అనకాపల్లి ఎంపీ అభ్యర్థిగా డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడు

మాడుగుల ఎమ్మెల్యే అభ్య‌ర్థిగా ఈర్లి అనురాధ 

తాడేప‌ల్లి: అనకాపల్లి లోక్‌సభ స్థానానికి అభ్యర్థి పేరును వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడిని బరిలో నిలుపుతున్నట్లు పేర్కొంది. ఇప్పటికే  175 ఎమ్మెల్యే, 24 ఎంపీ స్థానాలకు అభ్యర్థుల్ని ప్రకటించిన వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ .. అనకాపల్లి ఎంపీ సీటు ఒక్కదానినే పెండింగ్‌లో ఉంచిన సంగతి తెలిసిందే.  
బూడి ముత్యాల నాయుడు కొప్పుల వెలమ సామాజిక వర్గం. ప్రస్తుతం మాడుగుల సిట్టింగ్‌ ఎమ్మెల్యేగా ఉన్న ఆయన్ని ఎంపీ అభ్యర్థిగా ప్రమోషన్‌ ఇచ్చారు సీఎం జగన్‌. దీంతో.. మాడుగుల స్థానానికి వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఈర్లి అనురాధను ఎంపిక చేశారు. అనురాధ బూడి ముత్యాలనాయుడు కుమార్తె.

Back to Top