చంద్రబాబే కాదు..ఆయన తాతలు దిగి వచ్చినా అభివృద్ధిని ఆపలేరు

ఏపీఎండీసీ ఛైర్‌పర్సన్‌ షమీమ్ అస్లాం

టీడీపీ నేతలు నోరు అదుపులో పెట్టుకోకపోతే మహిళలే బడిత పూజ చేస్తారు*

 కంకర తవ్వితేనే కదా గుంతలు పూడ్చేది..*

 

 మైనింగ్ చేయకుండానే 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేశావా బాబూ..?*

 చంద్రబాబు అసలు మనిషేనా..?*

 

చంద్రబాబు నిజం మాట్లాడటం ఎప్పుడైనా విన్నారా..?*

 

 నేను వేసిన రోడ్ల మీద నడుస్తారా అన్న బాబు పాలనఎక్కడ.. నా పాలన చూసి ఓటెయ్యండన్న జగన్ గారి పరిపాలన ఎక్కడ..?*

 

 రోజ్ వుడ్ దొంగ నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి అని బాబే చెప్పాడు*

 

తాడేపల్లి:  ప్రతిపక్ష నేత చంద్రబాబే కాదు..ఆయన తాతలు దిగి వచ్చినా కూడా వైయస్‌ జగన్‌ చేస్తున్న అభివృద్ధిని ఆపలేరని ఏపీఎండీసీ చైర్‌పర్సన్‌ షమీమ్‌ అస్లాం హెచ్చరించారు. సీఎం వైయస్‌ జగన్‌ ప్రజల మనిషి..తప్పకుండా ప్రకృతి కూడా సహకరిస్తుందని చెప్పారు. శుక్రవారం ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులుతో కలిసి షమీమ్‌ అస్లాం మీడియాతో మాట్లాడారు. ఇవాళ రాష్ట్రంలో 30 లక్షల ఇళ్లు కడుతున్నామని, వీటిని సిమెంట్, ఇసుక అవసరం కాదా అని ప్రశ్నించారు. టీడీపీ హయాంలో సిమెంట్, ఇసుక లేకుండానే నిర్మాణాలు చేపట్టారా అని నిలదీశారు. రాష్ట్ర అభివృద్ధిపై ఎల్లోమీడియా విష ప్రచారం చేస్తుందని ఆమె మండిపడ్డారు.

ప్రభుత్వం మీద నిత్యం తప్పుడు ప్రచారం చేసే పట్టాభి, మరికొంతమంది ఆ పార్టీ నాయకులకు మహిళలే తగిన గుణపాఠం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారు.  నిలదేసేందుకు మహిళలు వస్తే.. దొంగలా మాల్దీవులకు పారిపోయిన బ్రోకర్‌ పట్టాభి, చంద్రబాబు విదిల్చే చిల్లర కోసం, సిగ్గు, శరం, లజ్జ లేకుండా ఇంకా నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నాడు. చంద్రబాబు మెప్పు కోసం ఇకనైనా బ్రోకర్‌ పనులు చేయడం, ఊడిగం చేయడం మానుకుంటే మంచిది. 

 

 కొండల్ని తవ్వేస్తున్నారంటూ ఆరోపణలు చేస్తున్నాడు. మరి 14ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో చంద్రబాబు మైనింగ్‌ అనేదే చేయలేదా?. మీ హయాంలో ఇసుక, కంకర, కొండలు  తవ్వకాలు జరపకుండానే 14ఏళ్లు సీఎంగా పనిచేశావా? కంకర తవ్వకాలు జరిపితేనే కదా గుంతలు పూడ్చేది. ఆ గుంతలు పూడ్చటానికి కంకర తవ్వితే, కంకర తవ్వారని విమర్శలు చేస్తావు. లేటరైట్‌ లేకుండా సిమెంట్‌ ఎక్కడైనా తయారు అవుతుందా? మీ ప్రభుత్వ హయాంలో లేటరైట్‌ తవ్వకాలు జరపలేదా? లేక స్పెషల్‌గా మీ వ్యర్థాలను ఏమైనా కలిసి సిమెంట్‌ను తయారు చేశారా? విమర్శలు చేసేటప్పుడు బుద్ధి, జ్ఞానం ఉండాలి. 

 

 అధికారంలో ఎవరు ఉన్నా..  సిమెంట్‌ తయారీకి ఒకటే విధానం ఉంటుంది. సిమెంటు ఉత్పత్తికి మూడు శాతం లేటరైట్‌ను వాడతారు. అదే మీ హయాంలో చేస్తే అది ఒప్పు. మా ప్రభుత్వం హయాంలో జరిగితే తప్పా?.  రాష్ట్రవ్యాప్తంగా 30 లక్షల ఇళ్ల నిర్మాణాలు జరుగుతున్నాయి. అది అభివృద్ధి కాదా? ఆ ఇళ్ల నిర్మాణాల కోసం ఇసుక, గ్రావెల్‌, కంకర, సిమెంట్‌ అవసరం ఉండదా?

 

చంద్రబాబు బాధ అంతా ఏంటంటే.. మైనింగ్‌ తవ్వకాల వల్ల రాష్ట్రానికి ఆదాయం వస్తే... జగనన్న రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తాడు. అందుకే రాష్ట్ర అభివృద్ధిని ఏవిధంగానైనా అడ్డుకోవాలని కుట్రలు పన్నుతున్నాడు. జగనన్న సంక్షేమ కార్యక్రమాలను అడ్డుకోవడం చంద్రబాబు తాత తరం కూడా కాదు. జగనన్న ప్రజల మనిషి. ప్రజలతో పాటు దేవుడు కూడా జగనన్నకు సహకరిస్తాడు.

 

నాడు-నేడు కార్యక్రమం ద్వారా ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిగారు ప్రభుత్వ స్కూళ్ళను అద్భుతంగా రూపుదిద్ది,  రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, పేద విద్యార్థులకు ఉన్నత చదువులు చెప్పించేందుకు ఇంగ్లీషు మీడియం ప్రవేశపెట్టి, అమలు చేస్తున్నా.. మీరెందుకు ఏడుస్తున్నారు..?. ప్రభుత్వ స్కూళ్ళలో ఈరోజు మౌలిక వసతులతో పాటు విద్యా ప్రమాణాలు మెరుగుపడ్డాయి. ముఖ్యమంత్రిగారు ఇంగ్లీష్‌ మీడియం ప్రవేశపెడితే దానికి అడ్డుపడింది చంద్రబాబు నాయుడు కాదా? మీ పిల్లలు మాత్రం ఇంగ్లీష్‌ మీడియంలో చదువుకోవాలి, అదే మా పేద పిల్లలు మాత్రం ఇంగ్లీష్‌ మీడియం చదవేందుకు అర్హులు కాదా?

- చంద్రబాబు నాయుడు, ఆయన కోసం నిత్యం భజన చేసే ఎల్లో మీడియా అధినేతలంతా.. తమ పిల్లల్ని, మనవళ్ళను ఏ మీడియంలో చదివిస్తున్నారు..? తెలుగు మీడియంలో చదివిస్తున్నారా లేక ఇంగ్లీషు మీడియంలో చదివిస్తున్నారా చెప్పండి. 

 

 వైయస్సార్‌ సీపీ ప్లీనరీ సమావేశాలు విజయవంతం కావడంతో టీడీపీ నేతల ఫ్యాంట్లు తడిచిపోతున్నాయి. మీ పార్టీ  రాజకీయంగా సమాధి అయింది. చంద్రబాబులా వెన్నుపోటు పొడిచి వచ్చిన నాయకుడు జగన్ గారు  కాదు.  జనంలో నుంచి వచ్చిన నాయకుడు మా జగనన్న. జగనన్న ప్రజలకు చేస్తున్న అభివృద్ధి - సంక్షేమ కార్యక్రమాలు చూసి, ప్రతి గడపలో ప్రజలు మాకు నీరాజనాలు పలుకుతుంటే.. అది చూసి ఓర్వలేక, నిత్యం ప్రభుత్వం మీద నిందలు వేస్తున్నారు. దివంగత నేత వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డిగారు ముస్లింలకు నాలుగు శాతం రిజర్వేషన్లు ఇవ్వడం వల్లే,  ఇవాళ మా మైనార్టీ పిల్లలు లక్షల మంది డాక్టర్లు, ఇంజినీర్లు అయ్యారు. తన తండ్రికన్నా రెండు అడుగులు ముందుకు వేసి జగన్ గారు రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడుపుతున్నారు.

 

చంద్రబాబు నాయుడుకు, జగనన్నకు ఎలాంటి పోలిక లేదు. నేను వేసిన రోడ్ల మీద నడిచి, నాకు ఓట్లు వేయలేదని  చంద్రబాబు ప్రజల్ని నిలదీస్తే... అదే జగనన్న‘నేను అభివృద్ధి చేశానని మీరు నమ్మితేనే నాకు ఓటు వేయండి. లేకుంటే ఓటు వేయొద్దు’ అని ధైర్యంగా చెప్పారు, ఆ ధైర్యం చంద్రబాబుకు ఏనాడైనా ఉందా..?.  చంద్రబాబు అసలు మనిషేనా అని సూటిగా ప్రశ్నిస్తున్నాను. తాను మొరగమన్నట్టల్లా మొరిగే నలుగురు బ్రోకర్లను పార్టీ ఆఫీసులో పెట్టుకుని, పనీపాటా లేకుండా రోజూ మీడియా సమావేశాలు పెట్టించి, మా ముఖ్యమంత్రిగారిని తిట్టిస్తారా, లేనిపోని అభాండాలు వేస్తారా..

 

చంద్రబాబు నాయుడు నిజం మాట్లాడటం ఎప్పుడైనా ఎవరైనా విన్నారా? అంటే లేదు.  ఇప్పుడు కూడా ఆయనను జనం ఎవరూ నమ్మడం లేదు. అందుకే ప్రభుత్వంతో పాటు, మా ముఖ్యమంత్రిగారిపై విమర్శలు చేయడమే పనిగా పెట్టుకున్నాడు. పనికిమాలిన వ్యక్తులతో తానే సర్వేలు చేయించుకుని, తన గ్రాఫ్ పెరిగిందంటూ తనకు అనుకూల మీడియాలో ప్రచారం చేయించుకుంటూ, మరో పనికిమాలిన టీడీపీ సోషల్‌ మీడియాలో ప్రచారం చేయించుకుంటున్నాడు.

 

  చిత్తూరు జిల్లాలో నల్లారి కిషోర్‌ కుమార్‌ రెడ్డి... మా ప్రభుత్వం మీద, మంత్రి పెద్దిరెడ్డి గారిపైన కువిమర్శలు చేస్తున్నాడు. మీడియా ముందు పూనకం వచ్చినట్లుగా ఊగిపోయాడు. మీ అన్న కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో, అధికారాన్ని అడ్డుపెట్టుకుని నువ్వు ఎన్ని అరాచకాలు చేశావో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. జిల్లాలో భుములు కబ్జా చేశావు, రోజ్‌వుడ్‌ దొంగలించావు. నువ్వు రోజ్‌వుడ్‌ దొంగవని.. ఇప్పుడు నీ చేత మాట్లాడిస్తున్న చంద్రబాబు నాయుడు ప్రెస్‌మీట్‌ పెట్టి మరీ చెప్పాడు. అందుకు సంబంధించిన ఆధారాలు అన్నీ మా దగ్గర ఉన్నాయి.

- నువ్వు ఎంతోమంది మహిళల జీవితాలనూ సర్వనాశనం చేశావో కూడా తెలుసు. 

- మంత్రి పెద్దిరెడ్డిగారు సంప్రదాయంగా స్వామి మాల వేసుకుంటే.. దానినీ విమర్శిస్తున్నారే? అసలు నువ్వు హిందువువేనా? బుద్ధీ, జ్ఞానం ఉందా..?

 

 కుప్పంలో  స్థానిక ఎన్నికల్లో చిత్తు చిత్తుగా ఓడిపోయిన చంద్రబాబు నాయుడుకు, అక్కడ కూడా స్థానం లేదు. అక్కడ తన కోసం మాట్లాడేందుకు ఎవరూ లేక,  కిషోర్‌ కుమార్‌ రెడ్డిని పెట్టుకుని నాటకాలు ఆడుతున్నాడు. కాంగ్రెస్‌ పార్టీలో ఉనికి లేకపోవడంతో టీడీపీకి వచ్చి, రాజకీయంగా  నేను ఇంకా బతికే ఉన్నా అని చెప్పేందుకు పెద్దిరెడ్డి గారు, మిథున్‌ రెడ్డి గార్లపై విమర్శలు చేస్తున్నావు.  చంద్రబాబు ఇచ్చే టికెట్ కోసం ఇంత బరితెగించి మాట్లాడతావా.. ?. బుద్ది లేని మాటలు మాట్లాడకు. ఇప్పటికైనా మనిషిగా ప్రవర్తించు. లేకుంటే మా ఆడవాళ్ల చేతిలో తన్నులు తింటావని గుర్తుంచుకో. 

 

తాజా వీడియోలు

Back to Top