దేవుడి ద‌య‌, ప్ర‌జ‌ల దీవెన‌ల‌తోనే ఇంత‌టి ఘ‌న‌విజ‌యం

ప‌నిచేస్తున్న ప్ర‌భుత్వానికి అండ‌గా నిలిచిన ప్ర‌జ‌ల‌కు ధ‌న్య‌వాదాలు

ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి ట్వీట్‌

తాడేప‌ల్లి: ప‌నిచేస్తున్న ప్ర‌భుత్వానికి అండ‌గా నిలిచిన ప్ర‌జ‌ల‌కు ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి ధ‌న్య‌వాదాలు తెలిపారు. నెల్లూరు కార్పొరేష‌న్‌, మున్సిపాలిటీలు, న‌గ‌ర పంచాయ‌తీల్లో వైయ‌స్ఆర్ సీపీ విజ‌యం ప‌ట్ల పార్టీ అధ్య‌క్షులు, ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ ట్వీట్ చేశారు. ``దేవుడి దయ, ప్రజలందరి చల్లని దీవెనలు.. ఇవే ఈ రోజు ఇంతటి ఘన విజయాన్ని అందించాయి. గ్రామంతో పాటు నగరం కూడా పనిచేస్తున్న ప్రభుత్వానికి అండగా నిలిచింది. మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, నగర పంచాయతీల్లో 100కు 97 మార్కులు వేసిన అవ్వాతాతలు, అక్కాచెల్లెళ్ళు, సోదరులందరికీ ధన్యవాదాలు`` తెలుపుతూ సీఎం ట్వీట్ చేశారు. 

తాజా ఫోటోలు

Back to Top