చిత్తూరు: హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన లాన్స్ నాయక్ సాయితేజ కుటుంబానికి ఏపీ ప్రభుత్వం అండగా నిలుస్తోంది. సాయితేజ సభ్యులను.. ఏపీ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి శనివారం పరామర్శించనున్నారు. అనంతరం రాష్ట్ర ప్రభుత్వం తరఫున 50 లక్షల రూపాయల చెక్‌ను సాయి తేజ కుటుంబ సభ్యులకు అందజేయనున్నారు. డిసెంబర్ 8న తమిళనాడు, కూనూర్ వద్ద చోటు చేసుకున్న హెలికాప్టర్ ప్రమాదంలో బిపిన్ రావత్ దంపతులతో పాటు మృతి చెందిన వారిలో సాయి తేజ కూడా ఉన్నారు. శనివారం ఉదయం డీఎన్ఏ పరీక్షల ఆధారంగా సాయి తేజ భౌతికకాయాన్ని అధికారులు గుర్తించారు. అనంతరం సాయితేజ ఆస్పత్రిలో పుష్పగుచ్చం ఉంచి శ్రద్ధాంజలి ఘటించి.. మిలటరీ లాంఛనాలతో సాయితేజ స్వస్థలానికి భౌతికకాయాన్ని తరలించారు.