ధర్మవరం: వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన సామాజిక సాధికార బస్సు యాత్ర శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం నియోజకవర్గంలో దిగ్విజయంగా సాగింది. సీఎం వైయస్ జగన్ పాలనలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు జరిగిన ప్రయోజనాలతో పాటు, చేనేతలకు ప్రత్యేకంగా అందిన లబ్ధిపై కూడా యాత్రలో చర్చగా మారింది. సామాజిక సాధికార యాత్ర సందర్భంగా జరిగిన బహిరంగసభకు వేలాదిగా ప్రజలు స్వచ్ఛందంగా తరలివచ్చారు. సభ అసాంతం వక్తల ప్రసంగాలు శ్రద్దగా వినడమే కాకుండా...జై జగన్ అంటూ పదేపదే నినాదాలు చేశారు. అంజాద్ బాషా, ఉప ముఖ్యమంత్రి. – దేశానికి స్వాతంత్య్రం వచ్చాక ఎంతోమంది ముఖ్యమంత్రులు మన రాష్ట్రాన్ని పరిపాలించారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలను ఓటుబ్యాంకుగా అందరూ ఎన్నికల సమయంలో బాగానే ఉపయోగించుకున్నారు. కానీ ఆ తర్వాత వారికి చేసింది మాత్రం పెద్దగా ఏమీలేదు. సామాజిక న్యాయమనే ఊసే లేదు. – జగనన్న వచ్చాకే సామాజిక సాధికారత సాధన దిశలో అడుగులు పడ్డాయి. – జగనన్న ప్రభుత్వంలో బీసీ,ఎస్సీ,ఎస్టీ, మైనార్టీలందరూ తలెత్తుకుని బతుకుతున్నారు. – ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకం ద్వారా బడుగు, బలహీనవర్గాల పిల్లలు పెద్దపెద్ద చదువులు చదివారు. – తండ్రిని మించిన తనయుడిలా ఆయా వర్గాల కోసం జగనన్న సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారు. – అధికార పదవుల్లో చోటు కల్పించారు. బీసీ,ఎస్సీ,ఎస్టీ, మైనార్టీ వర్గాలు జగనన్నను గెలిపించుకోవాలి. మళ్లీ ముఖ్యమంత్రిని చేసుకోవాలి. మన కోసం తిరిగి జగన్ గారిని సీఎం చేసుకోవాల్సిన చారిత్రక అవసరం ఎంతో ఉంది. బుట్టా రేణుక, మాజీ ఎంపీ – బడుగు, బలహీన వర్గాలకు మేలు చేయాలన్న తపన ఉన్న నాయకుడు జగన్‌మోహన్‌రెడ్డి. – తన పాదయాత్రలో ఇచ్చిన హామీలను తూచ తప్పకుండా, ఆయా వర్గాలకు సంక్షేమ పథకాలను అందించారు. – అక్కడితో ఆగకుండా బీసీ,ఎస్సీ,ఎస్టీ, మైనార్టీలకు ప్రభుత్వంలో భాగస్వామ్యం కల్పించారు. అధికారపదవులనిచ్చారు. కార్పొరేషన్ల ఛైర్మన్లను చేశారు. జిల్లాపరిషత్ ఛైర్మన్లను చేశారు. మేయర్లను చేశారు. అటు రాజ్యసభ, ఇటు శాసనసభల్లోనూ గతంలో ఎన్నడూ లేని రీతిలో ప్రాతినిధ్యం కల్పించారు. – ఇప్పుడు కులగణనకు కూడా శ్రీకారం చుట్టారు జగనన్న. కులగణన వల్ల బీసీలకు ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. గుమ్మనూరు జయరామ్, మంత్రి. – బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు జగనన్న వచ్చాకే నిజమైన స్వాతంత్య్రం వచ్చింది. – మహిళలకు అన్ని విధాలా సాయం చేస్తున్న ఏకైక ముఖ్యమంత్రి జగనన్న. – ప్రతి పథకం.. మరీ ముఖ్యంగా ఇంటిస్థలాలు ఆడపడుచుల పేరునే ఇస్తున్నారు. – అభివృద్ధి ఎక్కడా అని అడుగుతున్నవారు...నిజంగా కళ్లుండి చూడలేని గుడ్డివారు మాత్రమే. – ఈ రోజు ప్రతి బీసీ,ఎస్సీ,ఎస్టీ, మైనార్టీ వర్గాల్లోని వారికి అధికారపదవులిచ్చి.. సామాజిక న్యాయమంటే ఇదీ అని చాటారు జగనన్న. అనిల్‌కుమార్ యాదవ్, మాజిమంత్రి. – ఈరోజున జగనన్నను దీవించడానికి బీసీ,ఎస్సీ,ఎస్టీ, మైనార్టీ సోదరులు. అశేషంగా వస్తున్నారు. – 2019లో..నాకు ఒక్క అవకాశం ఇవ్వండి. మిమ్మల్ని గుండెల్లో పెట్టుకుని చూసుకుంటాను అని జగనన్న చెప్పారు. – ప్రజల ఆశీస్సులతో అధికారంలోకి వచ్చాక, కేబినెట్ కూర్పు నుంచి, రాజ్యసభ, శాసనమండలి, కార్పొరేషన్ల వరకు అన్నింటా బీసీలకు,ఎస్సీ,ఎస్టీ, మైనార్టీలకు పెద్దపీట వేశారు ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి. – భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా చేయని విధంగా... నా బీసీ, నా ఎస్సీ, నా ఎస్టీ, నా మైనార్టీ సోదరులు అంటూ, వారిని అన్ని విధాలా ప్రోత్సహిస్తున్న ముఖ్యమంత్రి జగనన్నే. – రేపు రాబోయే ఎన్నికల్లో జగన్‌మోహన్‌రెడ్డిని గెలిపించుకోవాల్సిన బాధ్యత మనందరిది. మన భవిష్యత్తు కోసం జగనన్నను గెలిపించుకోవడం చాలా అవసరం. జగనన్న అంటే అభివృద్ధి. జగనన్న అంటే ఓ విప్లవం. శంకరనారాయణ, ఎమ్మెల్యే. – జగన్‌మోహన్‌రెడ్డి నాయకత్వంలో నడుస్తున్నందుకు మనమంతా గర్వపడాలి. – జగననన్న ప్రభుత్వంలో బడుగు, బలహీనవర్గాలకు అందుతున్న సంక్షేమం దేశంలోనే ఎక్కడా అందడం లేదని సగర్వంగా చెప్పవచ్చు. – బడుగు, బలహీనవర్గాలంటే ఎంతో ప్రేమ చూపే మన ముఖ్యమంత్రి, ఎన్నడూ వారిని ఓటుబ్యాంకుగా చూడలేదు. – సమాజానికి వెన్నెముకలాంటివారు నా బీసీలు అని సగర్వంగా చాటిన ఏకైక ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి. – బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సోదరులను ప్రభుత్వంలో భాగస్వాములను చేసిన ఘనత సీఎం జగన్‌మోహన్‌రెడ్డిదే. కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి,ఎమ్మెల్యే – సామాజిక సాధికార యాత్ర ఎందుకు? అవసరం ఏమిటి? అని మనమంతా ఆలోచించుకోవాలి. – స్వాతంత్య్రం వచ్చాక బీసీ, ఎస్టీ, ఎస్సీ, మైనార్టీల గురించి గతంలో నాయకుల ఆలోచన విధానం ఎలా వుంది? మన రాష్ట్రంలో ఇప్పుడు జగనన్న ఆలోచన ఎలా వుంది? అన్నది ఆలోచించాలి. – జనాభాలో అత్యధిక శాతం ఉన్న వారిని ఓటు బ్యాంకులానే వాడుకోవడం శోచనీయమని జగన్‌మోహన్‌రెడ్డి భావించారు. అందుకే ఆయన వారికి అధికారం ఉండాలని గట్టిగా సంకల్పించారు. – ఆ సంకల్ప బలంతోనే బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు పదవులిచ్చారు. సామాజిక న్యాయానికి సరైన అర్థం చెప్పారు మన ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి.