ఇచ్చిన మాట ప్రకారం రూపాయికే టిడ్కో ఇల్లు అందిస్తున్నా

నా అక్కచెల్లెమ్మల కుటుంబాల్లో అన్నగా, తమ్ముడిగా వెలుగులు నింపుతున్నా

ఈ అవకాశం ఇచ్చిన దేవుడికి హృదయపూర్వక కృతజ్ఞతలు

రాష్ట్ర వ్యాప్తంగా ఇళ్ల నిర్మాణం మహాయజ్ఞంలా కొనసాగుతోంది

30.60 లక్షల మంది అక్కచెల్లెమ్మలకు ఇళ్ల పట్టాలు అందించాం

రాష్ట్ర వ్యాప్తంగా 17 వేల జగనన్న కాలనీలు నిర్మాణంలో ఉన్నాయి

గుడివాడ అల్లుడినని చెప్పుకునే చంద్రబాబు ఒక్క సెంటు స్థలమైనా పేదలకు ఇచ్చాడా..?

టిడ్కో ఇళ్ల కోసం చంద్రబాబు పేదల పేరున అప్పు రాశారు

ఆ అప్పును ప్రతినెలా రూ.3 వేల చొప్పున 20 ఏళ్లు వసూలు చేయాలని చూశాడు

టిడ్కో ఇళ్లలో గుమస్తాగిరి కూడా చంద్రబాబు సరిగ్గా చేయలేదు

గుడివాడ బహిరంగ సభలో ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి

గుడివాడ: ‘‘దేవుడి దయ, ప్ర‌జ‌ల ఆశీర్వాదంతో మనం అధికారంలోకి వచ్చిన తరువాత లబ్ధిదారులకు 300 అడుగుల టిడ్కో ఇళ్లు.. ఒక్క రూపాయికే ఉచితంగా అందిస్తానని ఇదే గుడివాడ బహిరంగ సభ సాక్షిగా చెప్పాను. ఎన్నికల సభలో ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ నా అక్కచెల్లెమ్మలకు రూపాయికే టిడ్కో ఇళ్లు ఉచితంగా అందిస్తున్నా. ఇదిగో ఆ ఇళ్లు.. ఇదిగో ఆ ఊళ్లూ అని గుడివాడ నుంచి రాష్ట్రానికే కాదు.. దేశానికి చూపిస్తున్నా’’ అని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. లక్షల మంది అక్కచెల్లెమ్మల కుటుంబాల్లో వెలుగు నింపడానికి అవకాశం ఇచ్చిన దేవుడికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. గుడివాడలో నిర్మించిన టిడ్కో ఇళ్లను సీఎం వైయస్‌ జగన్‌ లబ్ధిదారులకు అందజేశారు. అంతకుముందు బహిరంగ సభలో అక్కచెల్లెమ్మలను ఉద్దేశించి సీఎం ప్రసంగించారు

సీఎం వైయస్‌ జగన్‌ ఏం మాట్లాడారంటే..
‘‘బయట తీవ్రమైన ఎండను ఏమాత్రం ఖాతరు చేయకుండా చిక్కటి చిరునవ్వులతో ఆప్యాయతలు, ప్రేమానురాగాలు చూపిస్తున్న ప్రతి అక్కకు, ప్రతి చెల్లెమ్మకు, ప్రతి అవ్వకు, ప్రతి తాతకు, ప్రతి సోదరుడికి, ప్రతి స్నేహితుడికి ముందుగా రెండు చేతులు జోడించి పేరుపేరునా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. 

దేవుడి దయతో మంచి కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం. అక్కచెల్లెమ్మలను హక్కుదారులుగా ఆయా కుటుంబాల చరిత్రను మార్చేలా.. మనం కడుతున్నది ఇళ్లు కాదు.. ఊళ్లు అని చూపించే గొప్ప కార్యక్రమం గుడివాడలో జరుగుతుంది. మనం కడుతున్నది ఇళ్లు కాదు.. ఊళ్లు కడుతున్నామని గతంలో చెప్పాను. దేవుడి దయ వల్ల మనం అధికారంలోకి వచ్చిన తరువాత లబ్ధిదారులకు 300 అడుగుల టిడ్కో ఇళ్లు.. ఒక్క రూపాయికే ఇస్తామని గుడివాడ బహిరంగ సభలో చెప్పాను. నేను చెప్పిన విధంగా ఈరోజు దాన్ని నిజంచేసి చూపిస్తూ ఇవిగో ఆ ఇళ్లు.. ఇదిగో ఆ ఊళ్లూ అని ఇక్కడ నుంచి రాష్ట్రానికి కాదు.. దేశానికి చూపిస్తున్నాం. 

ఈ లేఅవుట్‌లో అక్షరాల 257 ఎకరాల స్థలం సేకరించి పక్కన టిడ్కో ఇళ్లు, మరోపక్క పేదలకిచ్చిన ఇళ్ల స్థలాల్లో నిర్మాణంలో ఉన్న ఇళ్లు. వీటన్నింటి మధ్య కొత్త గుడివాడ నగరం కనిపిస్తోంది. జగనన్న కాలనీల్లో అక్షరాల 16,240 కుటుంబాలు. ఇంటికి కనీసం ముగ్గురు చొప్పున తీసుకున్నా.. కనీసం అంటే 40 వేల పైచిలుకు జనాభా ఇక్కడే ఈ జగనన్న లేఅవుట్‌లో నివాసం ఉండబోతున్నారు. 

టిడ్కో ఇళ్లు అక్షరాల రూ.800 కోట్లతో 8,912 ఇళ్లు నిర్మించడమే కాకుండా.. ఆ ఇళ్లను నా అక్కచెల్లెమ్మలకు ఇచ్చే కార్యక్రమం నేడు జరుగుతుంది. ఇదే లేఅవుట్‌లో అక్షరాల 7,728 ఇళ్ల స్థలాలను ఇళ్లు లేని నా నిరుపేద అక్కచెల్లెమ్మలకు అందించాం. ఈ లేఅవుట్‌లో 7,728 ఇళ్ల స్థలాలు, 8,912 టిడ్కో ఇళ్లతో కలిపి అక్షరాల 16,240 ఇళ్లలో కుటుంబాలు నివాసం ఉండబోతున్నాయి. 
గుడివాడ నియోజకవర్గం మొత్తం చూస్తే.. 7,728 ఇళ్ల పట్టాలతో కలిపితే నియోజకవర్గంలో మొత్తంగా 13,145 మంది నా అక్కచెల్లెమ్మలకు ఇళ్ల పట్టాలు అందించాం. 8,912 టిడ్కో ఇళ్లు కూడా కలిపితే.. ఈ ఒక్క నియోజకవర్గంలోనే 22 వేల మంది నా అక్కచెల్లెమ్మలకు ఇళ్లు, ఇళ్ల స్థలాలు ఇవ్వడం జరిగిందని చెప్పడానికి మీ బిడ్డగా గర్వపడుతున్నాను. 

లేఅవుట్‌లో అక్కచెల్లెమ్మలకు ఇచ్చిన స్థలం విలువ ఎంత ఉంటుందని కొడాలి నానిని అడిగాను. గజం 14 వేల రూపాయలు ఉంటుంది.. ఒక్కో లబ్ధిదారుడికి ఇచ్చిన సెంటు స్థలం విలువ రూ.7 లక్షలు ఉంటుందని నాని చెప్పాడు. ప్రతి లబ్ధిదారుడికి 1.1 సెంటు ఇచ్చాం. రూ.7 లక్షల ఆస్తి నా అక్కచెల్లెమ్మలకు అందించాం. ఇళ్ల నిర్మాణం కూడా పూర్తయితే.. ఆ తరువాత ఒక్కో ఇంటి విలువ కనీసం రూ.10 నుంచి రూ.12 లక్షలు నా అక్కచెల్లెమ్మల చేతిలో మీ అన్న, మీ తమ్ముడు పెట్టినట్టు అవుతుందని చెప్పడానికి గర్వపడుతున్నాను. 

ఇప్పటికే ఈ లేఅవుట్‌లో 7,728 ఇళ్ల పట్టాలు అందించాం. నియోజకవర్గానికి మొత్తం కలిపి 13,145 ఇళ్ల పట్టాలు ఇచ్చాం. ఇందులో ఇంకా 4200 ఇళ్ల పట్టాలకు సంబంధించిన ఇళ్లు కూడా మంజూరైతే మొత్తం 13,145 ఇళ్ల పట్టాల్లో ఇళ్లు కూడా నిర్మాణం అవుతాయని చెప్పాడు. ఇప్పటికే ఇచ్చిన 8,859 ఇళ్లకు అదనంగా జూలై 8న నాన్నగారి జయంతి రోజున మరో 4200 ఇళ్ల నిర్మాణం కూడా మంజూరు చేస్తున్నాం. 

గుడివాడలోనూ, రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలోనూ ప్రస్పుటంగా ప్రతి గ్రామంలో కనిపించేలా, ప్రతి పేద కుటుంబం బాగుపడాలనే తలంపుతో అడుగులు వేగంగా వేస్తూ ఒక బాధ్యతగా పేదవాడిపై మమకారంతో అడుగులు వేశాం. 

ఇదే గుడివాడలో ఎన్టీఆర్‌ను వెన్నుపోటు పొడిచిన అల్లుడు ఉన్నాడు. గుడివాడ అల్లుడినని చెప్పుకుంటాడు. తన 14 ఏళ్ల పాలనలో గుడివాడలోని పేదలకు ఒక్క సెంటు ఇచ్చిన దాఖలాలు లేవు. చంద్రబాబు హయాంలో ఒక్క ఇల్లు కట్టించింది లేదు.. ఒక్క సెంటు స్థలం ఇచ్చింది లేదూ. ఆ బాబూ పాలనకు భిన్నంగా, పేదల ప్రభుత్వంగా రాష్ట్ర వ్యాప్తంగా ఇళ్ల నిర్మాణ కార్యక్రమానికి ఎంత చిత్తశుద్ధితో అడుగులు వేస్తున్నామంటే.. మనందరి ప్రభుత్వం అక్కచెల్లెమ్మల పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చిన ఇళ్ల పట్టాలు అక్షరాల 30.60 లక్షల మందికి అందించామని చెప్పడానికి గర్వపడుతున్నాను. 

రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే రెండు దశల్లో అక్షరాల 21 లక్షల ఇళ్లు నిర్మాణంలో ఉన్నాయని చెప్పడానికి గర్వపడుతున్నా. రాష్ట్ర వ్యాప్తంగా మనం నిర్మిస్తున్న కాలనీలు అక్షరాల 17 వేల కాలనీలు నిర్మిస్తున్నామని చెప్పడానికి గర్వపడుతున్నాను. ఇప్పటికే 5.52 లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తయింది. అక్కచెల్లెమ్మల పేరుతో ఇచ్చిన ఒక్కో ఇంటి పట్టా విలువ ఆ స్థలం, ఏరియాను బట్టి కనీసం రూ.2.50 లక్షల నుంచి కనీసం రూ.10 లక్షల వరకు ఇచ్చినట్టు అయ్యింది. రాష్ట్ర వ్యాప్తంగా మనం ఇచ్చిన ఇళ్ల స్థలాల కనీస విలువను మాత్రమే తీసుకున్నా కూడా 30.60 లక్షల ఇళ్ల స్థలాల మీద రూ.2.50 లక్షల చొప్పున వేసుకున్నా.. రూ.75 వేల కోట్లకు సంబంధించిన ఆస్తులను ఇళ్ల పట్టాల రూపేనా నా అక్కచెల్లెమ్మల చేతుల్లో పెట్టినట్టు అయ్యింది. 

పేదలందరికీ ఇళ్లు నిర్మించే ఈ మహాయజ్ఞంలో ప్రతి ఇంటి నిర్మాణం పూర్తవ్వగానే.. ఒక్కో ఇల్లు రూ.2.70 లక్షలతో కడుతున్నాం. ఆ తరువాత మౌలిక సదుపాయాల ఖర్చు ప్రతి ఇంటికి కనీసం రూ.1 లక్ష అవుతుంది. ఈ లెక్కన ప్రతి అక్కచెల్లెమ్మకు ఇంటి స్థలం విలువ రూ.2.50 లక్షలకు తోడు నిర్మాణానికి రూ.2.70 లక్షలు, తరువాత మౌలిక సదుపాయల కల్పనకు రూ.1 లక్ష వేసుకున్నా కూడా ప్రతి అక్కచెల్లెమ్మకు రూ.6 నుంచి రూ.15 లక్షల వరకు ఉంటుందని చెప్పడానికి గర్వపడుతున్నాను. 

రాష్ట్ర వ్యాప్తంగా 30.60 లక్షల ఇళ్లకు సంబంధించి చూస్తే.. ఇళ్ల మహాయజ్ఞం కార్యక్రమం ద్వారా అక్కచెల్లెమ్మల చేతుల్లో రూ.2 నుంచి రూ.3 లక్షల కోట్ల ఆస్తిని ప్రతి అక్కచెల్లెమ్మల చేతుల్లో పెట్టినట్టు అవుతుంది. దేవుడు నాకిచ్చిన అవకాశంలో ఇంతకంటే సంతోషం ఏముంటుందని.. ఈ సందర్భంగా దేవుడికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. లక్షల మంది అక్కచెల్లెమ్మల కుటుంబాల్లో వెలుగు నింపడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. 

టిడ్కో ఇళ్ల విషయానికి సంబంధించి కొన్ని కొన్ని విషయాలు తెలియజేయాలి. ఈ రాష్ట్రంలో కొంతమందికి ఈర్ష్య, ద్వేషం ఎక్కువయ్యాయి. ఏ స్థాయిలో అంటే.. ఏమాత్రం కళ్లార్పకుండా అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు. 

టిడ్కో ఇళ్ల నిర్మాణానికి సంబంధించి గత చంద్రబాబు ప్రభుత్వం చేసిన నిర్వాకం చూస్తే.. నిరుపేదలు నివాసం ఉండే 300 చదరపు అడుగుల ప్లాట్‌ కట్టడానికి అయ్యే ఖర్చు.. అడుగుకు రూ.2 వేల చొప్పున ఒక్కో ప్లాట్‌కు దాదాపుగా రూ.5.75 లక్షలు అయితే.. మౌలిక సదుపాయాల కల్పనకు రూ.1 లక్ష తీసుకుంటే.. దాదాపుగా 300 అడుగుల ప్లాట్‌ ఒక్కోటి రూ.6.75 లక్షలు ఖర్చు అయ్యే ఈ ప్లాట్‌కు కేంద్రం సబ్సిడీ రూపేనా రూ.1.50 లక్షలు ఇస్తే.. రాష్ట్ర ప్రభుత్వం తరఫున సబ్సిడీగా రూ.1.50 లక్షలు ఇస్తే.. మిగిలిన రూ.3 లక్షలు గత చంద్రబాబు ప్రభుత్వ హయాంలో పేదవాడి పేరుమీద అప్పుగా రాసుకొని ఆ పేదవాడు ప్రతి నెలా రూ.3 వేలు 20 సంవత్సరాల పాటు కడుతూ.. పోవాలి. 

 పేదవాడు రూ.3 లక్షల అప్పును తీర్చడం కోసం  ప్రతి నెలా రూ.3 వేలు కడుతూపోతే 300 అడుగుల ఇంటిని సొంతం చేసుకునేందుకు 20 సంవత్సరాల్లో రూ.7.20 లక్షలు పేదవాడు కట్టాల్సిన పరిస్థితి. ఆనాడు చంద్రబాబు హయాంలో తెచ్చిన టిడ్కో పథకం. అది కూడా నేల మీద ఇళ్లు లేవు.. నిర్మాణం లేదు, ఉచితంగా ఇచ్చింది అంతకంటే లేదు. 

మీ బిడ్డ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం 300 చదరపు అడుగుల్లో నిర్మిస్తున్న టిడ్కో ఇళ్లు.. 1,43,600 ఇళ్లను అన్ని హక్కులతో ఉచితంగా రిజిస్ట్రేషన్‌ చేసి మరీ.. ఒక్కో ఇంటి నిర్మాణం విలువ రూ.6.75 లక్షలు అయినా నా అక్కచెల్లెమ్మలకు ఒక్క రూపాయికే ఉచితంగా అందిస్తున్న ప్రభుత్వం.. మీ జగనన్న ప్రభుత్వం అని చెప్పడానికి సంతోషిస్తున్నాను. ఇదొక్కటే కాకుండా 365 చదరపు అడుగుల ఇళ్లు, 430 చదరపు అడుగుల ఇళ్లు కూడా ఉన్నాయి. 

365 చదరపు అడుగుల ఇళ్లకు సంబంధించి గతంలో ఇదే మాదిరిగానే లెక్కలు కట్టారు. రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న రూ.3 లక్షల సబ్సిడీకి అదనంగా రూ.50 వేలు కట్టించుకున్నారు. మీ బిడ్డ వచ్చిన తరువాత ఆ రూ.3 లక్షలు ఇవ్వడమే కాకుండా వాటిల్లో సిమెంట్‌ రోడ్లు, మౌలిక సదుపాయాల కోసం మరో రూ.1 లక్ష ఖర్చు చేయడమే కాకుండా మరో రూ.25 వేలు కలిపి అక్షరాల ప్రతి పేదవాడికి 365 చదరపు అడుగుల ఇంటి లబ్ధిదారుడికి రూ.4.25 లక్షల సబ్సిడీ ఇస్తున్నాడు. 

430 చదరపు అడుగుల ఇంటి లబ్ధిదారుడికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇస్తున్న సబ్సిడీ కాకుండా మౌలిక సదుపాయాల కోసం రూ.1 లక్ష వేసి, గత ప్రభుత్వం విధించిన  రూ.1 లక్ష డిపాజిట్‌లో రూ.50 వేలు రాష్ట్ర ప్రభుత్వమే మళ్లీ భరిస్తూ అక్షరాల రూ.4.50 లక్షల సబ్సిడీ ఇవ్వడం జరుగుతుంది. ఈ ఒక్క టిడ్కో ఇళ్ల ద్వారా నా అక్కచెల్లెమ్మల కుటుంబాలకు మనందరి ప్రభుత్వం అక్షరాల రూ.16,601 కోట్లను లబ్ధిచేకూరుస్తూ భరిస్తుందని చెప్పడానికి సంతోషిస్తున్నాను. 

ఇది వాస్తవం అయితే.. ఇందులో చంద్రబాబు చేసిందేమిటీ..? గుమస్తాగిరి కూడా సరిగ్గా చేయలేదు. తాను చేయని పనిని చేసినట్టుగా ప్రచారం చేసుకోవడం తప్ప.. ఆ గుమస్తాగిరి పని కూడా సరిగ్గా చేయక ప్రచారం చేసుకోవడం తప్ప చంద్రబాబు చేసిందేంటీ.. అని ఈ సందర్భంగా ప్రతి ఒక్క ఆలోచన చేసుకోవాలి. 

టిడ్కో ద్వారానే రూ.16,601 కోట్ల లబ్ది...
ఒక్క టిడ్కో ఇళ్ల ద్వారా అక్కచెల్లెమ్మల కుటుంబాలకు మన ప్రభుత్వం రూ. 16,601 కోట్లు లబ్ధి చేకూర్చుతూ ఖర్చు భరిస్తోంది.   ఇది వాస్తవం అయితే, ఇందులో చంద్రబాబు చేసింది ఏమిటి ? అని అడుగుతున్నాను. గుమాస్తాగిరీ పని కూడా సరిగ్గా చేయలేదు.  తాను చేయని పనులు చేసినట్లుగా ప్రచారం చేసుకోవడం తప్ప బాబు చేసిందేమిటి? అన్నది ప్రతి ఒక్కరూ ఆలోచన చేయాలి. 

పేదల వ్యతిరేకి బాబు...
రాష్ట్రంలో ప్రతి కుటుంబం ఆలోచన చేయాల్సిన విషయాలను మీ అందరితో పంచుకుంటున్నాను. ప్రతి ఒక్కరినీ ఆలోచన చేయమని కోరుతున్నాను. నాలుగేళ్లలో మన ప్రభుత్వం ఇన్ని లక్షల ఇళ్లు ఎలా కట్టగలిగింది. మీ బిడ్డ ప్రభుత్వంలో నాలుగేళ్లలో 30 లక్షల ఇళ్ల స్ధలాలు ఇవ్వగలిగింది ? ఆలోచన చేయాలి. 
మరి ఇదే పనిని 30 ఏళ్ల క్రితమే సీఎం అయిన ఈ బాబు, మూడు సార్లు ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్న ఈ బాబు, 14 ఏళ్లు సీఎంగా ఉండి కూడా ఎందుకు చేయలేకపోయాడు ప్రతి ఒక్కరూ ఆలోచన చేయాలి.
కారణం  బాబు పేదల వ్యతిరేకి కాబట్టి చేయలేదు. 300 అడుగుల టిడ్కో ఇంటిని మన ప్రభుత్వం రూ.1కే మన అక్కచెల్లెమ్మలకు ఎలా ఇవ్వగలుగుతుంది? మరి ఇదే పనిని 30 ఏళ్ల క్రితం సీఎం అయిన బాబు, 14 ఏళ్లు సీఎంగా పరిపాలన చేసిన బాబు ఎందుకు చేయలేకపోయాడు ? ఆలోచన చేయండి. కారణం బాబు పేదల వ్యతిరేకి కాబట్టే చేయలేదు. 

బాబు తన బినామీ భూముల రేట్ల కోసం అడ్డుపడ్డాడు...  అమరావతిలో పేదలకు ఇళ్లపట్టాలిస్తే అక్కడ డెమోగ్రఫిక్‌ ఇంబ్యాలన్స్‌ వస్తుంది.. అంటే కులాల మధ్య సమతుల్యం దెబ్బతింటుందని.. ఏకంగా కోర్టుల్లో కూడా నిస్సిగ్గుగా వాదించారు. 
అయినా కూడా అదే అమరావతిలో 50 వేల మంది అక్కచెల్లెమ్మల కోసం సుప్రీంకోర్టు వరకు వెళ్లి పోరాడి  నా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ నా నిరుపేద అక్కచెల్లెమ్మలకు ఇళ్ల స్థలాలు ఇచ్చాం. 
ఇదే పనిని ఈ బాబు ఎందుకు చేయలేదని ఆలోచన చేయాలి ?  

మన ప్రభుత్వం 4 సంవత్సరాల కాలంలో రూ. 2.16 లక్షల కోట్లు నేరుగా బటన్‌ నొక్కి లంచాలు, వివక్ష లేకుండా నేరుగా అక్కచెల్లెమ్మల ఖాతాల్లోకి జమ చేశాం. మరి ఇదే పనిని బాబు ఎందుకు చేయలేదన్నది ఆలోచన చేయండి, కారణం బాబు పేదల వ్యతిరేకి కాబట్టే.

4 ఏళ్లలో అవ్వాతాతలు, వితంతువులు, వికలాంగులకు పింఛన్‌ రూపంలో రూ. 72 వేల కోట్లు ఇవ్వగలిగాం. రైతన్నలకు రైతు భరోసాగా రూ. 31 వేల కోట్లు ఇవ్వగలిగాం.
అమ్మ ఒడిగా అక్కచెల్లెమ్మలకు పిల్లల బాగోగుల కోసం రూ. 19,674 కోట్లు ఇవ్వగలిగాం. ఆసరాగా అక్కచెల్లెమ్మలు వాళ్ల కాళ్లమీద నిలబడాలని 4 ఏళ్లలో ఇంకో రూ. 19,178 కోట్లు ఇవ్వగలిగాం. చేయూతగా నా అక్కచెల్లెమ్మలకు తోడుగా నిలబడేందుకు 4 ఏళ్లలో రూ. 14,129 కోట్లు ఇవ్వగలిగాం. నా అక్కచెల్లెమ్మల పిల్లలు బాగా చదవాలి, ఎదగాలని విద్యాదీవెన, వసతి దీవెన కింద రూ. 14,913 కోట్లు ఇవ్వగలిగాం. ఈ నాలుగేళ్లలో సున్నావడ్డీ, ఈబీసీ నేస్తం, చేదోడు, కాపునేస్తం, తోడు, నేతన్న నేస్తం, మత్స్యకార భరోసా, లా నేస్తం, ఉచిత పంటలబీమా, వాహనమిత్ర, పగటిపూట 9 గంటల ఉచిత విద్యుత్, ఆరోగ్యశ్రీని ఇంకా మెరుగుపరుస్తూ ఆరోగ్యఆసరాతో పాటు చివరకి అగ్రిగోల్డ్‌ బాధితులకు కూడా మేలుచేయడంతో పాటు ఈకార్యక్రమాలన్నీ మనం మాత్రమే నాలుగేళ్లలో అమలు చేసిన పథకాలు. 
మరి ఇవన్నీ 30 ఏళ్ల క్రితమే సీఎం అయిన ఈ బాబు, 14 సంవత్సరాలు సీఎం కుర్చీలో కూర్చున్నఈ బాబు, 3 సార్లు సీఎం అయిన ఈ బాబు ఎందుకు చేయలేదు ? బాబు, పేదల వ్యతిరేకి కాబట్టే చేయలేదు. ఈ రోజు రాష్ట్రంలో పేదలకు ఇళ్లు కట్టే ఉద్దేశం చంద్రబాబుకు ఎలాగూ లేదు.  

ఎన్నికలు దగ్గరకొచ్చేసరికి, మరో పది నెలల్లో ఎన్నికలు ఉన్నాయనేసరికి మాత్రం ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు తన సొంత నియోజకవర్గం కుప్పంలో ఈరోజు ఇళ్లు కట్టుకుంటానని పర్మిషన్‌ కోసం నన్ను అడుగుతున్నాడు. తాను కుప్పంలో ఎమ్మెల్యేగా గెలిచి 34 సంవత్సరాలు అయిన తర్వాత 75 ఏళ్ల వయస్సున్న ఆయన ఈ రోజు ఎన్నికలు మరో పదినెలల్లో ఉన్నాయన్న నేపధ్యంలో కుప్పంలో ఇళ్లు కట్టుకుంటానని పర్మిషన్‌ అడుగుతాడు.  కుప్పంలో మైకు పట్టుకొని ఇంకో చాన్స్‌ ఇవ్వండి చేసేస్తా అంటాడు. ఇంకో ఛాన్స్‌ ఇవ్వండి ఇంకా ఎక్కువ చేస్తాను, ఇంకో ఛాన్స్‌ ఇవ్వండి మీ ప్రతి ఇంటికి 1 కేజీ బంగారం ఇస్తాను. మీ ప్రతి ఇంటికి బెంజ్‌ కారు ఇస్తా అని ఈ మధ్య కాలంలో ఎన్నికల దగ్గరపడేసరికి మోసం చేయడానికి బయలుదేరాడు.

చేసిన మేలులేదు అయినా ఇంకో ఛాన్స్‌ అంటూ...
ఈ పెద్ద మనిషి నాకు ఇంకో ఛాన్స్‌ ఇవ్వండి ఇది చేస్తాను, అది చేస్తాను అంటాడే  తప్ప సీఎంగా ఉన్న ఆరోజుల్లో మీ ప్రతి ఇంటికీ ఈ మంచి నేను చేశాను కాబట్టి నాకు ఓటేయండని అడగలేడు. మీ ప్రతి ఇంటికి డీబీటీ రూపంలో ప్రతి అక్కచెల్లెమ్మకు ఇంత ఇచ్చాను కాబట్టి నాకు ఓటేయండి అని అడగలేదు. ప్రతి పేద సామాజిక వర్గానికి తాను సీఎంగా ఉంటూ ఈ మేలు చేశాను అని కానీ, తాను పిల్లలకు ఈ మంచి చేశాను కాబట్టి నాకు ఓటువేయండి అని అడగడం లేదు. ఈ పెద్ద మనిషి తాను సీఎంగా ఉన్నప్పుడు అవ్వాతాతలకూ ఫలానా మంచి చేశాను కాబట్టి నాకు ఓటేయండని అడగడం లేదు. కారణం మంచి చేసిన చరిత్ర ఈ పెద్దమనిషి చంద్రబాబుకు లేనేలేదు. అడిగే నైతికత కూడా ఈ పెద్దమనిషికి లేదు.
 
అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోనే...
అధికారంలోకి వచ్చిన మొదటి 6 నెలల్లోనే లంచాలకు తావివ్వకూడదని, వివక్షకు చోటులేకుండా చేయాలని వాలంటీర్‌ వ్యవస్ధ, గ్రామ వార్డు సచివాలయ వ్యవస్ధతోను తీసుకొచ్చాం. ఆర్బీకేలను, విలేజ్‌ క్లినిక్‌లను గ్రామస్ధాయిలోకి తీసుకొచ్చాం. ఫ్యామిలీ డాక్టర్‌ కాన్సెప్ట్‌ను తీసుకొచ్చాం. నాడు నేడుతో రూపురేఖలు మారుతున్న స్కూళ్లను తీసుకొచ్చాం. గ్రామస్ధాయిలోనే ప్రస్ఫుటంగా మార్పులు దిశగా అడుగులు వేశాం.
కొత్త జిల్లాలు ఏర్పాటు చేసింది మనం. కొత్తగా మరో 17 మెడికల్‌ కాలేజీలు కడుతున్నాం. కొత్తగా మరో నాలుగు సీపోర్టులు, ఎయిర్‌పోర్టులు, ఫిషింగ్‌ హార్భర్లు, ఫిషింగ్‌ సెంటర్లు కడుతున్నది కూడా మీ బిడ్డ ప్రభుత్వమే. భావితరాల కోసం విద్యావ్యవస్ధ కానివ్వండి, అక్కచెల్లెమ్మల సాధికారత కోసం కానీ, రైతన్నల సంక్షేమం కోసం, సామాజిక వర్గాలకు న్యాయం చేయడం కోసం, వైద్యం అందించడం కోసం కానీ, అన్ని రంగాలలో విప్లవాత్మక మార్పులు ప్రతి అడుగులోనూ గ్రామ స్ధాయిలో కనిపించేట్టు ఒక బాధ్యతతో మనసు పెట్టి చేసిన ప్రభుత్వం కూడా మనదే. 

మనం ఎన్నికలకు ముందు ఇచ్చిన మేనిఫెస్టోను ఒక ఖురాన్,భగవద్గీత, బైబిల్‌ గా భావించాం. ఏకంగా మేనిఫెస్టోలో చెప్పిన మాటలను  99 శాతం నెరవేర్చి ప్రతి అక్కచెల్లెమ్మల వద్దకు వెళ్లి మీకు మంచి జరిగిందా ? లేదా ?  అనే నైతికత మనది.  
మూడు సార్లు ముఖ్యమంత్రి అయిన ఆ పెద్ద మనిషి చంద్రబాబు... ప్రతిసారీ ముఖ్యమంత్రి అయిన తర్వాత మేనిఫెస్టో చెత్తబుట్టకే పరిమితం చేశాడు. తేడా గమనించండి. 
మనం ఎందుకు ఇంత మంచి చేయగలుగుతున్నాం. బాబు చేయలేకపోయాడు కారణం... మనకు పేదల కష్టం, వారి గుండె చప్పుడు తెలుసు కాబట్టి. మన పార్టీ ఆ పేదవాడి హృదయం నుంచి పుట్టింది కాబట్టి... చేయగలుగుతున్నాం. వాళ్లది పెత్తందార్ల పార్టీ, గజదొంగల ముఠా కాబట్టి వాళ్లు చేయలేదు. మనం దేవుడిని ప్రజలను నమ్ముకుంటే.. వారు చిత్తులని, పొత్తులని, ఎత్తులని దుష్ట చతుష్టయాన్ని నమ్ముకున్నారు. తేడా గమనించండి. 

40 ఏళ్ల రాజకీయ జీవితం తర్వాత కూడా ప్రజలకు మంచి చేసిన చరిత్ర ఏమాత్రం కూడా లేని ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు, రెండు పక్కలా కూడా రెండు పార్టీలు ఉంటే తప్ప లేచి నిలబడలేని ఈ చంద్రబాబు మనకు ప్రత్యర్ధి అట. 175 నియోజకవర్గాల్లో 175 మంది క్యాండిడేట్లను కూడా పెట్టలేని ఈ వ్యక్తి మనకు ప్రత్యర్ధి అట. మరో వంట రాజకీయాల్లోకి వచ్చి 15 సంవత్సరాల తర్వాత కూడా తాను చంద్రబాబు కోసమే పుట్టానంటూ.. తన జీవితమే బాబు కోసం త్యాగమంటూ, తన వ్యాన్‌ను చూసి మురిసిపోతూ, ఇక  తాను కూడా ఎమ్మెల్యే అవుతానని, తనను ఎవరు ఆపుతారో చూస్తానని అంటున్న ప్యాకేజీ స్టార్, దత్తపుత్రుడు మరో వంక. 
ఈ చంద్రబాబుతో పాటు అధికారాన్ని పంచుకుని ఆ అధికారంతో రాష్ట్రాన్ని, రాష్ట్రంలో ఉన్న పేదలను ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5లతో కలిసిన గజ దొంగల ముఠా దోచుకుంది.  

నాకు ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5, దత్తపుత్రుడు అండగా ఉండకపోవచ్చు. వీళ్లకి అధికారం  ఎందుకు కావాలి అంటే కలిసికట్టుగా రాష్ట్రాన్ని దోచుకునేందుకు, పంచుకునేందుకు, తినుకునేందుకు అధికారం కావాలి. ఈ తోడేళ్ల గుంపు నుంచి మీ బిడ్డ ఒంటరిగానే ఉన్నాడు.  వీళ్లెవరూ మీ బిడ్డకు తోడుగా లేరు. వీళ్ల మాదిరిగా హంగూ ఆర్భాటం లేకపోవచ్చు. మీ బిడ్డకు ఈనాడు తోడుగా ఉండకపోవచ్చు. ఆంధ్రజ్యోతి అండగా ఉండకపోవచ్చు. టీవీ 5, దత్తపుత్రుడు అండగా ఉండకపోవచ్చు. ఇంకా చిన్నా చితగా పార్టీలు తోడుగా ఉండకపోవచ్చు. కానీ మీ బిడ్డ వాళ్లను నమ్ముకోలేదు. మీ బిడ్డ రాజకీయాల్లోకి వచ్చింది, రాజకీయాలలో నిలబడంది వాళ్లను నమ్ముకుని కాదు.

మీ బిడ్డ మిమ్నల్ని, దేవుడ్నే నమ్ముకున్నాడు...
మిమ్నల్ని, దేవుడి దయనే మీ బిడ్డ నమ్ముకున్నాడు. ఇంతమంది తోడేళ్లన్నీ ఏకమైనా కూడా మీ బిడ్డ భయపడడు. కారణం ఒక్కటే మీ బిడ్డ చెప్పేది ఒక్కడే, అడిగేది, మీ అందరినీ కోరేది ఒక్కటే.  అబద్దాలన్నీ నమ్మకండి. మీ ఇంట్లో మీకు మంచి జరిగిందా ? లేదా ?  అనేది ఒక్కటే కొలమాణంగా తీసుకోండి. మంచి జరిగుంటే మాత్రం మీ బిడ్డకు మీరే సైనికులుగా మారండి.మంచి జరిగితే మీ బిడ్డకు ఓ అన్నగా, తమ్ముడిగా, అక్కగా, తాతగా మీరే నిలబడండి. దేవుడి దయ వల్ల ఇంకా మంచి చేసే రోజులు రావాలని, ప్రతి అక్కచెల్లెమ్మ కుటుంబానికి ఇంకా మంచి జరగాలని కోరుకుంటున్నాను. ఇవాల జరుగుతున్న మంచి కార్యక్రమం ద్వారా మీ అందరికీ అభినందనలు. 

కాసేపటి క్రితం.. 
ఎమ్మెల్యే నాని నియోజకవర్గంలో మరికొన్ని మంచి పనులకు ఇంకా కాస్త సహాయం  కావాలని అడిగారు. గుడివాడలో ఎస్సీ శ్మశాన వాటిక కావాలన్నారు. రూ.5 కోట్లవుతుందన్నారు. దాన్నిమంజూరు చేస్తున్నాను. టిడ్కో మాస్టర్‌ ప్లాన్‌ కోసం ముదినేపల్లి నుంచి బందరు రోడ్డుకు రూ.17 కోట్లు ఖర్చవుతుందన్నారు. అదీ మంజూరు చేస్తున్నాం. మంచినీటిసరఫరా కోసం ల్యాండ్‌ అక్విజేషన్‌ కావాలన్నారు.. గుడివాడ అసెంబ్లీ నియోజకవర్గంలో రూ.45 కోట్లతో అందుకోసం కూడా మంజూరు చేస్తున్నాం. మల్లయ్యపాలెం లే అవుట్‌లో ఇంటర్నల్‌ రోడ్డు కోసం మరో రూ.9 కోట్లు కావాలన్నారు. అదీ మంజూరు చేస్తున్నాం. 
అంతే కాకుండా గుడివాడ మున్సిపాల్టీలో ఇంటర్నల్‌ సీసీ రోడ్లు . అభివృద్ధి పనులను రూ. 26 కోట్లతో శంకుస్ధాపన చేశాం. కృష్ణా జిల్లాలో రూ.750 కోట్లతో జలజీవన్‌ మిషన్‌ కింద చేపడుతున్న పైప్‌లైన్‌ ప్రాజెక్టులో రూ.160 కోట్లతో గుడివాడ ప్రాంతాల్లో తాగునీటి అవసరాల కోసం కేటాయిస్తూ.. ఈ పనులకూ శంకుస్ధాపన చేసాం. వీటన్నింటి ద్వారా ఈ ప్రాంతం ప్రజలకు మంచి జరగాలని మనసారా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను అని సీఎం ప్రసంగం ముగించారు.

 

Back to Top