అరకు ఉత్సవాలు ప్రారంభం

విశాఖ:  గిరిజన సంస్కృతిని ప్రపంచానికి చాటిచెప్పేలా రెండు రోజుల పాటు నిర్వహిస్తున్న అరకు ఉత్సవాలను శనివారం రాష్ట్ర పర్యాటకశాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు ప్రారంభించారు.  ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. అరకు ప్రాంతం పర్యాటకంగా ఎంతో ప్రాధాన్యత పొందిందని, ఈ ఉత్సవాల ద్వారా దేశ విదేశాలకు చెందిన మరింతమంది పర్యాటకులను ఆకర్షించేందుకు తగిన ఏర్పాట్లు చేశామని చెప్పారు.   ఏజెన్సీలోని యువత ఎంతో ఆలోచనాశక్తి కలవారని, వారిలో ఉన్న ప్రతిభ, నైపుణ్యాలను వెలికితీసేందుకు ప్రభుత్వం పలు పథకాలు ప్రవేశపెడుతోందని పేర్కొన్నారు. గిరిజన యువతకు పర్యాటక శాఖలో మరిన్ని  ఉపాధి అవకాశాలు కల్పిస్తామని చెప్పారు.కార్యక్రమంలో అరకు ఎంపీ గొడ్డేటి మాధవి, అరకు, పాడేరు ఎమ్మెల్యేలు చెట్టి పాల్గుణ, కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి  తదితరులు పాల్గొన్నారు.

తాజా వీడియోలు

Back to Top