విజయవాడ: “జగనన్న ఆణిముత్యాలు’’ కార్యక్రమంలో భాగంగా రాష్ట్రస్థాయి టెన్త్, ఇంటర్ ప్రభుత్వ సంస్థల విద్యార్థులకు ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి అవార్డులు ప్రదానం చేశారు. అవార్డులు ప్రదానం చేస్తూనే విద్యార్థులు, వారి కుటుంబ సభ్యులు యోగ క్షేమాలు, వారి నేపథ్యాలను అడిగి తెలుసుకున్న సీఎం. పిల్లలకు మేనమామలా వారి సమస్యలను తెలుసుకుని సీఎం వైయస్ జగన్ వెంటనే స్పందించారు. అవార్డుల ప్రదానోత్సవంలో తాము ఎదుర్కొంటున్న సమస్యలను సీఎం దృష్టికి కొంతమంది విద్యార్థులు తీసుకువచ్చారు. టెన్త్ టాపర్స్‌లో ఒకరిగా నిలిచిన తన తల్లికి లంగ్ క్యాన్సర్ సోకిందని సీఎం దృష్టికి తీసుకు వచ్చిన విద్యార్థిని. తల్లికి ఇంత కష్టం వచ్చినా చక్కగా చదువుతున్నావంటూ అభినందించిన సీఎం. విద్యార్థిని తల్లికి మంచి వైద్యం అందేలా ఆదేశించిన సీఎం. - తనకు అమ్మానాన్న లేరని, కుటుంబ సభ్యురాలైన టీచర్ వద్ద ఉండి చదువుకుంటున్నానని, తాజాగా ఆమె బదిలీ అయ్యిందని, దీంతో తనకు ఇబ్బంది వచ్చిందని సీఎం దృష్టికి తీసుకు వచ్చిన మరొక విద్యార్థి. వెంటనే తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా అధికారులను సీఎం వైయస్ జగన్ ఆదేశించారు. - ఉత్తమ విద్యార్థులందరితో గ్రూప్ ఫొటో దిగిన ముఖ్యమంత్రి. అదే సమయంలో ఇంటరాక్టివ్ ఫ్లాట్ ఫానెల్స్ ఉపయోగంపై విద్యార్థులతో సీఎం వైయస్ జగన్ ముచ్చటించారు. ఐఎఫ్‌పీ ప్యాలెన్స్‌ను ఎలా వినియోగించుకోవాలో, అగ్‌మెంట్ రియాల్టీలో కూడా పాఠ్యాంశాలను ఎలా నేర్చుకోవచ్చో… తనకోసం అధికారులు డెమో ఏర్పాటు చేశారని విద్యార్థులకు చెప్పిన సీఎం. ఆ డెమో…. ముఖ్యమంత్రిగా తనకోసం ఏర్పాటు చేసినా.. ఆణిముత్యాలైన ఇక్కడున్న విద్యార్థులంతా పరిశీలించాలన్న సీఎం. ఈ కార్యక్రమం చివరల్లో ఆ డెమోను విద్యార్థులందరూ చూడాలన్న సీఎం. ఐఎఫ్‌పీ ప్యానెల్స్‌ను పూర్తిస్థాయిలో ఎలా వినియోగించుకోవాలి? విద్యార్థులకు బాగా అర్థం కావాలంటే.. ఇంకా ఎలా ఉండాలి? అన్నదానిపై అధికారులతో తమ అభిప్రాయాలను పంచుకోవాలని విద్యార్థులకు సీఎం వైయస్ జగన్ సూచించారు. సీఎం సూచనమేరకు డెమోను పరిశీలించిన విద్యార్థులు.