వైయస్‌ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో జెండా ఎగురవేయనున్న విజయమ్మ

అమరావతి: గుంటూరు జిల్లా తాడేపల్లిలో నూతనంగా నిర్మించిన వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఈ నెల 15న నిర్వహించే స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.  ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి మాతృమూర్తి, పార్టీ గౌరవాధ్యక్షురాలు వైయస్‌ విజయమ్మ జాతీయ పతకాన్ని ఎగురవేయనున్నారు. పార్టీ శ్రేణులు, అభిమానులు వేడుకల్లో పాల్గొననున్నారు.
 

Back to Top