ఘ‌నంగా సీఎం వైయ‌స్ జ‌గ‌న్ ముంద‌స్తు జ‌న్మ‌దిన వేడుక‌లు 

పేద‌ల‌కు దుప్పట్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే శంబంగి

విజ‌య‌న‌గ‌రం:  వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షులు, ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ముంద‌స్తు జ‌న్మ‌దిన వేడుక‌లు బొబ్బిలి నియోజ‌క‌వ‌ర్గంలో సోమ‌వారం ఘ‌నంగా నిర్వ‌హించారు.  బొబ్బిలి పురపాలక సంఘం 30వ వార్డులో మున్సిపల్ కో-ఆప్షన్ సభ్యులు రియాజ్ ఖాన్ ఆధ్వర్యంలో ఈ నెల 21వ తేదీన ముఖ్యమంత్రి వైయ‌స్ జ‌గ‌న్ గారి జన్మదినాన్ని పురస్కరించుకుని సోమవారం పట్టణంలోని పలువురు పేదలకు స్థానిక శాసనసభ్యులు శంబంగి వెంకట చిన అప్పలనాయుడు చేతుల మీదుగా దుప్పట్లు పంపిణీ చేశారు.  కార్యక్రమంలో ఎమ్మెల్యే సోదరులు శంబంగి వేణుగోపాలనాయుడు, మున్సిపల్ చైర్మన్ సావు వెంకట మురళీకృష్ణారావు, బుడా ప్రతినిది ఇంటి గోపాలరావు,కౌన్సిలర్లు వాడపల్లి వనజ కుమారి,బొత్స రమణమ్మ, వైయ‌స్ఆర్‌సీపీ నాయకులు వాడపల్లి మనోజ్, రేజేటి ఈశ్వరరావు,మండల జనార్ధన్,దిబ్బగోపి,తుట్ట తిరుపతి,పట్టణంలో గల ముఖ్య నాయకులు, తదితరులు హాజరయ్యారు. 

Back to Top