక్రమం చేస్తున్నాం. కారణం మనం చేయగలిగినదే చెప్తున్నాం. ఇంతక ముందు లేనిదీ, మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉన్నది. ఆ పారిశ్రామికవేత్తలకు మనం ఎందుకు కాన్ఫిడెన్స్ ఇవ్వగలుగుతున్నాం, గతంలో చంద్రబాబు నాయుడు హాయంలో పారిశ్రామిక వేత్తలకు ఎందుకు నమ్మకం రాలేకపోయింది అన్నది కూడా అందరం ఆలోచన చేయాలి. కారణం ఆ టైంలో ఏం కావాలన్నా నా కెంత ? అన్నదే ముఖ్యం.
వీరంతా పార్ట్‌నర్ షిప్ సమిట్‌లో చంద్రబాబు మేకప్ చేయించి, అద్దె కోట్లు వేసి సంతకాలు చేయించిన నకిలీ పారిశ్రామిక వేత్తలు కారు... వీరంతా దేశంలోనే ప్రఖ్యాతగాంచిన సంస్దలు, యాజమాన్యాలు. ఏప్రభుత్వమైనా పారిశ్రామిక రంగానికి ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఏందుకు ఉన్నది అంటే.. ఏ ప్రభుత్వంలోనైనా పరిశ్రమలు వస్తే... దానివల్ల స్ధానికంగా ఉపాధి, ఉద్యోగాలు పెరుగుతాయన్నది ఒక కారణం అయితే రెండో కారణం పరిశ్రమల వల్ల రాష్ట్ర జీఎస్‌డీపీ ఆదాయాల్లో కూడా పెరుగుదల రిజిష్టర్‌అవుతుంది. పరిశ్రమల వల్ల ఆ యా ప్రాంతల ప్రజల క్వాలిటీ ఆఫ్ లివింగ్ కూడా మెరుగవుతుంది. మంచి జీతాలు వల్ల ఇది సాధ్యమవుతుంది. అందుకనే ఏ ప్రభుత్వమైనా పారిశ్రామక రంగాన్ని ప్రోత్సాహించాల్సి ఉంది.
ఈ అంశాలను గమనించి, సూక్ష్మ, చిన్న–మధ్య తరహా పరిశ్రమల రంగం మీద... అంటే ఎంఎస్‌ఎంఈలపై మన ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. వీళ్లను చేయిపట్టుకుని నడిపించకపోతే వీళ్లు ఫెయిల్ అవుతారు. వీళ్లు ఫెయిల్ అయితే ఉద్యోగావకాశాలు కల్పించే పరిస్థితి కూడా తగ్గిపోతుంది.
అందుకనేవాటి పునరుద్ధరణ, చేయూతపై ప్రత్యేక శ్రద్ధ వహించాం. సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు పెద్ద ఎత్తున ఉపాధి కల్పిస్తున్నాయి, అందేకే వాటికి చేదోడుగా నిలుస్తున్నాం.
ఈ ప్రోత్సాహకాల్లో భాగంగా, గత ప్రభుత్వం పెట్టిన బకాయిలనూ చెల్లించాం. క్రమం తప్పకుండా వారికి ఇన్సెంటివ్‌లు సమయానికి ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. పరిశ్రమలుకు మనం ఇస్తున్న ప్రాధాన్యం గురించి నాలుగు మాటల్లో చెప్పాలి.
ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంకింగ్స్ ఎలా ఇస్తున్నారంటే, ఈ 2020 ర్యాంకింగ్స్‌లో 97.89 పర్సెంటేజీతో మనం తొలిస్ధానం సంపాదించాం.
కరోనా వంటి మహమ్మారితో పారిశ్రామిక రంగం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న సమయంలో నిర్వహించిన సర్వేలో మన రాష్ట్రానికి దేశంలోనే నంబర్ వన్ ప్లేస్ వచ్చింది.
15 రంగాల్లో 301 సంస్కరణలు, మొట్టమొదటిసారిగా 100 శాతం మార్కులు పారిశ్రామి వేత్తల అభిప్రాయాల ఆధారంగా ఆధారంగా ఈ ర్యాంకులను ప్రకటించారు.
సర్వేలో 92 శాతం మార్కులు దాటిన ఏడు రాష్ట్రాలను టాప్ అచీవర్స్‌గా ప్రకటించారు.
ఇందులో ఏపీ 97.89 శాతంతో మొదటి స్థానంలో నిలవగా, ఆ తర్వాతి స్థానాల్లో వరుసగా గుజరాత్ (97.77%), తమిళనాడు(96.67%), తెలంగాణ (94.86%), హరియాణా (93.42%), పంజాబ్ (93.23%), కర్ణాటక (92.16%) ఉన్నాయి. ఇది మన రాష్ట్రానికి ఒక గర్వ కారణం.
రాష్ట్రంలో నమోదవుతున్న గ్రోత్ రేట్ కూడా చూస్తే అదే మాదిరిగా కనిపిస్తోంది.
2021–22 కు సంబంధించి గ్రోత్ రేటు ఈ మధ్య కాలంలో పబ్లిష్ అయ్యాయి. దాదాపు 19 రాష్ట్రాలకు సంబంధించిన పబ్లిష్డ్ డేటా కూడా ఇప్పటికే విడుదల చేశారు. అందులో 11.43 గ్రోత్ రేట్‌తో దేశంలోనే నెంబర్‌వన్ రాష్ట్రంగా మనం నిలబడ్డాం. ఇది గొప్ప అంశం. జీఎస్‌డీపీ కానిస్టెంట్ టెర్మ్స్ అంటే... ప్రైజెస్ ఆర్ కానిస్టెంట్ (2011–12 ప్రైజెస్), కానీ వస్తువులు పెరిగిన దానిమీద మనం 11.43 గ్రోత్ రేట్‌తో నంబర్‌వన్‌గా నిలబడ్డాం ఇది విజయం.
రాష్ట్రంలో మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అంటే 2019 జూన్ నుంచి, ఈయేడాది ఆగష్టు వరకు ఉత్పత్తి ప్రారంభించిన భారీ పరిశ్రమలు 99.
మనందరి ప్రభుత్వం అధికారం చేపట్టిన తరవాత ఏర్పాటయిన సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమ (ఎంఎస్‌ఎంఈ)లు 35,181 కూడా ఉత్పత్తిలోకి వచ్చాయి.
ఈ 99 భారీ పరిశ్రమల్లో పెట్టుబడులు రూ.46,280.53 కాగా, వాటి ద్వారా 62,541 మందికి ఉద్యోగావకాశాలు లభించాయి.
అదే రకంగా రూ.9,742.51 కోట్ల పెట్టుబడితో 35,181 ఎంఎస్‌ఎంఈలు ఏర్పాటు కాగా, వాటి ద్వారా 2,11,374 ఉద్యోగావకాశాలు వచ్చాయి.
ఇవి కాకుండా నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టుల వివరాలను పరిశీలిస్తే... రూ.39,655 కోట్ల పెట్టుబడులతో మరో 55 భారీ ప్రాజెక్టులు నిర్మాణ దశలో ఉన్నాయి. వీటి ద్వారా 78,792 ఉద్యోగావకాశాలు లభిస్తాయి.
మరో రూ.91,129.24 కోట్ల పెట్టుబడితో మరో 10 ప్రాజెక్టులకు సంబధించి, ప్రభుత్వంతో చర్చలు కొనసాగుతున్నాయి. ఇవి పూరై్తతే మరో 40,500 మందికి ఉద్యోగావకాశాలు దక్కనున్నాయి..
ఇవి కాక సెంట్రల్ పబ్లిక్ సెక్టార్ అండర్ టేకింగ్ ఒకసారి గమనిస్తే...
విశాఖ, కాకినాడ, కృష్ణా, శ్రీసత్యసాయి జిల్లాలలో నాలుగు భారీ ప్రభుత్వ రంగ సంస్థలు.. హెచ్‌పీసీఎల్, ఓఎన్జీసీ, బీఈఎల్ కంపెనీల ప్లాంట్లు నిర్మాణ దశలో పనులు జరుగుతున్నాయి.
మొత్తంగా రూ.1,06,800 కోట్ల పెట్టుబడితో ఈ కంపెనీలు కార్యకలాపాలు ఏర్పాటు కాబోతున్నాయి. తద్వారా 72,900 మందికి ఉపాధి, ఉద్యోగావకాశాలు లభిస్తాయి.
గత మూడేళ్ళలో కోవిడ్ ప్రపంచాన్ని ఎంతగా వణికించిందో మన అందరం దానికి సాక్ష్యులమే. ప్రపంచ వ్యాప్తంగా కోవిడ్ ప్రతి రంగం మీదా ప్రభావాన్ని చూపించింది. ప్రత్యేకించి పారిశ్రామిక, సేవా రంగాలు మీద భారీగా కోవిడ్ దెబ్బ పడింది.
అయితే, పారిశ్రామిక రంగంమీద మనందరి ప్రభుత్వం చూపిస్తున్న ఆదరణ వల్ల ఇంతటి కోవిడ్ సంక్షోభంలో కూడా ఈ రంగంలో పెట్టుబడులు మన దగ్గర పెరుగుదల నమోదైంది.
గత ప్రభుత్వం అయిదేళ్ల కాలంతో పోలిస్తే, మన మూడేళ్ళ మూడు నెలల పాలనలో ఏటా సగటున మెరుగైన పెట్టుబడులు సమకూరాయి.
భారీ పరిశ్రమలనే తీసుకుంటే, పెట్టుబడుల విలువ రూ.41,280.53 కోట్లు. అంటే ఈ మూడేళ్లలో రాష్ట్రంలో ఏటా సగటున రూ.12,702 కోట్ల పెట్టుబడులు వచ్చాయి.
ఇదే చంద్రబాబు హయాంలో 2014 నుంచి 2019 వరకు చూస్తే ఐదు సంవత్సరాలకు కలిపి... రాష్ట్రంలో రూ.59,968.37 కోట్ల పెట్టుబడితో 215 పరిశ్రమలు ఏర్పాటయ్యాయి. అంటే ఆనాడు ఏటా సగటున రూ.11,994 కోట్ల పెట్టుబడులు సమకూరాయి. అంటే చంద్రబాబు పాలన కన్నా ముందున్నామన్నదానికి ఇది నిదర్శనం.
భారీ పరిశ్రమలు పార్కుల ఏర్పాటుకు సంబంధించిన కొన్ని అంశాలను మీ ముందు ఉంచుతాను...
మొదటగా కాకినాడ జిల్లాలో బల్క్ డ్రగ్ పార్క్ ఏర్పాటు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం అంగీకరించింది.
ఈ పార్క్‌లో మౌలిక వసతుల కల్పన కోసం ఏకంగా రూ.1000 కోట్లు గ్రాంట్ కూడా వాళ్లు ఇస్తున్నారు. ఇక్కడ పరిశ్రమలు పెట్టేవాటిలో రకరకాల ఇన్సెంటివ్‌లు రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు కలిపే ఇస్తున్నాయి. వీటివల్ల దాదాపు 30 వేల మందికి ప్రత్యక్షంగానూ, పరోక్షంగానూ ఉద్యోగాలు వచ్చే కార్యక్రమం జరుగుతుంది.
బల్క్ డ్రగ్ పార్క్ కోసం 17 రాష్ట్రాలతో పాటు తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక పోటీ పడినా, చివరకు ఈ ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్‌కు దక్కింది.
రెండోది వైయస్సార్ జిల్లా కొప్పర్తిలో 800 ఎకరాల్లో వైయస్సార్ ఈఎంసీ ఏర్పాటువుతోంది. అక్కడే మెగా ఇండస్ట్రియల్ హబ్ కూడా వస్తోంది.ఈ రెండు కొప్పర్తిలో 6800 ఎకరాల్లో అభివృద్ధి చేస్తున్నాం. ఈ వైయస్సాస్ ఎలక్ట్రానిక్స్ మాన్యూఫ్యాక్చరింగ్ క్లస్టర్ (ఈఎంసీ) 800 ఎకరాల్లో ఏర్పాటు అవుతుంది. దీన్ని కేంద్ర ప్రభుత్వం (పీఎల్‌ఐ) ప్రొడక్షన్ లింక్ ఇన్సెంటివ్ స్కీమ్స్‌లో కూడా చేర్చడం జరిగింది. ఆ బెనిఫిట్స్ కూడా మనకు వస్తున్నాయి. దీనికోసం కేంద్ర ప్రభుత్వం నుంచి రూ.730.50 కోట్లు గ్రాంట్ కింద తెచ్చుకునేదానికి వేగంగా అడుగులు ముందుకు పడుతున్నాయి. ఇక్కడ కూడా ఇంతకముందు నేను చెప్పినట్టుగా... ఎలక్ట్రానిక్స్‌కు సంబంధించిన టీవీలు, సెల్‌ఫోన్లు తయారుచేసే పెద్ద క్లస్టర్ రావడం వల్ల దాదాపు 28,500 ఉద్యోగాలు అక్కడ లభ్యమవుతాయి. దీంతో పాటు మెగాఇండస్ట్రియల్ హబ్ వల్ల మరో 75వేల ఉద్యోగాలు కూడా అక్కడ రానున్నాయి. కడప జిల్లాలోనే జమ్ముల మడుగులోనే స్టీల్ ప్లాంట్ పెట్టే దిశగా అడుగులు ముందుకు పడుతున్నాయని ఈ సభ ద్వారా తెలియజేస్తున్నారు.
మూడో అంశం మల్టీ మోడల్ లాజిస్టిక్ హబ్స్.
దేశవ్యాప్తంగా 35 మల్లీమోడల్ లాజిస్టిక్స్ పార్క్‌లు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి అభివృద్ది చేస్తున్నాయి. ఇందులో మన రాష్ట్రానికి మనం మూడు పార్కులు తెచ్చుకోగలిగాం. వాటిలో విశాఖపట్నం, విజయవాడ, అనంతపురంలో ఈ పార్క్‌లు తీసుకునిరావడానికి అడుగులు వేగంగా పడుతున్నాయి. వీటివల్ల రవాణా రంగంలో స్టోరేజీలు కానీ, గోదాములు, రకరకాల ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధి చెందడం వల్ల అవకాశాలు మెరుగుపడతాయి.
నాలుగో అంశం రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధి.
రాష్ట్రంలో మూడు పారిశ్రామిక కారిడార్ల అభివృద్ధి జరుగుతుంది. ఒకే రాష్ట్రంలో మూడు పారిశ్రామిక కారిడార్లు అభివృద్ది అన్నది ఎక్కడా లేదు. మామూలుగా అయితే ఒకటి లేదా రెండు కారిడార్లు అభివృద్ధి జరుగుతాయి. కానీ మన రాష్ట్రంలో మూడు కారిడార్లు అభివృద్ధి జరుగుతుంది.
విశాఖపట్నం–చెన్నై పారిశ్రామిక కారిడార్, చెన్నై–బెంగళూరు పారిశ్రామిక కారిడార్, హైదరాబాద్–బెంగళూరు పారిశ్రామిక కారిడార్.. ఇవి మూడు జరుగుతున్నాయి.
వీటిని సా«ధ్యమైనంత వేగంగా పూర్తి చేసే లక్ష్యంతో ప్రభుత్వం పని చేస్తోంది.
ఐదో అంశం స్కిల్ డవలప్‌మెంట్...
పరిశ్రమల అవసరాలు తీర్చడంతో పాటు, యువతకు మెరుగైన ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మరింత మెరుగుపర్చే లక్ష్యంతో స్కిల్ డెవలప్‌మెంట్‌పై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది.
ఈ దిశలో 2 స్కిల్ యూనివర్సిటీలతో పాటు, 30 స్కిల్ కాలేజీలు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ప్రతి జిల్లాకు ఒకటి ఉంటుంది. ఇది కాక ఐటీఐ, పాలిటెక్నిక్ వంటì అన్నింటినీ.. ఒక డైరెక్షన్‌లోకి తీసుకువచ్చి 175 నియోజకవర్గాల్లో ఈ స్కిల్ కాలేజీలను తీసుకువస్తాం. దీనివల్ల వర్క్‌షాపులో షేర్ చేసుకునే అవకాశం ఉంటుంది. కరిక్యులమ్ పూర్తిగా డిజైన్ చేయడానికి వీటిని కూడా స్కిల్ యూనివర్సిటీకి అనుసంధానం చేస్తున్నాం. ఇవన్నీ రాబోయే రోజుల్లో కార్యరూపం దాల్చుతాయి. ఆ దిశగా అడుగులు ముందుకు పడుతున్నాయి.
ఆరో అంశం ఆంధ్రప్రదేశ్ తీరప్రాంతం...
ఆంధ్రప్రదేశ్‌కు దేశంలో రెండో అతి పెద్ద సువిశాల 974 కి.మీ తీర ప్రాంతం ఉంది. విశాఖపట్నం, కాకినాడలో ఇప్పటికే ప్రధాన పోర్టులు పని చేస్తుండగా, మరో రెండు చోట్ల.. గంగవరం, కృష్ణపట్నం వద్ద కూడా పోర్టులను అభివృద్ధి చేశాం.
వాటితో పాటు నాలుగు.. నెల్లూరు జిల్లా రామాయపట్నం, శ్రీకాకుళం జిల్లా భావనపాడు, కృష్ణా జిల్లా మచిలీపట్నం, ఇదికాక కాకినాడ జిల్లాలో కాకినాడ సెజ్ పోర్టు (ప్రైవేట్ రంగంలో)ను గ్రీన్ ఫీల్డ్ పోర్టులుగా అభివృద్ధి చేస్తున్నాం.
పోర్ట్స్ బేస్డ్ డవలప్‌మెంట్ కార్యకలాపాలు ఊపందుకుంటాయి.
వీటితోపాటు రాష్ట్రంలో మత్స్యకారులకు మరింత మేలు చేసే విధంగా అన్ని హంగులతో కూడిన 9 ఫిషింగ్ హార్బర్లను ప్రభుత్వం అభివృద్ధి చేస్తోంది.
రాష్ట్రంలో తీర ప్రాంతాల్లో 555 మత్స్యకార గ్రామాల్లో దాదాపు 6.3 లక్షల మత్స్యకారులు చేపలవేట ప్రధానవృత్తిగా జీవిస్తుండగా, 28,500 ఫిషింగ్ బోట్లు పని చేస్తున్నాయి.
9 ఫిషింగ్ హార్భర్లు...
ఇటువంటి పరిస్థితుల్లో మత్స్యకారుల జీవన ప్రమాణాలు మెరుగు పరచేందుకు తీర ప్రాంతాల్లో ఉన్న ప్రతి 50 కిలోమీటర్లకు ఒక ఫిషింగ్ హార్భర్ లేదా ఒక పోర్టు ఉండేటట్టుగా అడుగులు వేస్తూ... 9 ఫిషింగ్ హార్భర్లు కట్టే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం.
ఆ మేరకు రూ.3500 కోట్ల వ్యయంతో 9 ఫిషింగ్ హార్బర్లు నిర్మించాలని నిర్ణయించి అడుగులు ముందుకు వేస్తున్నాం.
వాటిలో తొలి దశలో భాగంగా నెల్లూరు జిల్లా జువ్వలదిన్నె, గుంటూరు జిల్లా నిజాంపట్నం, కృష్ణా జిల్లా మచిలీపట్నం, కాకినాడ జిల్లాలోని ఉప్పాడలో నాలుగు ఫిషింగ్ హార్బర్లను వచ్చే ఏడాది ఏప్రిల్ నాటికి రూ.1550 కోట్లతో పూర్తి చేసి జాతికి అంకితం చేస్తాం. మిగతా ఫిషింగ్ హార్బర్లను కూడా దశల వారీగా పూర్తి చేస్తాం. రెండో దశ కింద బియ్యపుతిప్ప, కొత్తపట్నం, పూడిమడక, బుడగట్లపాలెం, ఓడరేవులో రెండో దశ కింద పనులు ప్రారంభిస్తాం.
ఎనిమిదో అంశం– విమానాశ్రాయాలు– ఇతర మౌలిక వసతులు.
రాష్ట్రంలో ప్రస్తుతం ఆరు విమానాశ్రయాలు పని చేస్తున్నాయి.
వాటిలో విజయవాడ, విశాఖపట్నం, తిరుపతిలో అంతర్జాతీయ వియానాశ్రయాలు ఉండగా.. కడప, రాజమండ్రి, కర్నూలులో మూడు దేశీయ విమానాశ్రయాలు పని చేస్తున్నాయి.
కాగా ప్రైవేట్ భాగస్వామ్యంతో విజయనగరం జిల్లా భోగాపురంలో గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్టు ప్రాజెక్టు అంశం 34 ఎకరాలకు సంబంధించిన వివాదం కోర్టులో ఫైనల్ స్టేజ్‌లో ఉంది. అన్ని త్వరగా పరిష్కారమై.. వచ్చే నెలలో దీనికి శంకుస్ధాపన కార్యక్రమం కూడా జరుపుకుంటామని ఆశిస్తున్నాను. అదే విధంగా నెల్లూరు జిల్లాలో మరొక గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయం నిర్మించాల్సిఉంది. దగదర్తి బదులుగా మరొక ప్రాంతంలో అభివృద్ధి చేయడం జరుగుతోంది.
ఆయా విమానాశ్రయాలకు రోడ్, రైల్ కనెక్టివిటీ అభివృద్ది చేయడానికి కావాల్సిన అన్ని రకాల చర్యలపై కూడా ప్రత్యేక దృష్టి పెట్టాం. విశాఖలో భోగాపురం విమానాశ్రయం పూర్తయ్యేనాటికి రోడ్డు పూర్తి చేయాలన్న లక్ష్యంతో ఇప్పటికే దాదాపు డీపీఆర్ పూరై్తంది. దాన్ని కూడా నెల రోజుల్లో సబ్మిట్ చేస్తాం. కేంద్ర ప్రభుత్వం కూడా దానికి సపోర్ట్ చేస్తామని చెప్పారు.
ఇవి కాక ప్రభుత్వ రంగంలో ఎంతగా ఉద్యోగాలు కల్పించాలమన్నది గమనించినట్లైతే....
ప్రయివేటు రంగంలో ఉద్యోగాలు కల్పించడానికి ప్రభుత్వం ఏ రకంగా అడుగులు ముందుకు వేస్తుందన్నది ఒకవైపు చెప్తూనే.. మరో ముఖ్యమైన అంశం చెప్పాలి.
మనకు స్వతంత్య్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రభుత్వ రంగంలో ఎన్ని ఉద్యోగాలున్నాయి అన్నది చూస్తే... 3,97,128 లక్షల ఉద్యోగాలున్నాయి.
మన ప్రభుత్వం రాకమునుపు చంద్రబాబు ప్రభుత్వం ఉన్నది. ఆయన హయాంలో ఎన్ని ప్రభుత్వ ఉద్యోగాలు అదనంగా చేరాయన్నది చూస్తే.. కేవలం 34,108 ఉద్యోగాలు మాత్రమే.
మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ మూడు సంవత్సరాల కాలంలోనే ప్రభుత్వ రంగంలో ఎన్ని ఉద్యోగాలు కల్పించామో చూస్తే.. స్వతంత్య్రం వచ్చినప్పటి నుంచి మనకు∙3,97,128 ఉద్యోగాలు వస్తే... మన ప్రభుత్వం వచ్చిన ఈ మూడేళ్లలో మరో 2,06,638 ఉద్యోగాలు కల్పించాం. అంటే దాదాపు సగం ఉద్యోగాలు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత భర్తీ చేయగలిగాం.
ఇవి కాక కాంట్రాక్ట్ రంగంలో మరో 37,908 ఉద్యోగాలు భర్తీ చే శాం. అవుట్ సోర్సింగ్‌లో 3.71 లక్షల ఉద్యోగాలు కల్పించాం. మొత్తంగా 6,16,323 ఉద్యోగాలు మనం వచ్చిన తర్వాత మూడేళ్లలో రెగ్యులర్, కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ విధానంలో ఉద్యోగాలు ఇవ్వగలిగాం.
ఒక్క గ్రామ, వార్డు సచివాలయాల్లో మాత్రమే 1,25,110 ఉద్యోగాలు కల్పించాం. మన పిల్లలు ఇక్కడ కనిపిస్తున్నారు. ఇందులో 83 నుంచి 84 శాతం నా ఎస్సీ, ఎస్టీ,బీసీ, మైనార్టీ అక్కచెల్లెమ్మలే. ఇదొక గొప్ప విప్లవాత్మక మార్పు. మరో 51,387 ఉద్యోగాలు ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం వల్ల దశాబ్దాల వారి కల నెరవేరింది.వారికి ఉద్యోగాలు కల్పించాం. వైద్య ఆరోగ్య రంగంలో ఎప్పుడూ జరగని విధంగా 16,880 రెగ్యులర్ ఉద్యోగాలు భర్తీ చేశాం. పాఠశాల విద్యాశాఖలో 6,360 ఉద్యోగాలు భర్తీ చేశాం. ఇలా రెగ్యులర్ విధానంలో 2,06,637 ఉద్యోగాలిచ్చాం. ఇక ఆప్కాస్ క్రియట్ చేసి అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు గొప్ప మేలు చేశాం. గతంలో లంచాలు తీసుకునేవాళ్లు. జీతం పూర్తిగా ఉద్యోగులకు అందేది కాదు. ఉద్యోగం ఇచ్చేటప్పుడూ లంచాలే, మరలా జీతాలిచ్చేటప్పుడు కూడా లంచాలు తీసుకునే అధ్వాన్నమైన పరిస్థితిలో ఉండే వ్యవస్ధ నుంచి పూర్తిగా వారికి మేలు చేసేలా ఆప్కాస్ క్రియేట్ చేశాం. 95,212 మంది ఇవాళ ఆప్కాస్‌లో జీతాలు తీసుకుంటున్నారు. ఈ 6.16 లక్షల ఉద్యోగాల్లో అవుట్ సోర్సింగ్‌లో ఉన్న 3.71 లక్షల ఉద్యోగాలున్నాయి. వీటిలో 2,60,867 ఉద్యోగాలు వాలంటీర్లగా నియమించాం. 50 ఇళ్లకు ఒక వాలంటీర్‌గా పొద్దున్నే లేచి గుడ్ మార్నింగ్ చెప్తూ సేవలందిస్తున్నారు. నేను చెప్తున్న 6,16,323 మంది ఉద్యోగులు మన కళ్లముందే కనిపిస్తున్నారు. ఎవరైనా జగన్ ప్రభుత్వం ఉద్యోగాలివ్వలేదని చెప్తే... అవి పచ్చి అబద్దాలు అని చెప్పడానికి ఈ ఉద్యోగాలే సాక్ష్యం. ఇవి ప్రతి ఒక్కరికీ కనిపిస్తాయి. రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్నది వాస్తవాలు అని చెప్పడానికి ఇవే నిదర్శనాలు.
ఇంకో గొప్ప విప్లవాత్మక మార్పు కూడా తీసుకొచ్చాం. సెల్ఫ్ ఎంప్లాయిడ్ సెక్షన్. దీన్ని ప్రొత్సహించాల్సిన అవసరం ఎందుకు ఉన్నదంటే.. వీళ్లు తమ కాళ్లుమీద తాము నిలబడితే తమ కుటుంబాలను పోషించుకునే స్ధాయిలోకి వెళ్తారు. ఆలా కాకపోతే మొత్తం వ్యవస్ధనే కుప్పకూలిపోయే పరిస్థితిఉంటుంది. కాబట్టి ఈ సెల్ఫ్ ఎంప్లాయిడ్ కేటగిరీలో ఉన్నవాళ్లను ప్రోత్సహించి నిలబెట్టడం అంతే అవసరమని చెప్పి మనస్ఫూర్తిగా మన ప్రభుత్వం నమ్మింది. కాబట్టి మన ప్రభుత్వం వైయస్సార్ వాహనమిత్ర ద్వారా 2,74,015 మంది కుటుంబాలకు సొంతంగా ఆటోలు, టాక్సీలు కొని నడుపుకుంటున్నవారికి మేలు జరుగుతుంది.
జగనన్న చేదోడు కింద రజకలు, టైలర్లు, నాయి బ్రాహ్మణులకు సంబంధించి వాళ్లంతట వాళ్లే షాపు పెట్టుకుని కుట్టుమిషన్, నాయీ బ్రాహ్ముణలు వారి షాపు పెట్టుకుని, ఇస్త్రీ పెట్టతో రజకలు షాపు పెట్టుకున్న 2,98,428 కుటుంబాలకు ప్రతి సంవత్సరం తోడుగాఉంటూ వారి కాళ్ల మీద నిలబడే కార్యక్రమం చేస్తున్నాం.
వైయస్సార్ నేతన్న నేస్తం ద్వారా మరో 82 వేల మంది మగ్గం మీద స్వయం ఉఫాధి«ని పొందుతున్న వారికి మేలు చేస్తున్నాం.
మత్స్యకార భరోసా కింది 1.20 లక్షల కుటుంబాలకు ప్రతియేటా వారికి తోడుగా నిలబడుతున్నాం. అన్ని రకాలుగా చేయిపట్టుకుని నడిపించే కార్యక్రమం చేస్తున్నాం.
ఎంఎస్‌ఎంఈ రీస్టార్ట్ పథకం కింద రూ.1324 కోట్లు సపోర్టు చేసి వారికాళ్ల మీద వారు నిలబడే కార్యక్రమం చేశాం. బియ్యం సరఫరా చేసే వాహనాల ద్వారా ప్రతి ఇంటికి డోర్ డెలివరీ చేస్తూ... 18,520 మంది వాటి మీద ఆధారపడి జీవిస్తున్నారు. వారికి మద్ధతుగా నిలిచాం.
జగనన్న తోడు కింద స్ట్రీట్ హాకర్స్ కూరగాయలు అమ్మకం వంటి చిన్న చిన్న వ్యాపారాలు చేసేవారికి 15,03, 558 మందికి, వారి జీవనోపాధికి భంగంకలగకుండా, అధిక వడ్డీలు బాధ వారికి తప్పించి సున్నావడ్డీకే, ఓడీ మాదిరిగా రుణాలు ఇస్తున్నాం.
ప్రతి ఆర్బీకే పరిధిలో కస్టమ్ హైరింగ్ సెంటర్లను ఏర్పాటుచేసి, గ్రూపులను ఏర్పాటుచేసి, మిగిలిన రైతులకు కూడా ఉపయోపడేలా, ఆయంత్రాలమీద వారి జీవనం కూడా వారు గడిపేలా వాళ్లకు కూడామంచి జరిగేట్టుగా 34,580 మంది కస్టమ్ హైరింగ్ సెంటర్ల ద్వారా ఉపాధి పొందుతున్నారు.
వైయస్సార్ చేయూత ద్వారా 24,95,714 మంది అక్కలు వారి కాళ్లమీద వారు నిలబేట్టుగా ప్రతి సంవత్సరం రూ.18,750లు ఇస్తూ నాలుగేళ్లపాటు క్రమం తప్పకుండా అదే అక్కచెల్లెమ్మకు వరుసగా క్రమం తప్పకుండా ఇస్తున్నాం.
బ్యాంకర్లతో టై అప్ చేసి, ఐటీసీ, హిందుస్థాన్ లీవర్, ప్రాక్టర్ అండ్ గాంబిల్, అమూల్ లాంటి కంపెనీలతో టై అప్ చేసి వారి కాళ్లమీద వారు నిలబేట్టుగా చేస్తున్నాం.
వైయస్సార్ కాపునేస్తం మీద మరో 3,38,792 మంది అక్కలకు తోడుగా నిలబడుతున్నాం.
వైయస్సార్ ఈబీసీ నేస్తం కింద 3,92,674 మంది అక్కలకు కూడా మంచి చేస్తున్నాం. ప్రతి సంవత్సరం అదే అక్కకు ఇస్తూ వారి కాళ్లమీద వాళ్లు నిలబడేలా చేస్తున్నాం.
ఏకంగా 55,57,939 మందికి స్వయం ఉపాధి రంగంలో మనం చేయిపట్టుకుని నడిపిస్తున్నాం. అందుకని వారంతా కూడా నిదొక్కుకున్నారు. వారంతా కూడా ఈరోజు బాగుపడే కార్యక్రమం జరుగుతుంది. అందుకనే ఇవాళ రాష్ట్రంలో 11.43 శాతం గ్రోత్ రేట్‌తో దేశంలో నంబర్ ఒన్‌గా ఉన్నాం. చిట్కా ఏంటంటే.. ఈ కార్యక్రమల ఫలితమే. స్వయం ఉపాధితో వారు జీవితం గడుపుతున్నారు.
మూడు నాలుగు దశాబ్దాలుగా రాజకీయాలను చూస్తున్నవారంతా మిగతావారికీ, యంగ్ జనరేషన్‌కూ బాబు అండ్‌కో గురించి చెప్పాలి.
ప్రజలు బాగుంటే చంద్రబాబు బాధగా, కోపంగా ఉంటాడు అని చెప్పాలి. మూడు నాలుగు దశాబ్దాలుగా రాజకీయాలను చూస్తున్నవాళ్లంతా కూడా మిగతా యంగ్ జనరేషన్‌కు బాబు అండ్ కో గురించి చెప్పాలి.
ప్రజలు బాధగా ఉంటే చంద్రబాబు ఆనందంగా ఉంటాడు.
తాను అధికారంలో ఉండగా చంద్రబాబు ప్రజలకు మంచి చేసిన చరిత్ర లేనేలేదు. ఒక్కటంటే ఒక్క స్కీలం తాను చెప్పలేదు. ... చేయలేడు... చేసిన చరిత్ర లేదు.
తాను ప్రతిపక్షంలో ఉంటే... రాష్ట్రానికి ఏ మంచి జరిగినా చంద్రబాబు తట్టుకోలేడు. మంచి జరుగుతుంటే ఏడ్వటంలో చంద్రబాబును మించినవారు లేరు, ఉండరు.
బాబు అండ్ కో దుష్టచతుష్టయం మన రాష్ట్రానికి పరిశ్రమలు వస్తుంటే ఏడుస్తారు. మన గ్రోత్‌రేట్‌ను చూసి ఏడుస్తారు. మన ఆర్థిక పరిస్థితి వారి హయాంలో కన్నా మెరుగ్గా ఉందని అర్థమవుతుంటే ఏడుస్తారు. మనం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ పేద వర్గాలకు రూ.1.65 లక్షల కోట్లు డీబీటీ ద్వారా అందించాం అంటే ఏడుస్తారు.
పేదల పిల్లలకు గవర్నమెంటు బడిలో ఇంగ్లీష్ మీడియం సీబీఎస్‌ఈ చదువులు చదివిస్తాం అంటే ఏడుస్తారు.
మూడు ప్రాంతాల ఆత్మ గౌరవాన్నీ కాపాడుతూ డీసెంట్రలైజేషన్ చేస్తాం అంటే ఏడుస్తారు.
మన పాలనలో వర్షాలు బాగా పడితే, పంటలు బాగా పండుతుంటే ఏడుస్తారు. మన రిజర్వాయర్లు వరసగా నాలుగో ఏడాది నిండితే ఏడుస్తారు. మనం అందరం ఆలోచన చేయాలి. ఇలాంటి ప్రతిపక్షంతో, ఇలాంటి దుష్టచతుష్టయంతో మనం వేగుతున్నాం.
ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో చంద్రబాబు పోషించినపాత్ర ఏమిటంటే నాలుగు ఉదాహరణలు కూడా దొరకవు. ఈ రాష్ట్రాన్ని నాశనం చేయడంలో ఆయన పాత్ర ఏమిటంటే కోకొల్లుగా ఉదాహరణలు దొరుకుతాయి.
వ్యవసాయాన్ని దండగ అన్నది ఎవరంటే... బాబే అంటారు.
– రైతును దారుణంగా దెబ్బ తీసినది ఎవరంటే... బాబే అంటారు.
– పల్లెల్ని ఘోరంగా దెబ్బతీసినది ఎవరు అంటే... బాబే అంటారు.
– కరువుకు కేరాఫ్ ఎడ్రస్ ఎవరు అంటే... బాబే అంటారు.
మేనిఫెస్టోలో ఇచ్చిన వాగ్దానాలను మోసాలుగా మార్చింది ఎవరు అంటే... బాబే అంటారు.
బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ వర్గాల అభివృద్ధికి ప్రథమ శత్రువు ఎవరు అంటే... సమాధానం– పెత్తందారీ బాబే అంటారు.
చివరికి మన అక్కచెల్లెమ్మలకు ఇచ్చిన ప్రతి వాగ్దానాన్నీ తప్పింది ఎవరు అంటే... అది కూడా బాబు–బాబు–బాబే అంటారు.
అంతే కాకుండా;
– సొంత పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచింది ఎవరంటే... బాబే అంటారు.
– సీఎం పదవి, ట్రస్టు, పార్టీ... అన్నింటినీ లాక్కున్న పుణ్యపురుషుడు ఎవరంటే... బాబే అంటారు.
– ఆంధ్రప్రదేశ్ విభజనకు తొలి ఓటు వేసింది ఎవరంటే... బాబు పార్టీనే అంటారు. సుజనాచౌదరినే అనుకుంటా నేనే తొలిఓటు వేశానని చెప్పారు.
ఆ తరవాత రాష్ట్రానికి 10 సంవత్సరాలు రావాల్సిన ప్రత్యేక హోదాను పోగొట్టింది ఎవరు అంటే... అదీ బా»ే .
– ప్రత్యేక హోదాను వదులుకుని... పరిశ్రమల్ని, ఉద్యోగాల్ని కూడా తాకట్టు పెట్టి ఈ రాష్ట్రానికి, ఇంటింటికీ ద్రోహం చేసింది ఎవరు అంటే... బాబు.
– పోలవరం ప్రాజెక్టు కమిషన్ల కోసం ప్రత్యేక హోదాను వదులుకుని; ప్రత్యేక ప్యాకేజీ అంతకంటే గొప్పది అని పాంప్లెట్లు వేసి ప్రెస్‌మీట్లు పెట్టి,అసెంబ్లీని సైతం వాడుకుని, రాష్ట్రాన్ని కోలుకోలేని దెబ్బ కొట్టింది ఎవరు అంటే... బాబే.
పారిశ్రామిక రంగంలో రాని పెట్టుబడుల్ని... ఎయిర్‌బస్, హైపర్ లూప్, ఒలింపిక్స్, మైక్రోసాప్ట్, అమరావతి మొత్తానికి ఏసీ ఇలా రానిపెట్టుబడులను వచ్చాయని చూపించి దొంగ లెక్కలు వేయటంలో అంతర్జాతీయ నిపుణుడు ఎవరు అంటే.... సమాధానం బాబే.
10 ఏళ్ళు హైదరాబాద్ ఉమ్మడి రాజధాని అయితే... ఓటుకు కోట్లిస్తూ దొరికిపోయి పారిపోయి వచ్చినది ఎవరంటే... అదీ బాబే.
ఇన్‌సైడర్ ట్రేడింగ్‌లో వేల కోట్లు నొక్కేసే డిజైన్‌గా రాజధాని అనే పేరుతో డిసైడ్ చేసి డ్రామా ఆడింది బాబు... ఆ వేల కోట్లు రావన్న భయంతో ఇప్పుడు యాత్రలు పెట్టింది.. బాబే.
ఇదీ చంద్రబాబు నాయుడుగారి గుణశీల సంపద. ఇదీ ఆయన క్యారెక్టర్. ఇటువంటి వ్యక్తి గురించి ఎంత ఎక్కువ మాట్లాటినా కూడా తక్కువే. ఇటువంటి చంద్రబాబును ఎట్టి పరిస్థితుల్లోనూ మరలా అధికారంలోకి తీసుకుని రావాలి, లేకపోతే దోచుకో, పంచుకో, తినుకో అన్నది ఉండదు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ ఆయన్ను అధికారంలోకి తీసుకురావడానికి తాపత్రయపడే ఈనాడు, ఆంధ్రజ్యోతి,టీవీ5, దత్తపుత్రుడు ఇంత మందితో యుద్ధం చేయగలుగుతున్నామంటే దేవుడి దయ, ప్రజలందరి చల్లని దీవెనలతో మాత్రమే ఇది సాధ్యమవుతోంది.