రేపు విజయవాడ, నెల్లూరు జిల్లా కావలిలో ముఖ్య‌మంత్రి పర్యటన

తాడేప‌ల్లి: ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి రేపు (12-05-2023) విజ‌య‌వాడ‌, నెల్లూరు జిల్లా కావలిలో ప‌ర్య‌టించ‌నున్నారు. విజయవాడలో అష్టోత్తర శతకుండాత్మక (108) చండీ, రుద్ర, రాజశ్యామల, సుదర్శన సహిత శ్రీ లక్ష్మీ మహా యజ్ఞంలో సీఎం వైయ‌స్ జ‌గ‌న్ పాల్గొంటారు. అనంతరం నెల్లూరు జిల్లా కావలిలో చుక్కల భూములను 22ఏ నిషేధిత జాబితా నుంచి తొలగించి రైతులకు పూర్తి హక్కు కల్పించే కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. 

విజయవాడ షెడ్యూల్‌..
ఉదయం 8.25 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి విజయవాడ ఇందిరాగాంధీ మునిసిపల్‌ స్టేడియం చేరుకుంటారు. అక్కడ రేపటి నుంచి ప్రారంభమయ్యే శ్రీ లక్ష్మీ మహా యజ్ఞంలో సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌ పాల్గొంటారు, అనంతరం 9.35 గంటలకు తాడేపల్లి హెలీప్యాడ్‌కు చేరుకుని కావలి బయలుదేరుతారు.

కావలి షెడ్యూల్‌..
ఉదయం 9.35 గంటలకు తాడేపల్లి నుంచి బయలుదేరి 10.30 గంటలకు కావలి జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల మైదానంకు చేరుకుంటారు. ఆ తర్వాత కావలి మినిస్టేడియంలో ఏర్పాటుచేసిన బహిరంగ సభలో పాల్గొని చుక్కల భూములను 22ఏ నిషేధిత జాబితా నుంచి తొలగించి రైతులకు పూర్తి హక్కు కల్పించే కార్యక్రమాన్ని ప్రారంభించ‌నున్నారు. కార్య‌క్ర‌మం అనంతరం కావ‌లి నుంచి బయలుదేరి సాయంత్రానికి తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు.

Back to Top