చంద్రబాబు, లోకేష్‌పై ఈసీకి వైయ‌స్ఆర్‌సీపీ ఫిర్యాదు

 
అమ‌రావ‌తి: ఎన్నికల నియమావళికి విరుధ్దంగా వ్యవహరిస్తున్న చంద్రబాబు,లోకేష్ లతోపాటు ఈనాడు,ఆంధ్రజ్యోతిలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ వైయ‌స్ఆర్‌సీపీపి ఎన్నికలసంఘానికి ఫిర్యాదు చేసింది. పార్టీ లీగల్ సెల్ రాష్ట్ర‌ అధ్యక్షుడు మనోహర్ రెడ్డి, పార్టీ గ్రీవెన్స్ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు నారాయణమూర్తి లు ఎన్నికల అదికారులకు ఫిర్యాదులను అందచేశారు.

1.తెలుగుదేశం అద్యక్షుడు చంద్రబాబు,జాతీయప్రధాన కార్యదర్శి నారాలోకేష్ ల ట్వీట్టర్ లలో ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ పై ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ జగన్ గారిపై దుష్ప్రచారం చేస్తున్నారు.ఇది మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ కు విరుధ్దం. కాబట్టి తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.

2. ఈనాడు,ఆంధ్రజ్యోతి దినపత్రికలలో ముఖ్యమంత్రి వైయస్ జగన్ కు, వైయ‌స్ఆర్‌సీపీకి వ్యతిరేకంగా న్యూస్ ఆర్టికల్స్ ప్రచురిస్తున్నారు.ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు.వ్యక్తిగతంగా వైయ‌స్  జగన్ గారిని కార్టూన్స్,మార్ఫింగ్ ఫోటోలతో ప్రచురణ చేస్తున్నారు.వారిపై కఠిన చర్యలు తీసుకుని క్రిమినల్ కేసులు నమోదు చేయాలని కోరారు. 

Back to Top