అంబటి రాంబాబు పై దాడికి నిరసనగా కొవ్వొత్తుల ర్యాలీ

కురుపాం నియోజకవర్గంలో వైయ‌స్ఆర్‌సీపీ శ్రేణుల నిరసన

పార్వతీపురం మన్యం జిల్లా: మాజీ మంత్రి అంబటి రాంబాబు గారిపై జరిగిన దాడిని నిరసిస్తూ కురుపాం నియోజకవర్గంలో వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీకి పార్వతీపురం మన్యం జిల్లా వైయ‌స్ఆర్  కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శత్రుచర్ల పరిక్షిత్ రాజు హాజరయ్యారు.

అంబటి రాంబాబు గారిపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తూ, ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే గొంతులను అణిచివేయడానికి జరుగుతున్న దాడులకు వ్యతిరేకంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు.

ఈ సందర్భంగా ర్యాలీని ముందుకు సాగనీయకుండా పోలీసులు అడ్డుకోవడం ఉద్రిక్తతకు దారితీసింది. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న తమను అడ్డుకోవడం ప్రజాస్వామ్య హక్కులను హరించడమేనని వైఎస్సార్‌సీపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

ప్రశ్నించే గొంతులను నొక్కే ప్రయత్నాలను ప్రజలు గమనిస్తున్నారని, ఇటువంటి అణచివేత రాజకీయాలకు తగిన సమాధానం తప్పకుండా ఇస్తారని పార్టీ నేతలు హెచ్చరించారు.

Back to Top