తూర్పు గోదావరి జిల్లా: అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గంలో జనసేన పార్టీ కి భారీ షాక్ తగిలింది. జనసేన పార్టీకి బొంతు రాజేశ్వరరావు రాజీనామా చేశారు. ఇవాళ వైయస్ఆర్‌సీపీ అధినేత, సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో బొంతు రాజేశ్వరరావు వైయస్ఆర్‌సీపీలో చేరారు. తేతలిలో నైట్ స్టే పాయింట్ వద్ద రాజోలు, పి.గన్నవరం నియోజకవర్గాల నుంచి జనసేన, తెలుగుదేశం పార్టీలకు చెందిన కీలక నేతలు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిక. జనసేన, టీడీపీల నుంచి వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన నేతలకు కండువా వేసివైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించిన ముఖ్యమంత్రి వైయస్ జగన్. ముఖ్యమంత్రి వైయస్.జగన్ సమక్షంలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన రాజోలు జనసేన కీలక నేత బొంతు రాజేశ్వరరావు, మాజీ పీఏసీ చైర్మన్ మేకల వీరవెంకట సత్యనారాయణ(ఏసుబాబు), టి. త్రిమూర్తులు, ఎం.నరసింహస్వామి, దొమ్మేటి సత్యనారాయణ, మంద సత్యనారాయణ, మాజీ సర్పంచ్ కేశనపల్లి డి సూర్యనారాయణ. రాజోలు జనసేన పార్టీ నుంచి బొంతు రాజేశ్వరరావు సారధ్యంలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన జనసేన సర్పంచ్ కాకర శ్రీను, చింతా సత్యప్రసాద్. పి.గన్నవరం నియోజకవర్గం నుంచి మాజీ ఎమ్మెల్యే ఎన్.గణపతిరావు కుమారుడు ఎన్ గణేష్ బాబు, మనవడు ఎన్.గణపతిరావులు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. తెలుగుదేశం పార్టీ నుంచి వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన టీడీపీ నేత వడ్లమూడి గంగరాజు. ముఖ్యమంత్రి శ్రీ వైయస్.జగన్ సమక్షంలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన తాడేపల్లి గూడెంకు చెందిన ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఏపీ కన్వీనర్ గమ్మిని సుబ్బారావు