ఏలూరు ప్రభుత్వాస్ప‌త్రిలో సీఎం వైయస్‌ జగన్‌

అస్వస్థతకు గురైన బాధితులను పరామర్శించిన ముఖ్యమంత్రి

మెరుగైన వైద్య సేవలు అందించాలని అధికారుల‌కు ఆదేశం

ఏలూరు: అస్వస్థతకు గురై ఏలూరు ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పరామర్శించారు. హెలీప్యాడ్‌ నుంచి నేరుగా ఏలూరు ప్రభుత్వ ఆస్పత్రికి చేరుకున్న సీఎం వైయస్‌ జగన్‌.. బాధితులు ఒక్కొక్కరి దగ్గరకు వెళ్లి వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. ఉన్నట్టుండి అస్వస్థతకు గురి కావడానికి గల కారణాలపై ఆరా తీశారు. బాధితులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని వైద్యులను ఆదేశించారు. సీఎం వైయస్‌ జగన్‌ వెంట డిప్యూటీ సీఎం ఆళ్ల నాని, మంత్రులు తానేటి వనిత, పేర్ని నాని, టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి ఉన్నారు. అనంతరం స్థానిక జిల్లా పరిషత్‌ సమావేశ మందిరంలో అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు.

Back to Top