నిమ్మగడ్డ ఏకపక్ష నిర్ణయం వెనుక కుట్ర కోణం

చీఫ్‌విప్‌ గడికోట శ్రీకాంత్‌రెడ్డి
 

వైయస్‌ఆర్‌ జిల్లా: ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేష్‌ ఏకపక్ష నిర్ణయం వెనుక కుట్రకోణం దాగి ఉందని ప్రభుత్వ చీఫ్‌ విప్‌ గడికోట శ్రీకాంత్‌రెడ్డి అనుమానం వ్యక్తం చేశారు. కోర్టు ఆదేశాలను సైతం నిమ్మగడ్డ లెక్కచేయట్లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు డైరెక్షన్‌లోనే నిమ్మగడ్డ రమేష్‌ పని చేస్తున్నారని విమర్శించారు. చంద్రబాబు చెప్పిందే ఆయన చేస్తున్నారు. కరోనా కేసులు తక్కువగా ఉన్నప్పుడు నిమ్మగడ్డ ఎన్నికలను వాయిదా వేశారు. ఇప్పుడు కరోనా సెకండ్‌ వేవ్‌ వేగంగా వ్యాప్తి చెందుతోంది. వ్యాక్సినేషన్‌ ప్రక్రియలో యంత్రాంగమంతా నిమగ్నమై ఉంది. ఇలాంటి సమయంలో ఎన్నికల షెడ్యూల్‌ విడుదల చేశారు. నిమ్మగడ్డ తన నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాల‌ని గ‌డికోట శ్రీ‌కాంత్‌రెడ్డి  డిమాండ్‌ చేశారు. 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top