సీఎం వైయస్‌ జగన్‌ స్ఫూర్తితో ముస్లింలకు రంజాన్‌ తోఫా

10,600 కుటుంబాలకు నిత్యావసర సరుకులు అందజేస్తున్న ఎమ్మెల్యే చెవిరెడ్డి 

చిత్తూరు:  ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి స్ఫూర్తితో  రంజాన్‌ పండుగ పురస్కరించుకుని ప్రభుత్వ విప్, తుడా చైర్మన్, చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌ రెడ్డి ముస్లింలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. మొత్తం పదిరకాల సరుకుల్లో చక్కెర, సేమియా, బాస్మతి, సోనామసూరి బియ్యం, నెయ్యి, రవ్వ, డాల్డా, నూనె ప్యాకెట్‌ మొదలైనవి ఉన్నాయి.  చంద్రగిరి సమీపంలోని నారాయణి గార్డెన్స్‌లో సామాజిక దూరం పాటిస్తూ రంజాన్‌ తోఫా పంపిణీ చేశారు. 

సీఎం వైయస్‌ జగన్‌ ఆలోచనకు అనుగుణంగా..
 లాక్‌డౌన్‌ కారణంగా చాలా మంది ఇళ్ల నుంచి బయటకు రాలేని పరిస్థితి నెలకొందని, ఈ పరిస్థితుల్లో సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ముస్లింల సంక్షేమం కోసం పలు కార్యక్రమాలను చేపడుతున్నారన్నారు. ఆయన ఆలోచనలకు అనుగుణంగా చంద్రగిరి నియోజకవర్గంలోని ముస్లింలకు రంజాన్‌ కానుక అందించాలని సంకల్పించినట్లు చెప్పారు. ప్రతి ముస్లిం కుటుంబానికి 10 రకాల నిత్యావసర సరుకులు ఇస్తున్నట్టు చెప్పారు. నియోజకవర్గంలోని ఆయా పంచాయతీలకు రంజాన్‌ తోఫా ను వలంటీర్ల ద్వారా వారి ఇళ్లకు చేరేలా చర్యలు తీసుకున్నట్టు చెప్పారు. అల్లా అందరినీ బాగా చూడాలని, అందరూ ఆరోగ్యంగా ఉండేలా ఆయన ఆశీర్వదించాలంటూ ముస్లింలకు ముందస్తు రంజాన్‌ శుభాకాంక్షలు తెలిపారు. కులమతాలకతీతంగా ఐక్యతతో మెలగడం తన నియోజకవర్గ ప్రత్యేకత అన్నారు. పండుగ రోజుల్లో ప్రజలకు అండగా ఉండడం తన బాధ్యతని తెలిపారు. 

Back to Top