అచంచలమైన నమ్మకం ఉంచినందుకు ధ‌న్య‌వాదాలు

`జ‌గ‌న‌న్నే మా భ‌విష్య‌త్తు` రెస్పాన్స్‌పై ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ ట్వీట్‌

తాడేప‌ల్లి: `జగనన్నే మా భవిష్యత్తు` మెగా సర్వేలో 1.45 కోట్ల కుటుంబాలకు వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ  చేరువైంది. దేశ చరిత్రలో ఏ రాజకీయ పార్టీ చేయని భారీ మెగా పీపుల్స్ సర్వేగా ‘జగనన్నే మా భవిష్యత్తు’ నిలిచింది. ఈ కార్యక్రమాన్ని అద్భుతంగా విజయవంతం చేసిన రాష్ట్ర ప్రజలకు, వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ  క్యాడర్‌కు ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.

`మన పాలన పట్ల, మన ప్రభుత్వ విధానాల పట్ల అచంచలమైన నమ్మకాన్ని ఉంచి ఫోన్లు చేసి నాకు మద్దతు తెలిపిన 1.16కోట్ల కుటుంబాలకు, ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్యాడర్‌కు ధన్యవాదాలు. మీకు మరింత సేవ చేసేందుకు, దేవుని దయ మీ చల్లని ఆశీస్సులు ఎప్పుడూ ఉండాలని మనసారా కోరుకుంటున్నాను` అని సీఎం వైయ‌స్ జ‌గ‌న్ ట్వీట్ చేశారు. 

Back to Top