ఏపీ ముందంజ

రాష్ట్రానికి రివార్డు ప్ర‌క‌టించిన‌ కేంద్ర ప్ర‌భుత్వం
 

న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాని కేంద్ర ఆర్థిక శాఖ రివార్టును ప్రకటించింది. పౌర సేవల సంస్కరణల్లో నాలుగింట మూడు అమలు చేసినందుకుగాను రివార్డును అందిస్తున్నట్లు కేంద్రం పేర్కొంది. వన్‌ నేషన్‌-వన్‌ రేషన్‌ కార్డు, ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌‌, పట్టణ, స్థానిక సంస్థల సంస్కరణలను అమలు చేయడంలో ఏపీ ముందంజలో నిలిచింది.  రివార్డులో భాగంగా కేంద్రం స్పెషల్‌ అసిస్టేన్స్‌ కింద ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, మ‌ధ్య‌ప్ర‌దేశ్‌ రాష్ట్రాలకు కలిపి మొత్తం రూ. 1004 కోట్ల రివార్డును అందించింది. ఇందులో ఏపీ వాటా 344 కోట్ల రూపాయలు ఉండగా.. మధ్యప్రదేశ్‌ వాటా 660 కోట్లు. 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top