అనంతపురం: మంత్రి పరిటాల వర్గీయులు ఆగడాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. చెన్నెకొత్తపల్లి మండలం నాగసముద్రంలో పరిటాల వర్గీయులు వైయస్‌ఆర్‌సీపీ నేతలు,కార్యకర్తలపై వేట కోడవళ్లతో దాడికి పాల్పడారు.ఈ ఘటనలో నలుగురు వైయస్‌ఆర్‌సీపీ కార్యకర్తలకు తీవ్రగాయపడ్డారు.ఎన్నికల్లో టీడీపీకి సహకరించని వారిపై కూడా దాడులకు పాల్పడ్డారు. బీసీలను పరిటాల వర్గీయులు టార్గెట్ చేశారు. రాప్తాడు టీడీపీ అభ్యర్థి పరిటాల శ్రీరాం ఆదేశాలతో దాడులు చేశామని నిందితులు చెబుతున్నారు. పరిటాల వర్గీయులు దాడులకు నిరసనగా ఎస్‌ఎస్ గేట్ వద్ద వైయస్‌ఆర్ కాంగ్రెస్ నేతలు,కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. దౌర్జన్యాలు చేస్తున్న పరిటాల శ్రీరాంను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు.ఈ సందర్భంగా పోలీసులకు, వైయస్‌ఆర్‌సీపీ కార్యకర్తల మధ్య వాగ్వాదం జరిగింది. మంత్రి పరిటాల వర్గీయుల ఆగడాలపై పోలీసుల ప్రేక్షక పాత్ర వహించడం పట్ల వైయస్ఆర్సీపీ నేతలు,కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.దాడులకు పాల్పడిన పరిటాల వర్గీయులను ఎస్ఐ రఫీ వదిలివేయడం పట్ల వైయస్ఆర్సీపీ నేతలు మండిపడ్డారు