సీఎం వైయ‌స్ఆర్ జిల్లా ప‌ర్య‌ట‌న షెడ్యూల్ ఖ‌రారు

తాడేప‌ల్లి: ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి వైయ‌స్ఆర్ జిల్లా పర్యటన ఖరారైంది. ఈనెల 23 నుంచి 25వ తేదీ వరకు జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో ముఖ్య‌మంత్రి పర్యటించనున్నారు. వైయ‌స్ఆర్‌ జిల్లాలోని గోపవరం, ప్రొద్దుటూరు, కొప్పర్తి, ఇడుపులపాయ, పులివెందుల ప్రాంతాల్లోని వివిధ అభివృద్ధి పనులకు సీఎం వైయ‌స్ జ‌గ‌న్ శంకుస్థాపనలు చేయ‌నున్నారు. ప్రొద్దుటూరు, పులివెందులలో నిర్వహించే బహిరంగ సభల్లో సీఎం పాల్గొంటారు. 

వైయ‌స్ఆర్ జిల్లా షెడ్యూల్‌..   

23వ తేదీన 
- ఉదయం 9.45 గంటలకు గన్నవరం ఎయిర్‌పోర్టు నుంచి బయలుదేరి 10.30 గంటలకు కడప ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. 
- 10.40 గంటలకు కడప ఎయిర్‌పోర్టు నుంచి బయలుదేరి 11.00 గంటలకు ప్రొద్దుటూరు మండలం గోపవరం చేరుకుంటారు. అక్కడ స్థానిక నాయకులతో కాసేపు ముచ్చటిస్తారు. 
- 11.10 గంటలకు బొల్లవరం హెలిప్యాడ్‌ నుంచి బయలుదేరి 11.15 గంటలకు ఆ గ్రామంలోని బహిరంగ సభ ప్రాంగణానికి చేరుకుంటారు. 
- 11.20 నుంచి 11.35 గంటల వరకు వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు చేస్తారు. 
- 11.40 నుంచి మధ్యాహ్నం 1.00 గంట వరకు అక్కడ నిర్వహించే బహిరంగసభలో పాల్గొంటారు.  
- 1.35 గంటలకు బద్వేలు నియోజకవర్గం గోపవరం మండలంలోని గోపవరం ప్రాజెక్టు కాలనీ–1కు చేరుకుంటారు. అక్కడ స్థానిక నాయకులతో కాసేపు ముచ్చటిస్తారు.  
- 1.50 నుంచి 1.55 గంటల వరకు బద్వేలు రెవెన్యూ డివిజన్‌ కొత్త కార్యాలయానికి శంకుస్థాపన చేస్తారు. 
- 1.55 నుంచి 2.25 గంటల వరకు మెజర్స్‌ సెంచురీ ఫ్లై పరిశ్రమకు శంకుస్థాపన చేస్తారు  
- 2.35 గంటలకు హెలికాఫ్టర్‌లో బయలుదేరి 2.55 గంటలకు సీకే దిన్నె మండలం కొప్పర్తికి చేరుకుంటారు. స్థానిక నాయకులతో మాట్లాడుతారు. 
- 3.10 గంటలకు కొప్పర్తి గ్రామంలోని వైయ‌స్ఆర్‌ జగనన్న మెగా ఇండస్ట్రియల్‌ హబ్‌ ఆర్చిని ప్రారంభిస్తారు. 
- 3.25 గంటలకు వైయ‌స్ఆర్‌ ఈఎంసీ ఇండస్ట్రియల్‌ ఎన్‌క్లేవ్‌ వద్ద ఏర్పాటు చేసిన స్టాల్స్‌ను సీఎం ప్రారంభిస్తారు. 
- 5.05 గంటలకు ఇడుపులపాయలోని హెలిప్యాడ్‌ చేరుకుంటారు. అక్కడ 5.20 గంటల వరకు స్థానిక నాయకులతో మాట్లాడతారు. 
- 5.25 గంటలకు గెస్ట్‌హౌస్‌కు చేరుకుని రాత్రికి అక్కడే బస చేస్తారు. 

24వ తేదీ 
- ఉదయం 9.00 గంటలకు ఇడుపులపాయ ఎస్టేట్‌ నుంచి బయలుదేరి 9.05 గంటలకు వైయ‌స్ఆర్‌ ఘాట్‌ వద్దకు చేరుకుంటారు. 
- 9.40 గంటల వరకు దివంగ‌త మ‌హానేత‌ వైయ‌స్‌ రాజశేఖరరెడ్డి సమాధి వద్ద నివాళులర్పించి ప్రార్థనల్లో పాల్గొంటారు. 
- 9.55 గంటలకు ఇడుపులపాయలోని ప్రార్థనా మందిరానికి ముఖ్యమంత్రి చేరుకుంటారు. 
- 10.00 నుంచి మధ్యాహ్నం 12.00 గంటల వరకు అక్కడ నిర్వహించే ప్రార్థనల్లో పాల్గొంటారు. 
- 12.15 గంటలకు గెస్ట్‌హౌస్‌కు చేరుకుంటారు.  
- 1.40 గంటలకు పులివెందుల పట్టణ పరిధిలోని ఇండస్ట్రియల్‌ పార్కుకు చేరుకుంటారు. 
- 2.10 నుంచి 2.35 గంటల వరకు ఇండస్ట్రీయల్‌ పార్కులోని ఆదిత్య బిర్లా యూనిట్‌కు శంకుస్థాపన చేస్తారు. 
- 2.40 గంటలకు వైయ‌స్ఆర్‌ జగనన్న హౌసింగ్‌ కాలనీలో ఇళ్ల పట్టాల పంపిణీ, బహిరంగసభలో లబ్ధిదారులతో ముఖాముఖి మాట్లాడుతారు. 
- 3.35 గంటలకు మార్కెట్‌యార్డుకు చేరుకుని వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు నిర్వహిస్తారు. 
- 3.55 నుంచి 4.05 గంటల వరకు మోడల్‌ పోలీసుస్టేషన్‌ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొంటారు. 
- 4.15 గంటలకు రాణితోపు సమీపంలో  ఆక్వా హబ్‌ ప్రారంభిస్తారు. 
- 5.05 గంటలకు ఇడుపులపాయ హెలీప్యాడ్‌లో పార్టీ నాయకులతో మాట్లాడుతారు. 
- 5.25 గంటలకు గెస్ట్‌హౌస్‌కు చేరుకుని రాత్రికి అక్కడే బస చేస్తారు. 

25వ తేదీ 
- ఉదయం 9.05 గంటలకు ఇడుపులపాయ హెలిప్యాడ్‌నుంచి బయలుదేరి 9.25 గంటలకు పులివెందులకు చేరుకుంటారు. 
- 9.45 నుంచి 11.05 గంటల వరకు సీఎస్‌ఐ చర్చిలో జరిగే క్రిస్మస్‌ ప్రార్థనల్లో పాల్గొంటారు. 
- 11.15 గంటల వరకు సీఎస్‌ఐ చర్చి కాంపౌండ్‌లో ఏర్పాటు చేసిన షాపింగ్‌ కాంప్లెక్స్‌ను ప్రారంభిస్తారు.  
- 11.25 గంటలకు విజయా గార్డెన్స్‌కు చేరుకుని సారెడ్డి వరప్రసాద్‌రెడ్డి కుటుంబ సభ్యుల వివాహ రిసెప్షన్‌కు హాజరవుతారు. 
- 11.50 నుంచి మధ్యాహ్నం 12.50 గంటల వరకు భాకరాపురంలోని సొంత నివాసంలో గడుపుతారు. 
- 1.35 గంటలకు కడప ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. 1.40 గంటలకు విజయవాడ గన్నవరం విమానాశ్రయానికి బయల్దేరుతారు.  

Back to Top