కేబినెట్‌లో ఉన్న మంత్రులందరూ మంచివాళ్లే

 సీఎం వైయ‌స్ జగన్‌ 
 

అమరావతి: కేబినెట్‌లో ఉన్న మంత్రులందరూ మంచివాళ్లే అని,  మీలో కొందరు మంత్రులుగా కొనసాగుతారని ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ అన్నారు. ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన గురువారం సమావేశమైన ఏపీ కేబినెట్‌ భేటీ ముగిసింది. ఏప్రిల్‌ 11న మంత్రి వర్గాన్ని పునర్‌ వ్యవస్థీకరిస్తున్న నేపథ్యంలో కేబినెట్‌లోని 24 మంది మంత్రులు రాజీనామా చేశారు. మంత్రులంతా తమ రాజీనామా లేఖలను సీఎం వైయ‌స్ జగన్‌కు అందజేశారు. ఈ సందర్భంగా సీఎం వైయ‌స్ జగన్‌ కీలక వ్యాఖ్యలు చేశారు.

మంత్రుల అనుభవాన్ని దృష్టిలో ఉంచుకుని తొలి విడత కేబినేట్‌లో అవకాశం ఇచ్చినట్లు సీఎం వైయ‌స్ జగన్‌ తెలిపారు.. ఇప్పుడున్న వారంతా పార్టీ బాధ్యతల్లోకి వెళ్తారని, తమకున్న విశేష అనుభవాన్ని పార్టీ కోసం వినియోగించుకోవాలని సూచించారు. అందరికీ జిల్లాల్లో పార్టీ బాధ్యతలు అప్పగిస్తామని వెల్లడించారు. ఈ భవిష్యత్‌లో మీకెవ్వరికి గౌరవం తగ్గదు. పార్టీ కోసం పనిచేసిన వాళ్లు మళ్లీ మంత్రులుగా వస్తారని సీఎం జగన్‌ స్పష్టం చేశారు.

 
కాగా, మూడేళ్లపాటు ప్రభుత్వంలో మా బాధ్యతలను మేం నిర్వహించామని మంత్రులు ఈ సందర్భంగా సీఎం వైయ‌స్ జగన్‌కు వివరించారు. అభివృద్ది, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లామన్న సంతృప్తి మాలో ఉందని మంత్రులు తెలియజేశారు. ఇక మిగిలిన రెండేళ్లపాటు పార్టీ కోసం పనిచేసి.. పార్టీని పటిష్టం చేస్తామని మంత్రులు సీఎం వైయ‌స్ జగన్‌తో అన్నారు.

తాజా వీడియోలు

Back to Top