దైవం దీవిస్తుంటే ..దయ్యాలు గోల చేస్తున్నాయి

అగ్రి మిషన్‌ వైస్‌ చైర్మన్, వైయస్‌ఆర్‌సీపీ రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షుడు ఎంవీఎస్‌ నాగిరెడ్డి 

చంద్రబాబు, కరువు కవల పిల్లలు

చంద్రబాబు ఎప్పుడు సీఎం అయినా కరువు తాండవిస్తుంది

చంద్రబాబు హయాంలో కరువుతో గ్రామాలకు గ్రామాలు వలసలు Ðð ళ్లేవి

వైయస్‌ఆర్‌ సీఎం అయ్యాక మళ్లీ మంచి రోజులు వచ్చాయి

రైతన్నా .... నీ మద్ధతు.... నీ ఓటు ..... నీటికా ? కరువుకా ?

తాడేపల్లి:  ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి పాలనలో దైవం దీవిస్తుంటే ..దయ్యాలు గోల చేస్తున్నాయని అగ్రి మిషన్‌ వైస్‌ చైర్మన్, వైయస్‌ఆర్‌సీపీ రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షుడు ఎంవీఎస్‌ నాగిరెడ్డి పేర్కొన్నారు. సీఎం వైయస్‌ జగన్‌ పాలనలో గ్రామాలన్నీ పచ్చగా ఉన్నాయి..నదులన్నీ కలకలలాడుతున్నాయి. వైయస్‌ జగన్‌ పాలనలో ఆహార ధాన్యాలు, పండ్ల ఉత్పత్తి భారీగా పెరిగిందని తెలిపారు. భూగర్భ జలాలు సైతం అందుబాటులోకి వచ్చాయన్నారు.చంద్రబాబు పాలనలో ఎప్పుడు కరువు, కాటకాలే దర్శనమిచ్చాయని చెప్పారు. ఆహార ఉత్పత్తులు భారీగా పెంచగలిగిన ప్రభుత్వం కావాలా? కరువు కాటకాలతో ఉండే పాలన కావాలో తేల్చుకోవాలని సూచించారు. బుధవారం ఎంవీఎస్‌ నాగిరెడ్డి తాడేపల్లిలోని వైయస్‌ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు.

ఎంవీఎస్ నాగిరెడ్డి ఏమ‌న్నారంటే..

 • రాష్ట్రంలోని రైతు సోదరులకు, వ్యవసాయ కార్మికులకు, వ్యవసాయ అనుబంధ కుల వృత్తుల వారందరికీ ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు...
 • సంక్రాంతి అంటేనే రైతు పండుగ ... సంక్రాంతికి మహాలక్ష్మి గోమాత-ఆ గోమాత పూజ  ధనుర్మాసం మొదలైన నాటి నుండి సంక్రాంతి నెలగా-ఇంటి ముందు గో పేడతో కళ్ళాపి జల్లి, గోపేడతో గొబ్బిమ్మలు పెట్టి – హరిదాసులకు బియ్యం దానం-గంగిరెద్దుకు ధాన్యం – పప్పు ధాన్యాలతో రైతు + తన పొలంలో పని చేసే రైతు కూలీలందరితో కలిసి జరుపుకునే పండగ సంక్రాంతి.
 •     నేటి తరంలోనూ  ఇంట్లోనే గోశాల పెట్టుకున్న ముఖ్యమంత్రి శ్రీ జగన్‌ మోహన్‌ రెడ్డి గారు ఆ గోవుల సంరక్షణ నిత్యం చేసే వారి భార్య శ్రీమతి భారతమ్మ గారు ... రైతుకు లక్ష్మీ దేవి అయిన గోసేవలో ఉన్న ముఖ్యమంత్రి గారి దంపతులు.
 •     వ్యవసాయానికి, జీవ కోటి మనుగడకు ప్రాణాధారం నీరు.  భూమాత పచ్చటి, పసిడి పైరులతో విరాజిల్లుతూ, వ్యవసాయ ఉత్పత్తులు పెరగాలన్నా, పశుసంపద వృద్ధి చెందాలన్నా ప్రకృతి ప్రసాదించే నీటితోనే సాధ్యం.   ఆహార ధాన్యాల ఉత్పత్తి – ఆహార భద్రత మాత్రమే కాదు – జీవన భద్రత అనేది గ్రహించాలి.
 •     ప్రకృతి అనుగ్రహం లేక రైతు కుటుంబాలు ప్రక్క రాష్ట్రాలకు దినసరి కార్మికులుగా వలస పోవడం, పశుసంపద కబేళాలకు తరలిపోయిన పాలన కాలం మనం చూశాం.
 • చంద్రబాబునాయుడు – కరువు కవల పిల్లలు అనే విషయం
 • 1995 నుండి 1999 వరకు పాలన, 1999 నుండి 2004 వరకు పాలన, 2011 నుండి 2014 వరకు తానే విప్‌ ఇచ్చి నడిపిన కిరణ్‌కుమార్‌ రెడ్డి గారి ద్వారా నడిపిన పాలన మరలా 2014 నుండి 2019 వరకు 5 సంవత్సరాలలో 1623 మండలాలను కరువు మండలాలుగా ప్రకటించిన పరిస్థితిలో లక్షలాది ఎకరాలలో పంటలు ఎండి పోవడం, లక్షల సంఖ్యలో బోరుబావులు నీరు లేక ఎండిపోయిన పరిస్థితి, పని కోసం బెంగుళూరు, చెన్నై, కేరళకు వలస పోయి సంక్రాంతికి స్వంత ఇంటికి రాలేక, సంక్రాంతిని జరుపుకోలేని దుర్భర పరిస్థితి మనమంతా చూశాం.
 • అదే సమయంలో
 • 2004 నుండి 2009 వరకు దివంగత ముఖ్యమంత్రి  డాక్టర్‌ వై.యస్‌.రాజశేఖర రెడ్డి గారి పాలన,  2019 నుండి 2022 వరకు ప్రియతమ ముఖ్యమంత్రి వై.యస్‌.జగన్‌మోహన్‌ రెడ్డి గారి పాలన....
 • సకాలంలో వర్షాలు, నిండు కుండలుగా సాగునీటి ప్రాజెక్టులు, ఆహారధాన్యాల ఉత్పత్తి పెరుగుదల, పశుసంపదకు సంవృద్ధిగా నీరు, పశ్చిక...పని కోసం వలసలు లేని రాష్ట్రం – ధనుర్మాసం మొదలు నుండి సంక్రాంతి కనుమ వరకు రైతు సోదరులు స్వంత గ్రామంలో, స్వంత ఇంటిలో జరుపుకుంటున్న సంక్రాంతి.
 •     కరువు పాలకుల పాలనలో ఎన్నడూ లేని విధంగా భూగర్భ జలాల మట్టాలు అడుగంటిన పరిస్థితి... 
 • చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బలి చక్రవర్తి భూమి మీదకు వస్తే... ఏమి కనిపిచ్చేది... కరువు తప్ప
 • అదే జగన్‌ మోహన్‌ రెడ్డి గారి పాలనలో ఈ రోజు బలిచక్రవర్తి భూమి మీదకు వస్తే నిండుగా జలసంపదతో ప్రాజెక్టులు, పచ్చటి పసిడి పైరులతో  వలసలు లేని గ్రామాలు...చదువుకునే పిల్లలతో నిండిన చక్కటి పాఠశాలలు కనిపిస్తాయి...
 •     ఇది అసలైన సంక్రాంతి అంటే – ఇది ఒక అపూర్వం. రాష్ట్రాన్ని దైవం దీవిస్తున్నాడు .... కాని దయ్యాలు అరుస్తున్నాయి.
 •     జగన్‌ మోహన్‌ రెడ్డి గారు ఎప్పుడూ తన గురించి గొప్పగా చెప్పుకోడు...అన్నీ తన ద్వారానే జరిగినా ఆ దేవుని దయతో  మీ అందరి చల్లని దీవెనెలతో జరిగినాయని చెబుతాడు.
 •     అదే చంద్రబాబు తాను చెయ్యనిదీ, మానవా తీత పనులను కూడా నేనే చేశానని

    1.  హైదరాబాద్‌ను ప్రపంచ పటంలో నేనే పెట్టాను.
    2.  ప్రపంచానికి పాఠాలు చెప్పిన వ్యక్తిని నేను.
    3.  వాజ్‌పాయ్‌ గారికి స్వర్ణచతుర్భుజి కారిడార్‌ ఏర్పాటు చెయ్యమని నేనే చెప్పాను.
    4.  హైదరాబాద్‌లో ఇంటర్‌ నేషనల్‌ ఎయిర్‌పోర్ట్‌, అవుటర్‌ రింగ్‌ రోడ్డు, ఫ్లైఓవర్స్‌ నేనే నిర్మించాను.
    5.  రాజధానిలో 10 డిగ్రీల ఉష్ణోగ్రత తగ్గించమని అధికారులకు ఆదేశించాను.
    6.  సముద్రాన్ని కంట్రోల్‌ చేశాను, తిత్లీ తుఫాన్‌ కంట్రోల్‌ చేశాను.
    7.  రెయిన్‌గన్‌లతో కరువును జయించాను.
    8.  కరోనా వాక్సిన్‌ తయారు చేసిన ఘనత తెలుగుదేశం పార్టీది 
 ఇలాంటి మోస పూరిత మాటలు చెబుతాడు.... వ్యత్యాసం గమనించండి
ఎవరు ఉంటే పంటలు పండుతున్నాయి...                                                    (ఎవరు ఉంటే పంట నష్టం ఎక్కువ ఉంటుంది)  
ధాన్యం ఉత్పత్తి               137 లక్షల టన్నులు(2019-20)       అత్యధికం               112.33 లక్షల టన్నులు(2015-16)    కనిష్టం

ఆహార ధాన్యాల ఉత్పత్తి  175 లక్షల టన్నులు(2019-20)  అత్యధికం                  143.78 లక్షల టన్నులు(2015-16)    కనిష్టం
                        
పండ్ల ఉత్పత్తి                     369 లక్షల టన్నులు(2021-22)       అత్యధికం         169.96 లక్షల టన్నులు(2014-15)    కనిష్టం
    

ఎవరు ఉంటే భూగర్భ జలసంపద, ప్రాజెక్టులలో నీరు ఉంటుంది.
భూగర్భ జల మట్టాలు                          బోరుబావులు ఎండిపోవడం అనేక సంవత్సరాలు                        గత మూడు సంవత్సరాల కాలంలో భూగర్భ జల మట్టం 
12.67 మీటర్ల నుంచి (చంద్రబాబు పాలన)                                               శ్రీశైలం రిజర్వాయరే నిండక పోవడం 
 5.78 మీటర్లకు ఎగబాగినది.                      ప్రకాశం బ్యారేజి దాటి నీరు వెళ్ళని పరిస్థితి.              
శ్రీశైలం, నాగార్జున సాగర్‌ ,పులిచింతల ప్రతి సంవత్సరం అనేక సార్లు నిండి వందలాది టి.యం.సి.ల నీరు సాగర సంగమానికి పయనం.                  
                                
ఆంధ్రప్రదేశ్‌కు అన్నపూర్ణగా, దక్షిణ భారత ధాన్యాగారంగా పేరు తెచ్చిన ప్రాంతం కృష్ణా, గోదావరి, పెన్నా డెల్టాలో పండే ధాన్యం పంట.... ఆహార ధాన్యాల ఉత్పత్తిలో, పండ్ల ఉత్పత్తిలో, కూరగాయల ఉత్పత్తిలో రాష్ట్రం అగ్రగామి...వీటి ఉత్పత్తులు, ఉత్పాదకతలో 2014-15 నుండి నేటి వరకు ఎవరి పాలనలో ఎలా పండాయో మీ ద్వారా రాష్ట్ర ప్రజల ముందుంచుతున్నాను.  ఇవి నేను తయారు చేసిన డేటా కాదు వై.యస్‌.ఆర్‌.కాంగ్రెస్‌ పార్టీ తయారు చేసిన డేటా కాదు.  స్వతంత్ర భారత దేశంలో అధికారికంగా డి.ఈ.ఎస్‌. తయారు చేసిన డేటా ఇది.ఎవరైనా అధికారిక  వెబ్‌సైట్‌ల నుండి చూడవచ్చు.

పంట ఉత్పత్తులు:    
    ఈ ప్రభుత్వం ఏర్పడిన తరువాత అహార ధాన్యాలు మరియు ఉద్యాన పంటల ఉత్పత్తులలో గణనీయమైన ప్రగతి సాధించడం జరిగింది.
    2014-15 నుండి 2018-19 5 సం॥ రాల కాలంలో (సరాసరి)    2019-20 నుండి 2022-23  4 సం॥రాల కాలంలో(సరాసరి)
    వృద్ది(సరాసరి)
ఆహార ధాన్యాల ఉత్పత్తి    153.95
 లక్షల టన్నులు    166.47
లక్షల టన్నులు    +12.52
లక్షల టన్నులు
ఒక్క వరిలో    121.93 
లక్షల టన్నులు    130.87
లక్షల టన్నులు    +8.94
లక్షల టన్నులు
ఉద్యానపంటలు    228.47
 లక్షల టన్నులు    332.51
లక్షల టన్నులు    +104.04
లక్షల టన్నులు

 
రాష్ట్ర విభజన జరిగిన తర్వాత  అత్యధికంగా సాగు జరిగే   ఉత్పత్తి  (లక్షల టన్నులు) (ఖరీఫ్‌ + రబీ)                  వరి              ఆహార ధాన్యాలు     
  అతి తక్కువ రికార్డు      2015-16 (చంద్రబాబు గారి పాలనలో)                      112.33             143.78
 అత్యధిక దిగుబడి     2019-20 (జగన్‌ మోహన్‌ రెడ్డి గారి పాలనలో)          137.10             175.12
    ఖరీఫ్‌లో సాగు విస్తీర్ణము తగ్గిందని అవాస్తవాలు ప్రచారము చేయడము జరుగుతుంది.  రైతులు ఎప్పడుకూడ లాభసాటి మరియు అధిక విలువ గల పంటల వైపు మళ్లడం జరుగుతుంది.  ప్రభుత్వము కూడ అందుకు ప్రోత్సహిస్తుంది.  అందులో భాగంగా గత మూడు సంవత్సరాలలో మొత్తంగా 1,43,901 హెక్టార్లు ఆదనంగా ఉద్యాన పంటల వైపు మొగ్గు చూపడము జరిగింది. సాగు విస్తీర్ణం – వ్యవసాయము +ఉద్యానవనం+ఆక్వాకల్చర్‌ కలిపి లెక్కిలించాలి - ఈ ప్రభుత్వ కాలంలో సాగు విస్తీర్ణం తగ్గలేదు.
ఉద్యాన పంటలు
గత మూడు సంవత్సరాల సరాసరి విస్తీర్ణం 17.96 లక్షల హెక్టార్లు, 332.51 లక్షల టన్నుల సరాసరి దిగుబడితో
5 సంవత్సరాల సరాసరి విస్తీర్ణం (2014-19) 15.97 లక్షల హెక్టార్లు, 228.47 లక్షల టన్నుల సరాసరి దిగుబడితో
అంటే సరాసరి 2 లక్షల హెక్టార్ల ఉద్యాన పంటల అధిక విస్తీర్ణంతో సరాసరి 104.04 లక్షల టన్నుల దిగుబడి సాధించడం (45.53 % ఎక్కువ)
ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం దేశంలో కెల్ల
పండ్ల విస్తీర్ణం, దిగుబడిలో మొదటి స్థానం (15.8%), కూరగాయల ఉత్పత్తి (7.8%)
ఉత్పాదకలో మొదటి స్థానం - కొబ్బరి, కొకాయి, మిరప, ఆయిల్‌పామ్‌, బొప్పాయి, నిమ్మ, టమోటా 
ఉత్పాదకలో రెండవ స్థానం – జీడిమామిడి, మామిడి మరియు బత్తాయి  
పాల ఉత్పత్తిలో నాలుగోవ  స్థానం (147.13 లక్షల టన్నులు, మాంసం ఉత్పత్తిలో నాలుగోవ స్థానం 9.54 లక్షల టన్నులు మరియు కోడి గుడ్లు  ఉత్పత్తిలో మొదటి స్థానం (2496.39 కోట్లు)
రొయ్యల మరియ చేపల ఉత్పత్తి దేశ ఉత్పత్తిలో 30.82 మరియు 76 శాతం, (ఎగుమతులలో 30 శాతానికి పైగా)
మత్స్య రంగం వృద్ధి రేటు 12.57 శాతంగా ఉండగా దేశంలో సగటు వృద్ధి రేటు 6.61 శాతంగా నమోదు అయినది.
రాష్ట్ర స్థూల జాతీయోత్పత్తి 
5 సంవత్సరాల (2014-19)కాలంలో వ్యవసాయ పంటల రాష్ట్ర స్థూల జాతీయోత్పత్తి విలువ రూ.3242 కోట్లు మేర తగ్గుదల, 
మన మూడు సంవత్సరాల (2019-22)కాలంలో రూ.10,545 కోట్ల మేర పెరుగుదల.

 
నీతి ఆయోగ్‌ రిపోర్ట్‌ ప్రకారం ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం పేదరికంలో 20వ స్థానంలో (12.31 శాతం) ఉండగా దేశపు పేదరికం 25.01 శాతం, ధనిక రాష్ట్రాలైన ఉత్తరప్రదేశ్‌ 3వ స్థానం. (37.79 శాతం), మధ్యప్రదేశ్‌ 4వ స్థానం (36.65 శాతం), పశ్చిమబెంగాల్‌ 12వ స్థానం (21.43 శాతం), గుజరాత్‌ 13 వ స్థానం (18.60 శాతం), మహారాష్ట్ర 17 వ స్థానం, (14.85 శాతం), తెలంగాణ 18వ స్థానం (13.74 శాతం) మరియు కర్నాటక 19వ స్థానం (13.16 శాతం), 
పేదరిక నిర్మూలనలో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం మెరుగుదలగా ఉన్నది.
    వ్యవసాయం కోసం ఏ ప్రభుత్వం పని చేసినా పార్టీ పక్షపాతం కుదరదు.  భూమిని నిజంగా సాగు చేస్తూ శ్రమిస్తున్న రైతులకు రాజకీయాలు ఉండవు...
కులం, మతం, పార్టీలతో సంబంధం లేకుండా నవరత్నాలలోని సంక్షేమ పధకాలన్నీ 90 శాతం రైతు కుటుంబాలకు అందుతున్నాయి.
గ్రామాలలో భూమి ఉండి , పట్టణాలకు వలసపోయి, భూమిని సాగు చెయ్యకుండా, రైతు కష్టం వదిలేసి మాటల్లో మాత్రం మేమూ రైతులమే అని మాట్లాడే వాళ్ళలోనే రాజకీయం ఉంటున్నది... బాధ్యతలను పంచుకోకుండా, హక్కుల గురించి మాత్రమే మాట్లాడుతూ నిరంతరం ఎదుటి వారిని విమర్శించడమనే పనిలో ఉన్నవాళ్ళు కాదు... రైతులు.
ధర్మం ఎప్పటికీ విజయం సాధిస్తుంది అనటానికి నిదర్శనం – మహాభారత యుద్ధం.
    మహాభారత యుద్ధంలో 7 అక్షాహిణుల సైన్యం కొద్ది మంది మాత్రమే మహారధులతో అర్జునుడు ఎలా విజయం సాధించాడు.
    11 అక్షాహిణుల సైన్యం భీష్మ, ద్రోణ, కర్ణ, కృపాచార్య లాంటి అనేక యోదానుయోధులైన మహారధులైన యోధులున్న కౌరవ సైన్యం ఎందుకు ఓడిపోయింది...
    తను ఒక్కడినే ఒక వైపు అది కూడా ఆయుధం పట్టను, నాసైన్యం యాదవ వీరులంత మరొకవైపు  ఉంటారు కోరుకొమ్మని కృష్ణుడు చెప్పగా అర్జునుడు దైవాంశ సంభూతుడైన నువ్వు నా ప్రక్కన ఉండు చాలని ధర్మం కోసం పొరాడిన అర్జునుడు విజయుడైనాడు.
    కౌరవుల తరపున ఎందరో మహా రధులున్నప్పటికీ అధర్మం అని తెలిసి కూడా అధర్మం వైపు పోరాడంతో పరాజితులైనారు. ఇప్పడు కూడా అబద్ధపు ప్రచారాలతో, మోసమే ఆయుధంగా ఎంతమందితో కూటమి కట్టినా అపజయమే, కూటమి వినాశనమవ్వడం తప్ప ఫలితమేమీ ఉండదు.

 
తిరిగి కరువు కాటకాలతో, రైతుల కుటుంబాలు దినసరి కార్మికులుగా ప్రక్క రాష్ట్రాలకు వలసలతో, జన్మభూమి లాంటి కమిటీలతో పక్షపాత పాలన ప్రభుత్వం కావాలా?
    పసిడి పైరులతో – ఆహర ధాన్యాల ఉత్పత్తులతో – వలసలు లేని, నీటి కొరతలేని, కులం, మతం, పార్టీల పక్షపాతం లేని పాలన ప్రభుత్వం కావాలా?
ఆలోచించండి
రైతన్నా .... నీ మద్ధతు.... నీ ఓటు ..... నీటికా ? కరువుకా ?

                                    (యం.వి.ఎస్‌.నాగిరెడ్డి)

 

Back to Top