సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌తో బ్రిటన్‌ డిప్యూటీ హైకమిషనర్ బృందం భేటీ

తాడేప‌ల్లి: ముఖ్యమంత్రి శ్రీ వైయ‌స్‌ జగన్‌ను క్యాంప్‌ కార్యాలయంలో  బ్రిటన్‌ డిప్యూటీ హైకమిషనర్‌ (ఏపీ, తెలంగాణ) డాక్టర్‌ ఆండ్రూ ఫ్లెమింగ్, బ్రిటీష్‌ ట్రేడ్, ఇన్వెస్టిమెంట్‌ హెడ్‌ వరుణ్‌ మాలి, పలువురు బృంద సభ్యులు మ‌ర్యాద‌పూర్వ‌కంగా క‌లిశారు. ఆంధ్రప్రదేశ్‌ లో జరుగుతున్న అభివృద్దిని వివరించి, పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాలని బ్రిటన్‌ టీంను సీఎం వైయ‌స్‌ జగన్ కోరారు. ఏపీలో ఆరోగ్యం, ఇంధనం, విద్యుత్‌ వాహనాలు, వ్యవసాయ టెక్నాలజీ, వాతావరణ మార్పులు వంటి రంగాల్లో పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తిగా ఉన్నట్లు బ్రిట‌న్ టీం సీఎంకు వివ‌రించింది. అనంత‌రం డాక్టర్‌ ఆండ్రూ ఫ్లెమింగ్‌ను  సీఎం వైయ‌స్ జ‌గ‌న్ సన్మానించి, జ్ఞాపిక అందజేశారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top