ఎచ్చెర్ల‌లో `బాబు ష్యూరిటీ - మోసం గ్యారెంటీ' 

ఎచ్చెర్ల‌:  వైయ‌స్ఆర్‌సీపీ అధినేత వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి పిలుపు మేర‌కు సోమ‌వారం ఎచ్చెర్ల మండలం తమ్మినాయుడు పేట గ్రామంలో బాబు ష్యూరిటీ-మోసం గ్యారెంటీ కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించారు. వైయ‌స్ఆర్‌సీపీ  ఎచ్చెర్ల నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు, పార్టీ సమన్వయకర్త గొర్లె కిరణ్ కుమార్ ఆదేశాల మేర‌కు  మండల పార్టీ అధ్యక్షుడు బోర సాయిరాం రెడ్డి ఆధ్వ‌ర్యంలో  తమ్మినాయుడు పేట గ్రామంలో  ఇంటింటా ప‌ర్య‌టించి చంద్ర‌బాబు మోసాల‌ను ఎండ‌గ‌ట్టారు. క్యూ ఆర్ కోడ్ ను స్కాన్  చేయించి చంద్రబాబు చేసిన మోసాలను ప్రజలకు వీడియో రూపంలో వివరించారు. అధికారంలోకి వ‌చ్చేందుకు చంద్ర‌బాబు అనేక హామీలు ఇచ్చి..తీరా అధికారంలోకి వ‌చ్చాక మోసం చేశార‌ని మండిప‌డ్డారు. కార్యక్రమంలోవైయ‌స్ఆర్‌సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి సనపల నారాయణ రావు, మండల పార్టీ అధ్యక్షులు బోర సాయిరాం రెడ్డి,వైస్ ఎంపీపీ జరుగుళ్ల శంకర్, జిల్లా పంచాయతీ రాజ్ వింగ్ అధ్యక్షులు నేతింటి నీలం అప్పుడు, జిల్లా వైయ‌స్ఆర్‌సీపీ సెక్రటరీ అంబటి రాంబాబు, జిల్లా యూత్ వింగ్ జనరల్ సెక్రటరీ కొత్తకోట సూర్య రావు, నియోజకవర్గ వాణిజ్య విభాగం అధ్యక్షులు బోర గోవింద రెడ్డి, మండల పార్టీ ఉపాధ్యక్షులు మాడుగుల జగదీశ్, కోటిపాత్రుని హరికృష్ణ,  త‌దిత‌రులు పాల్గొన్నారు.

Back to Top