టీడీపీ ప్రభుత్వం అంచనాలు, లక్ష్యాలను ఎప్పుడూ అందుకోలేదు

గ‌త ప్ర‌భుత్వ హయాంలో కాంట్రాక్టర్లకు దోచిపెట్టేలా అంచనాలు

యనమల మాటల్లో వాస్తవాలు లేవు

 బీసీ సంక్షేమానికి రూ. 20,100 వేల కోట్లు ఖర్చు

కరోనా పరీక్షల్లో ఆంధ్రప్రదేశ్‌ ప్రథమ స్థానంలో ఉంది

రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గ‌న రాజేంద్ర‌నాథ్‌రెడ్డి

 

ఆర్థిక మంత్రి బుగ్గ‌న‌రాజేంద్ర‌నాథ్‌రెడ్డి విజయవాడ:  గ‌త టీడీపీ ప్ర‌భుత్వం ఐదేళ్ల‌లో ఎప్పుడూ కూడా అంచ‌నాలు,ల‌క్ష్యాల‌ను అందుకోలేద‌ని రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గ‌న రాజేంద్ర‌నాథ్‌రెడ్డి పేర్కొన్నారు. గత ప్రభుత్వం 15 వేల కోట్ల రూపాయల బకాయిలు పెట్టిందని తెలిపారు. టీడీపీ నేతలు చేస్తున్న అసత్య ప్రచారాన్ని ఆయ‌న తీవ్రంగా ఖండించారు. ఈ మేర‌కు  రాజేంద్రనాథ్ రెడ్డి మీడియాతో మాట్లాడారు.  

టీడీపీ పాల‌న‌లో మూడేళ్లు అంచ‌నాలు త‌గ్గాయి: 
దేశవ్యాప్తంగా 2019 నుంచి ఆర్థిక మాంద్యం ఉందని రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి గుర్తుచేశారు. గత టీడీపీ ప్రభుత్వం అంచనాలు, లక్ష్యాలను ఎప్పుడూ అందుకోలేదని విమర్శించారు. వారి హయాంలో రెండంకెల వృద్ధి ఎక్కడ జరిగిందని ప్రశ్నించారు. టీడీపీ పాలనలో మూడేళ్ల అంచాలు వరుసగా తగ్గాయని తెలిపారు. 2018-19లో ఎంతో ఆర్థిక ప్రగతి సాధించినట్టు చెప్పుకున్నారని.. కానీ టీడీపీ నేత యనమల చెప్పిన దాంట్లో వాస్తవాలు లేవని చెప్పారు. రెవెన్యూ రాబడి 40 శాతం పడిపోయిందని ఎలా చెబుతున్నారని నిలదీశారు.

మా ప్ర‌భుత్వం వ‌చ్చాక వాటిని స‌రిచేశాం
టీడీపీ హయాంలో కాంట్రాక్టర్లకు దోచిపెట్టేలా అంచనాలు పెంచారని మంత్రి బుగ్గ‌న గుర్తుచేశారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని సరిచేశామని చెప్పారు. గత ప్రభుత్వం 15 వేల కోట్ల రూపాయల బకాయిలు పెట్టిందని తెలిపారు. ద్రవ్యోల్బణం విషయంలోనూ యనమల తప్పుడు లెక్కలే చెప్పారని మండిపడ్డారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ సంక్షేమాన్ని వైయ‌స్సార్‌సీపీ ప్రభుత్వం కాలరాసిందని కూడా అబద్ధాలు చెప్పారు. 2018-19లో సంక్షేమానికి టీడీపీ 5600 కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు చేసిందన్నారు.  తాము అధికారంలోకి వచ్చాక బీసీ సంక్షేమానికి రూ. 20,100 వేల కోట్లు ఖర్చు చేసినట్టు చెప్పారు.

ఎక్క‌డ కోత విధించ‌లేదు
పేదలకు అన్ని విధాల సంక్షేమాన్ని కొనసాగిస్తూనే ఉన్నామని.. ఎక్కడ కోత విధించడం కానీ, తగ్గించడం కానీ చేయలేదని మంత్రి తెలిపారు. తమ ప్రభుత్వం 3 కోట్లకు పైగా లబ్దిదారులకు రూ. 42 వేల కోట్లు అందించిందని తెలిపారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు మొత్తం ప్రభుత్వమే చెల్లించిందని గుర్తుచేశారు. 30 లక్షల మంది పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వబోతున్నామని తెలిపారు.కేంద్రం అన్ని విధాల సహకరిస్తామని చెబితే.. తన ఢిల్లీ పర్యటనపై పచ్చ మీడియాలో అసత్య వార్తలు రాస్తున్నారని మండిపడ్డారు. కరోనా పరీక్షల్లో ఆంధ్రప్రదేశ్‌ ప్రథమ స్థానంలో ఉందన్నారు. ఏపీకి మంచి జరగడం టీడీపీకి ఇష్టం లేదని చెప్పారు. కరోనా కష్టకాలంలో కూడా పేదలకు సంక్షేమాన్ని అమలు చేస్తున్నామని బుగ్గ‌న రాజేంద్ర‌నాథ్ రెడ్డి వివ‌రించారు.  

తాజా వీడియోలు

Back to Top