సీఎం వైయ‌స్‌ జగనన్నకు విద్యార్థులంతా రుణపడి ఉంటారు 

బీటెక్‌ ఫైనల్‌ ఇయర్‌ విద్యార్థి ఇందుమతి
 

 తిరుపతి: ఇవాళ తను ఇంజనీరింగ్‌ చదువుతున్నానంటే జగనన్నే కారణమని బీటెక్‌ ఫైనల్‌ ఇయర్‌ విద్యార్థి ఇందుమతి తెలిపింది. సీఎం జగనన్నకు విద్యార్థులంతా రుణపడి ఉంటామని ఆమె పేర్కొంది.  గురువారం తిరుపతి నగరంలోని తారకరామ స్టేడియంలో జరిగిన విద్యాదీవెన నగదు జమ కార్యక్రమంలో విద్యార్థిని మాట్లాడారు.  ఇందుమతి మాట్లాడుతూ..తన తండ్రి  సామన్య రైతు అని,  తననుఇంజనీరింగ్‌ చదివించేందుకు ఎంతో కష్టపడాల్సి వచ్చిందని తెలిపింది. అదే సీఎం వైయ‌స్ జగన్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తనకు పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌తో సులభంగా చదువును పూర్తి చేసుకున్నానని పేర్కొంది. అలాగే హాస్టల్‌ వసతి కోసం ప్రతి సంవత్సరం రూ. 20 వేలు వస్తున్నాయని చెప్పింది.
 
‘నాతో పాటు నా కుటుంబాన్ని కూడా జగనన్న ప్రభుత్వం సాయపడుతుంది. చెల్లెకి అమ్మఒడి పథకం ద్వారా 15 వేలు, తండ్రికి రైతు భరోసా ద్వారా 13,500.. నానమ్మకు ఆసరా ఫించన్‌ వస్తుంది. ఇలా ఎన్నో కుటుంబాలను సీఎం జగన్‌ ఆదుకుంటున్నారు. ఇందుకు సీఎం వైయ‌స్ జగన్‌కు కృతజ్ఙతలు. జగనన్న విద్యాదీవెన ద్వారా చదువుకొని కాలేజ్‌ ప్లేస్‌మెంట్స్‌లో మూడు ఉద్యోగాలు సాధించానని జగనన్న చెల్లిగా గర్వంగా చెబుతున్నాను. ఇలా జగనన్న ప్రవేశ పెట్టిన పథకాల ద్వారా ప్రతి ఒక్క విద్యార్థి ఉపయోగించుకొని అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాను’ అని ఇందుమ‌తి అన్నారు. 

తాజా వీడియోలు

Back to Top