బోటింగ్ ఆప‌రేష‌న్స్ ప‌ర్య‌వేక్ష‌ణ బాధ్య‌త క‌లెక్ట‌ర్ల‌దే

వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా కంట్రోల్‌ రూమ్స్‌ ప్రారంభించిన సీఎం వైయస్‌ జగన్‌

తాడేపల్లి: బోటింగ్‌ ఆపరేషన్స్‌ను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కలెక్టర్లను ఆదేశించారు. నదీతీర ప్రాంతాల్లో సురక్షిత బోటింగ్‌ కోసం పర్యాటక శాఖ ఏర్పాటు చేసిన బోటింగ్‌ ఆపరేషన్స్‌ కంట్రోల్‌ రూమ్‌లను తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయం నుంచి ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ ప్రారంభించారు. పలు జిల్లాల్లో ఏర్పాటు చేసిన 9 కంట్రోల్‌ రూమ్‌లను సీఎం ప్రారంభించారు. అనంతరం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా క‌లెక్ట‌ర్ల‌కు పలు ఆదేశాలిచ్చారు. కలెక్టర్లు ఒక గంట కేటాయించి బోటింగ్‌ ఆపరేషన్స్‌పై, తీసుకుంటున్న జాగ్రత్తలపై సమీక్షా సమావేశాలు నిర్వహించాలని ఆదేశించారు. ఎస్‌ఓపీలు అన్ని కంట్రోల్‌ రూమ్‌లలో ఫాలో అవుతున్నారా..? లేదా..? అని చూసుకోవాల్సిన బాధ్యత కలెక్టర్లదేనన్నారు. 

విజయవాడ బారంపార్కు, నాగార్జున సాగర్, శ్రీశైలం, రుషికొండ, పశ్చిమగోదావరి జిల్లాల్లోని పోచవరం, సింగనపల్లి, తూర్పుగోదావరి జిల్లాలోని గండిపోచమ్మ, పేరంటాలపల్లి, రాజమండ్రి వద్ద ఏర్పాటు చేసిన టూరిజం కంట్రోల్‌ రూమ్‌లను సీఎం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్, పంచాయతీ రాజ్‌ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. 
 

Back to Top