బద్వేల్‌ ఎన్నికల్లో దాసరి సుధ ఎప్పుడో గెలిచారు

టీడీపీ, జనసేన లోపాయకారి కుట్రలు 

వైయ‌స్ఆర్‌సీపీ అధికార ప్ర‌తినిధి అంబ‌టి రాంబాబు

వైయ‌స్ఆర్ జిల్లా: బద్వేల్‌ ఎన్నికల్లో వైయ‌స్ఆర్ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి దాసరి సుధ ఎప్పుడో గెలిచార‌ని వైయ‌స్ఆర్‌సీపీ అధికార ప్ర‌తినిధి అంబ‌టి రాంబాబు పేర్కొన్నారు. మెజారిటీ కోసమే త‌మ ప్ర‌చార‌మ‌ని స్ప‌ష్టం చేశారు. బద్వేల్‌ ఉప ఎన్నికల ప్రచారంలో అంబ‌టి రాంబాబు పాల్గొన్నారు. ఆయ‌న మాట్లాడుతూ.. బుధ‌టీడీపీ జనసేన లోపాయకారి కుట్రలు కొనసాగిస్తున్నాయి. జనసేన కార్యకర్తలు బీజేపీ తరపున ప్రచారం నిర్వహిస్తున్నారు. జనసేన అధినేతకు నిజాయితీ ఉందా?. చనిపోయిన అభ్యర్థి వెంకటసుబ్బయ్య కుటుంబంపై సానుభూతితో పోటీకి దూరంగా ఉన్నాం అన్నారు కదా పవన్‌. ఇప్పుడేంటి ఈ నీతిమాలిన రాజకీయం?. అమిత్‌ షాపై రాళ్లు వేసిన ఘటన ఆయనకు గుర్తుండదా.. అందుకే చంద్రబాబుకి అమిత్‌ షా అపాయింట్‌మెంట్‌ ఇవ్వలేదు. మా ఊరు వస్తే రాళ్లు వేస్తాం. మీ ఊరు వస్తే కాళ్లు పట్టుకుంటాం అంటే ఎలా..? అంటూ చంద్రబాబుపై అంబటి మండిపడ్డారు. 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top