ఏలూరు: సామాజిక ధర్మాన్ని పాటిస్తున్న ఏకైక ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి అని వైయస్ఆర్‌సీపీ నేతలు ఉద్ఘాటించారు. కులం, మతం, ప్రాంతం, పార్టీలు చూడకుండా ఓటు వేయని వారికి కూడా సంక్షేమ పథకాలు జగనన్న అందిస్తున్నారని చెప్పారు. సామాజిక సాధికార యాత్ర నాలుగో రోజు ఏలూరు జిల్లా దెందులూరులో జరిగింది. ఈ సందర్భంగా నేతలు ఏమన్నారంటే.. జోగి రమేష్, మంత్రి – 175 నియోజకవర్గాల్లో బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు అందరూ ఒక్కతాటిపైకి వచ్చి జగనన్నకు అండగా ఉంటాం. – స్వతంత్ర భారత చరిత్రలో ఏ ముఖ్యమంత్రీ చేయని సామాజిక సాధికారత ధర్మాన్ని జగనన్న సాధించాడు. – 25 మంది మంత్రులు ఉంటే 17 మంది బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలకు ఇచ్చింది మన జగనన్న. – బాబూ జగ్జీవన్ రామ్, జ్యోతిరావు ఫూలే, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్, భగత్‌సింగ్ పోరాట పటిమ కలిస్తే.. జగన్‌మోహన్‌రెడ్డి గారు. మేరుగ నాగార్జున, మంత్రి – బీఆర్ అంబేద్కర్, జ్యోతిరావు పూలే, పెరియార్ రామస్వామి, బాబూ జగ్జీవన్ రామ్, సామాజికంగా వెనుకబడిన కులాల అభ్యున్నతి కోసం ఉద్యమాలు చేశారు. ఆ ఉద్యమ ఫలితం జగన్‌మోహన్‌రెడ్డి తీరుస్తున్నారు. – చంద్రబాబు పాలనలో అసమానతలు, అవహేళనలు, దళితులపై దాడులు చూశాం. – రాష్ట్రంలో పేద ప్రజల గుండె చప్పుడుగా, ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీల అభ్యున్నతి కోసం రూ.2.35 లక్షల కోట్లు డైరెక్ట్‌గా పేదలకు ఇచ్చిన ముఖ్యమంత్రి జగనన్న. – పేద వాడు గుండె మీద చేయి వేసుకొని తమ పిల్లలను ఇంగ్లీష్ మీడియం చదివించవచ్చు, బ్రహ్మాండమైన ఇల్లు కట్టుకోవచ్చు, ఆస్పత్రిలో చూపించుకోవచ్చు అనే ధైర్యం ఇచ్చిన ముఖ్యమంత్రి జగనన్న. విడదల రజని, మంత్రి – గతంలో ఏనాడైనా మన బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీల గురించి, వారి సాధికారత, ఎదుగుదల గురించి ఆలోచించిన రాజకీయపార్టీ, నేత ఎవరైనా ఉన్నారా? – ఈ రోజు బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలంతా.. జగనన్న మనకు ఉన్నారని ధైర్యంగా చెప్పుకొనే పరిస్థితి ఏర్పడింది. – వార్డు మెంబర్‌నుంచి రాజ్యసభ వరకు ఈ వర్గాలకు జగనన్న అవకాశాలు ఇచ్చారు. – బీసీలకు ఒక నాయకుడు ఉన్నాడంటే ఆ నాయకుడు జగనన్న. బీసీల వెనుక ఓ పార్టీ ఉందంటే అది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ. – ఏలూరులో రూ.500 కోట్లతో మెడికల్ కాలేజీ తీసుకొచ్చిన ఘనత జగనన్నది. – మహిళలకు ఏరోజూ ఇంత గుర్తింపు, ఇంత ప్రాధాన్యం లేదు. నవరత్నాల్లో 90 శాతం పథకాలు మహిళలకే అందుతున్నాయి. కారుమూరి నాగేశ్వరరావు, మంత్రి – 2014లో కలెక్టర్ల మీటింగులో మావాళ్లకే పనులు చేయాలని చంద్రబాబు చెప్పాడు. కానీ జగన్ గారు పార్టీలు, కులాలు, మతాలు చూడకుండా.. ఓటు వేయని వారికి కూడా చేయండని చెప్పారు. – ప్రజలెవ్వరూ కాలు బయట పెట్టకుండా, గడప దాటకుండా అన్ని పథకాలు అందించిన ఒకే ఒక్కడు జగన్‌మోహన్‌రెడ్డిగారు. – పేద కుటుంబాల్లో నుంచి కూడా డాక్టర్లు, ఇంజనీర్లు రావాలని అందరినీ చదివిస్తున్నారు. నందిగం సురేష్, ఎంపీ – పేదవాళ్ల కోసం, బాగోగుల కోసం జగనన్న అహర్నిశలు కష్టపడుతున్నారు. – గత నాయకులు ఎంగిలి విసిరి కాకిలెక్కలు చెప్పుకున్నారు. పేదవాళ్ల మీద పెత్తనం చేసిన వాళ్లనే చూశాం. రాజకీయాలు మీకెందుకురా అన్న వాళ్లను చూశాం. – కానీ పదవులు మీవే, పార్టీ మీదేనని జగన్ గారు చెబుతున్నారు. – మన పిల్లలు చదువుతుంటే పెత్తందార్లకు బాధ. కేసులు వేసి అడ్డుకున్నారు. – అమరావతిలో పేదలకు ఇళ్లస్థలాలు ఇస్తుంటే కోర్టుకు వెళ్లారు. కొఠారు అబ్బయ్య చౌదరి, ఎమ్మెల్యే – చంద్రబాబు, పవన్, మోదీ ఫొటోలతో 2014లో మేనిఫెస్టో ఇచ్చి ఏదీ అమలు చేయలేదు. – మన మేనిఫెస్టోలో చెప్పిన ప్రతి మాటా, ఇచ్చిన ప్రతి హామీ నెరవేర్చారు మన ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి. – చంద్రబాబు 2014లో డ్వాక్రా సంఘాలకు రుణమాఫీ చేశాడా? ప్రతి ఇంటికీ ఉద్యోగం అన్నాడు. లోకేష్‌కు తప్ప ఇంకెవరికన్నా ఇచ్చారా? – మన నియోజకవర్గంలో 11 వేల మందికి ఇళ్లు ఇచ్చిన జగనన్న. – నాలుగున్నరేళ్లలో దెందులూరులో రూ.2,800 కోట్ల అభివృద్ధి, సంక్షేమం. – రోడ్లు, ఇళ్ల స్థలాలు, అభివృద్ధి, సంక్షేమం, బడులు, హాస్పిటళ్లు.. ఏ విషయంలో అయినా మాజీ శాసనసభ్యుడు నాతో పోటీకి వస్తాడా?