పోటెత్తిన రాజ‌మ‌హేంద్ర‌వ‌రం

వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ సామాజిక న్యాయభేరికి ఘ‌న స్వాగ‌తం

అంబేడ్కర్‌ మొదలుపెట్టిన బండిని జగన్‌గారు పరుగెత్తిస్తున్నారు

వాస్తవ సామాజిక న్యాయం చేసి మరీ చూపించారు

రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు 

రాజ‌మ‌హేంద్ర‌వ‌రం:  వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వ‌ర్యంలో మంత్రులు చేప‌ట్టిన  సామాజిక న్యాయ భేరి యాత్ర రాజ‌మ‌హేంద్ర‌వ‌రం చేరుకుంది. మంత్రుల రాక‌తో రాజ‌మ‌హేంద్ర‌వ‌రం న‌గ‌రం జ‌న‌సంద్ర‌మైంది. ఎదురెళ్లి మ‌రి మంత్రుల‌కు స్థానికులు ఘ‌న స్వాగ‌తం ప‌లికారు. ఈ సంద‌ర్భంగా ఏర్పాటు చేసిన బ‌హిరంగ స‌భ‌లో మంత్రి  ధర్మాన ప్రసాదరావు మాట్లాడారు.  స్వాతంత్య్రానంతరం ఇప్పటి వరకు రాష్త్రాల్లో జరిగినట్లే ఇప్పుడు ఇక్కడ కూడా పరిపాలన కొనసాగుతోందా? ప్రతి ఒక్కరూ దీని గురించి ఆలోచించాలి.
– అనేక సంస్కరణలు. సంక్షేమ పథకాలు. కార్యక్రమాలు. తద్వారా అన్ని వర్గాల వారి అభ్యున్నతి. ఇదీ ఈ ప్రభుత్వ లక్ష్యం.
– నాడు బాబా సాహెబ్‌ అంబేడ్కర్‌ ఒక మాట చెప్పారు. నేను బడుగు, బలహీనవర్గాల అభ్యున్నతి కోసం బండి మొదలుపెట్టాను. దీన్ని ముందుకు తీసుకుపొండి. కానీ వెనక్కు మాత్రం పోకుండా చూడండి అన్నారు.
– అయితే ఇన్నేళ్ల తర్వాత రాష్ట్రంలో ఆ బండిని సీఎం శ్రీ వైయస్‌ జగన్‌గారు ఎంతో ముందుకు తీసుకెళ్లారు. 
– బడుగు, బలహీనవర్గాల అభ్యున్నతి, సంక్షేమం కోసం ఆయన చిత్తశుద్థితో పని చేస్తున్నారు. ఆ విధంగా సామాజిక న్యాయం చేస్తున్నారు.
– నిజం చెప్పాలంటే సామాజిక ఉద్యమం అనేది ఈనాటిది కాదు. బ్రిటిష్‌ పాలన కంటే ముందు, వారి పాలనలోనూ, ఆ తర్వాత కూడా ఉంది. తమకు పాలనలో సమానమైన వాటా లేదని బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలు భావిస్తున్నారు.
– సీఎం శ్రీ వైయస్‌ జగన్‌గారు ఆ పరిస్థితిని పూర్తిగా మార్చేశారు. 25 మంది మంత్రుల్లో 17 మంది ఆ వర్గాల వారు కాగా, అది ఏకంగా 70 శాతం. ఈ స్థాయిలో గతంలో ఏనాడూ జరగలేదు.
– దీంతోనే రాష్ట్రంలో సామాజిక న్యాయం ఆగిపోలేదు. వివిధ పథకాల ద్వారా ప్రత్యక్ష నగదు బదిలీ ద్వారా దాదాపు రూ.1.30 లక్షల కోట్లు నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో జమ కాగా, అందులో ఈ వర్గాల వారు దాదాపు 82 శాతం ఉన్నారు.
– ఎక్కడా వివక్ష, అవినీతికి తావులేదు. దళారుల ప్రమేయం లేదు. 
– అర్హతే ప్రధాన అర్హతగా, కులం, మతం, వర్గం, రాజకీయం అన్న భేదం చూడకుండా పథకాలు అమలవుతున్నాయి. ఇది చాలా గొప్ప విషయం.
– చంద్రబాబు హయాంలో అన్నీ జన్మభూమి కమిటీలకు అప్పగించడంతో అంతులేని అవినీతి, వివక్ష చోటు చేసుకుంది.
– ఇంటిమీద పచ్చ జెండా కట్టమనేవారు. ఒంటిపై పచ్చచొక్కా వేసుకోమని కోరేవారు. 
– చివరకు కలెక్టర్లు కూడా ఈ విషయంలో ఏమీ చేయలేకపోయారు.
– కానీ అవన్నీ మర్చిపోయిన చంద్రబాబు, ఇప్పుడు బాదుడే బాదుడు అంటూ తిరుగుతున్నాడు. కానీ వాస్తవ సామాజిక న్యాయం జరిగిన విషయాన్ని అంగీకరిచడం లేదు.
– అందుకే తన హయాంలో పాలనకు, ఇవాళ్టి పాలనకు తేడా ఏమిటన్నది ఒప్పుకోవాలి. తాను చేసిన తప్పులకు ఈ మహానాడులో క్షమాపణ చెప్పాలి.
– ఇవాళ చంద్రబాబు చెబుతున్నారు. తాము అధికారంలోకి వస్తే, అన్నీ కార్యకర్తలకు ఇస్తామని. అంటే మళ్లీ దోచుకుంటామని చెప్పకనే చెబుతున్నాడు.
– గతంలో కొన్ని ఉద్యమాలతో, మరికొన్ని ఆందోళనలతో వచ్చాయి. కానీ మన రాష్ట్రంలో ఎవరూ ఏదీ కోరకపోయినా, ఎవరికి ఏం కావాలో తెలుసుకున్న జగన్‌గారు అందరికీ అన్నీ అందించారు.
– అందుకే ఈ మూడేళ్ల పాలనలో ఒక్క తప్పును కూడా చంద్రబాబు చూపలేకపోతున్నారు. ఇంకా ఏం మాట్లాడాలో తెలియక, జగన్‌గారు అన్నీ పంచేస్తున్నారని, డబ్బులు ఇస్తున్నారని విమర్శిస్తున్నారు.
– కరోనా మహమ్మారితో ప్రపంచమే అల్లకల్లోలమైనా, ఇక్కడ ఏ ఒక్క పథకాన్ని ఆపలేదు. నిరుపేదలకు ఆర్థిక సహాయం అందింది.
– ఇదే కదా మన రాజ్యాంగం చెప్పింది. 
– అమృతం దేవతలు, రాక్షసులకు దొరికితే, వారే పంచుకున్నారు. అదే తల్లితండ్రులకు దొరికితే పిల్లలకు ఇస్తారు. అదే చంద్రబాబుకు దొరికితే, తన కుటుంబానికి, తన వర్గానికి పంచుతాడు.
– అదే జగన్‌గారికి దొరికితే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు ఇచ్చి, వారికి మేలు చేస్తారు.
– ఈ విధంగా ఎవరైనా చేయగలరా? అది కేవలం జగన్‌గారి వల్లనే సాధ్యం.
– కాబట్టి మనం జగన్‌గారిని, పార్టీని రక్షించుకోవాల్సి ఉంది. అందుకే దొంగల యాక్షన్, దుష్ప్రచారాన్ని తిప్పి కొట్టాలి.
– అయితే అది కేవలం బహిరంగ సభలతో, యాత్రలతోనే జరగదు. ఎక్కడికక్కడ మాట్లాడాలి. అందరిలోకి మరింత బలంగా తీసుకుపోవాలి.
– ఇంకో రెండేళ్లు దాన్ని విస్తృతంగా ప్రచారం చేయాలి. జగన్‌గారి సిద్ధాంతాలు ప్రతి ఒక్కరికి అర్ధమయ్యేలా చెప్పాలి.

అంబేడ్కర్‌ నినాదాన్ని జగన్‌గారు సాకారం :  పి.విశ్వరూప్‌. రవాణా శాఖ మంత్రి.

 – స్వాతంత్య్రానంతరం ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా ఇక్కడ పాలన కొనసాగుతోంది.
– గత 5 ఏళ్ల చంద్రబాబు పరిపాలనకు, సీఎం శ్రీ వైయస్‌ జగన్‌గారి మూడేళ్ల పాలన తేడా గమనించాలని కోరుతున్నాను.
– సామాజిక న్యాయానికి జగన్‌గారి మూడేళ్ల పాలన ఒక నిలువుటద్దం అయితే, చంద్రబాబు పాలనలో అది ఒక నీటి మూటలా మారింది.
– చివరకు ఎస్సీ సామాజిక వర్గానికి ఆయన మంత్రివర్గంలో స్థానం కూడా కల్పించలేదు. అలాగే మైనారిటీ వర్గానికి కూడా మంత్రివర్గంలో స్థానం ఇవ్వలేదు. అలా సామాజిక న్యాయం అంటే కేవలం మాటలకే తప్ప, చేతల్లో చూడలేదు.
– అదే ఇవాళ మాటలు కాదు. చేతల్లో చూపుతున్న జగన్‌గారి పాలన చూస్తున్నాం.
– కరోనా వల్ల రాష్ట్రం ఇబ్బందులు ఎదుర్కొన్నా, సీఎం శ్రీ వైయస్‌ జగన్‌ ఎక్కడా ఏ పథకాన్ని ఆపలేదు.
– ఏకంగా రూ.1.30 లక్షల కోట్లకు పైగా మొత్తాన్ని నేరుగా ప్రజలకు అందించారు.
– ప్రతి ఒక్కరూ చదువుకోవాలన్న అంబేడ్కర్‌ నినాదాన్ని చేతల్లో చూపుతున్నారు. అలా చదువుకోవడానికి అన్ని అవకాశాలు కల్పిస్తున్నారు.
– పిల్లలను బడికి పంపే తల్లుల ఖాతాల్లో అమ్మ ఒడి పథకంలో రూ.15 వేలు ఇస్తున్నారు. పిల్లలకు పూర్తి ఫీజు చెల్లిస్తూ, విద్యాదీవెన, పిల్లలకు యూనిఫామ్, పుస్తకాలు, షూస్‌తో కూడిన విద్యాకానుక, హాస్టల్‌ మెస్‌ ఛార్జీల కోసం వసతిదీవెన. రోజుకొక మెనూతో గోరుముద్ద.
– ఇప్పటి వరకు పార్లమెంటు మెట్లు ఎక్కని శెట్టిబలిజ, మత్స్యకారులకు జగన్‌గారు ఆ అవకాశం కల్పించారు.
– గతంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు కేవలం ఓటర్లుగానే మిగిలిపోగా, సీఎం శ్రీ వైయస్‌ జగన్‌గారు, పాలనలో భాగస్వామ్యం కల్పిస్తున్నారు.

వైయస్‌ జగన్‌గారు ఎన్నో చారిత్రక నిర్ణయాలు : తానేటి వనిత  
– ఈ మూడేళ్లలో సీఎం శ్రీ వైయస్‌ జగన్‌గారు ఎన్నో చారిత్రక నిర్ణయాలు తీసుకున్నారు. మంత్రివర్గ ఏర్పాటులో రెండుసార్లు కూడా బడుగు, బలహీన వర్గాలకు అత్యధిక ప్రాధాన్యం ఇచ్చారు.
– బలహీన వర్గాలు రాజకీయ సాధికారత సాధించే దిశగా ఆయన చక్కటి నిర్ణయాలు తీసుకున్నారు. 25 మంది మంత్రుల్లో 17 మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వారున్నారు. ఈ వర్గాలకు విద్య, వైద్యం, ఉద్యోగ రంగాల్లో అన్నీ దక్కితే సుపరిపాలన అవుతుంది.
– గత ప్రభుత్వాలు ఏనాడూ ఈ దిశలో నిర్ణయాలు తీసుకోలేదు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు అన్ని రాజకీయ పదవులు, నామినేటెడ్‌ పోస్టుల్లో 50 శాతం రిజర్వేషన్‌ కల్పించారు. మళ్లీ వాటిలో 50 శాతం మహిళలకు ఇచ్చారు. ఇది చాలా గొప్ప నిర్ణయం.
– నాకు కీలకమైన హోం శాఖ బాధ్యతలు ఇచ్చారు. దీని వల్ల మాపై జగన్‌గారికి ఎంత గౌరవం ఉందన్న విషయం అర్ధం అవుతుంది. ఒక దళిత మహిళకు హోం శాఖ బాధ్యత ఇవ్వడం నిజంగా సీఎంగారి గొప్పతనం.
– మహిళల ఆర్థిక పురోగతి కోసం చేయూత పథకం అమలు చేస్తున్నారు. ఇది జగనన్న యుగం. స్వర్ణయుగం. ఇంకా చెప్పాలంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల యుగం.

Back to Top