చంద్ర బాబు స్కిల్డ్ క్రిమినల్.. అన్ స్కిల్డ్ పొలిటీషియన్

మంత్రి అమర్నాథ్‌

ఐటీ నోటీసుల‌తో తీగ వచ్చింది.. ఇంక డొంక కదలాలి.. 

చంద్రబాబు.. తనపై వచ్చిన ఆరోపణలకు సమాధానాలు చెప్పాలి కదా

నారా వారి పల్లి నుంచి జూబ్లీ హిల్స్ వరకు ఆయనదో అవినీతి సామ్రాజ్యం

“ఈడీ” ఎంటరై “కేడీ”ని పట్టు కోవాలి

 విశాఖపట్నం: చంద్ర బాబు స్కిల్డ్ క్రిమినల్..అన్ స్కిల్డ్ పొలిటీషియన్ అని మంత్రి గుడివాడ అమ‌ర్నాథ్ అభివ‌ర్ణించారు.  రెండు రోజులుగా మాజీ సీఎం చంద్రబాబు నాయుడు ఐటీ షో కాజ్ నోటీసుల గురించి జాతీయ మీడియా కథనాలు  ఇస్తున్నాయి. అయినా ఆయన తనపై వచ్చిన ఆరోపణలకు సమాధానం ఇవ్వడం లేదు. పైగా పొంతన లేని సమాధానాలు చెబుతూ దాటవేస్తున్నారు.  రూ.118 కోట్ల అవినీతికి పాల్పడినట్లు ఐటీ నోటీసుల ద్వారా స్పష్టమవుతోంది. అలాంటప్పుడు ఐటీ నోటీసులకు ఎందుకు సమాధానం ఇవ్వరు. ప్రజలకు నీతులు చెప్పే చంద్రబాబు.. తనపై వచ్చిన ఆరోపణలకు సమాధానాలు చెప్పాలి కదా అని మంత్రి అమర్నాథ్‌ ప్రశ్నించారు. సోమవారం విశాఖలో గుడివాడ అమ‌ర్నాథ్‌ మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబుకు పలు ప్రశ్నలు సంధించారు.  

 చంద్రబాబుది చీకటి చరిత్ర. 
- ఐటీ డిపార్ట్‌మెంట్ ఇచ్చిన షోకాజ్ నోటీసులపై చంద్రబాబు నాయుడు పొంతన లేని సమాధానాలు చెబుతూ, అసలు విషయాన్ని దాటవేస్తున్నారని మంత్రి గుడివాడ అమర్నాథ్‌ విమర్శించారు. తనపై వచ్చిన ఆరోపణలకు చంద్రబాబు సమాధానం ఇవ్వడం లేదు. రూ.118 కోట్ల అవినీతికి పాల్పడినట్లు ఐటీ నోటీసుల ద్వారా స్పష్టమవుతోంది. అలాంటప్పుడు ఐటీ నోటీసులకు ఎందుకు సమాధానం ఇవ్వరు. వేదికలెక్కి ప్రజలకు నీతులు చెప్పే చంద్రబాబు.. తనపై వచ్చిన ఆరోపణలకు సమాధానాలు చెప్పాలి కదా. చంద్రబాబుపై వచ్చిన ఆరోపణలపై ఇంతవరకు ఆయన స్పందించలేదు. చంద్రబాబుది ఒక చీకటి చరిత్ర. చంద్రబాబు రాజకీయంగా, ఆర్థికంగా ఎదిగిన తీరు అలాంటిది. 40 ఏళ్ల రాజకీయ చరిత్ర అని చెప్పుకునే చంద్రబాబు రాజకీయాల్లోకి రాక ముందు ఆస్తి ఎంత? ఇప్పుడు ఎంత?

అవినీతి పునాదుల మీద చంద్రబాబు ఎదిగారు.
చంద్రబాబు జీవితం అంతా.. కుట్రలు, కుతంత్రాలు, అవినీతి. చంద్రబాబు రాజకీయంగా అవినీతి చేసి,  వేల కోట్లు ఆస్తులు సంపాదించాడు. దేశ చరిత్రలోనే ఏ రాజకీయ నాయకుడిపైన ఇన్ని స్కాంలు, ఆరోపణలు వచ్చి ఉండవు. ఏలేరు స్కాం మొదలు స్టాంపుల కుంభకోణం, నేటి  అమరావతి వరకు చంద్రబాబు కుంభకోణాల చిట్టా చాలా పెద్దది. మొదట్నుంచి చంద్రబాబు బ్యాక్‌ డోర్ పొలిటిషియన్‌. మామని వెన్నుపోటు పొడిచి, అధికారం లాక్కుని, అధికారాన్ని అడ్డం పెట్టుకుని అక్రమంగా సంపాదించిన ఆస్తులే చంద్రబాబువి. దర్జాగా ఒక నాయకుడిగా చంద్రబాబు ఎదిగిన సందర్భాలు లేవు. నారావారి పల్లె నుంచి జూబ్లీహిల్స్ ప్యాలెస్ వరకు అవినీతి పునాదుల మీద చంద్రబాబు ఎదిగారు. 

- పైకేమో.. చంద్రబాబు గొప్ప గొప్ప మాటలు, నీతి సూత్రాలు, ప్రవచనాలు చెబుతారు. రాజకీయాల్లో తనకంటే సీనియర్‌ దేశంలోనే లేరని అంటాడు. అమరావతి కాంట్రాక్టులకు సంబంధించి, లంచాల రూపంలో రూ.118 కోట్లు చంద్రబాబు తీసుకున్నారని ఇన్‌కం ట్యాక్స్ డిపార్ట్‌మెంట్‌ చెబుతుంటే.. ఎందుకు నోరు మెదపటం లేదు. ఎందుకు తేలు కుట్టిన దొంగలా దాక్కున్నాడు. ఎందుకు ఐటీ డిపార్ట్‌మెంట్‌ జారీ చేసిన నోటీసులపై చంద్రబాబు స్పందించట్లేదు. ఐటీ డిపార్ట్‌మెంట్‌ అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా తప్పించుకోవటానికి ప్రయత్నం చేస్తున్నారు. ప్రజలకు సమాధానం చెప్పకుండా చంద్రబాబు దాక్కొని తిరుగుతున్నారు. 

చెప్పేవి శ్రీరంగ నీతులు..చేసేవి తప్పుడు పనులు 
అన్నాహజారే వారసుడినంటూ చెప్పుకునే చంద్ర బాబు.. ఐటీ నోటీసులపై ఎందుకు స్పందించరు. నిత్యం ప్రజలకేమో శ్రీరంగనీతులు చెబుతారు. చంద్రబాబు కోర్టులకు వెళ్లి ఎన్ని స్టేలు తెచ్చుకున్నారో చూశాం. వ్యవస్థల్ని మేనేజ్‌ చేయటంలో చంద్రబాబు నైపుణ్యం ఎవ్వరికీ రాదు. ఐటీ నోటీసులకు సమాధానం చెప్పకుండా సంబంధం లేని లేఖలు రాస్తున్నారు. ఇది నేను చేయలేదని, తనకు సంబంధం లేదని ఎందుకు చంద్రబాబు చెప్పట్లేదు. బాబూ.. మీరు దొరికి పోయారని మీకు బాగా తెలుసు. ఇప్పటి వరకు బయటకు వచ్చింది తీగ మాత్రమే.. ఇక డొంక కదలాలి. అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఇన్నేళ్ళుగా ప్రజల ఆస్తుల్ని కొల్లగొట్టిన విషయాలన్నీ ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తాయి. ఆదాయపు పన్ను శాఖ ఆగస్టు 4న చంద్రబాబుకు 46 పేజీల షోకాజ్ నోటీసు ఇచ్చింది. ఈ నోటీసు తీసుకోవటానికి చంద్రబాబు నిరాకరించారు. 

దొంగ దొరికిన తర్వాత కూడా దబాయింపా?
అమరావతిలో దొంగతనం చేసిన దొంగ అతను.. అయినా, అతను బుకాయించేది ఎలా ఉందంటే..  పోలీస్ పెట్రోలింగ్‌లో దుర్గమ్మ గుడి దగ్గర దొరికి.. నేను అమరావతిలో దొంగతనం చేశాను. మీరెవ్వరు పట్టుకోవటానికి అంటే పోలీసులు ఊరుకుంటారా? అమరావతి పోలీసులే పట్టుకోవాలి. మీరు ఎవరు పట్టుకోవటానికి అంటే అర్థం ఉంటుందా? ఇలాగే చంద్రబాబు తీరుంది. మీరు ఎవరు నాకు నోటీసులు ఇవ్వటానికి అని ఐటీ డిపార్ట్‌మెంట్‌ పరిధిపై చంద్రబాబు దబాయిస్తాడు. 

అవినీతి డబ్బుకు కోడ్‌ లాంగ్వేజ్‌
చంద్రబాబు ఐటీ డిపార్ట్‌మెంట్‌కు వేసిన ప్రశ్నలకు వారు చాలా వివరంగా సమాధానం ఇచ్చారు. చంద్రబాబు పీఏ శ్రీనివాస్, మనోజ్ వాసుదేవ్‌ పార్థసాని (ఎంవీపీ) వాంగ్మూలంను ఐటీ డిపార్ట్‌మెంట్‌ చాలా స్పష్టంగా ప్రస్తావించింది. అవినీతి సొమ్మును తిరిగి లంచంగా తీసుకోవటంతో మీడియేటర్‌గా వాడుకున్న ఎంవీపీ, శ్రీనివాస్‌లు కీలకంగా వ్యవహరించారు. 2014-19లో టిడ్కో హౌసింగ్‌, సీఆర్‌డీఏ చేపట్టిన హైకోర్టు, ఇతర నిర్మాణాల ద్వారా రూ.118 కోట్లను మనీల్యాండరింగ్ ద్వారా తీసుకున్నారని ఐటీ డిపార్ట్‌మెంట్‌ వారు లేఖ రాశారు. ఈ డబ్బు తీసుకోవటానికి కోడ్ లాంగ్వేజ్‌ వాడారు. లంచాల డబ్బును టన్నుల్లోకి మార్చి.. లెక్కలు రాశారని ఐటీ డిపార్ట్‌మెంట్‌ చెప్పింది. 

ఐటీ నోటీసుల్లో లోకేష్ పాత్ర
హయగ్రీవ సంస్థ నుంచి రూ.11 కోట్లు, అన్నై, షలాకా కంపెనీల నుంచి రూ.52.50 కోట్లు,  ఫోనిక్స్‌ ఇన్‌ఫ్రా, పౌర్ ట్రేడింగ్ లక్‌స్టోన్‌ అండ్‌ కో నుంచి రూ.41.90 కోట్లు, దుబాయ్‌ నుంచి రూ.15.14 కోట్లు చంద్రబాబుకు వచ్చినట్లు ఐటీ వెల్లడించింది. డబ్బు ఇచ్చిన వ్యక్తి, నీ దగ్గర పనిచేసిన పీఏ నీ పేరు చెప్పినా.. నా పేరు ఎవరైనా చెప్పారా అని చంద్రబాబు అడగటం ఏమిటి? డబ్బు చంద్రబాబు తినేసి.. రేపు వారి మీద కేసు నెట్టివేసే ప్రయత్నం చేస్తున్నారు. ఐటీ నోటీసులో లోకేశ్ పేరు కూడా ఉంది. ఇంత పెద్ద ఎత్తున ప్రజాసొమ్ము దోచేశారు. సబ్‌ కాంట్రాక్టుల రూపంలో మళ్లీ వాటిని లంచాల క్రింద చంద్రబాబు తీసుకున్నారు. పైగా తిరిగి నంగనాచిలా చంద్రబాబు మాట్లాడటం ఏమిటి?

బాబు స్కిల్డ్ క్రిమినల్..
చంద్రబాబు అనే వ్యక్తి.. స్కిల్డ్ క్రిమినల్.. అన్ స్కిల్డ్ పొలిటీషియన్ అని అంటున్నారు. చంద్రబాబులా అవినీతి చేయటం ఎవరి వల్లా సాధ్యం కాదు. ఎంత పెద్ద దొంగ అయినా.. ఏదో ఒక సందర్భంలో దొరక్క మానడు. నీ అవినీతి చరిత్ర అంతా రుజువులతో సహా నిరూపితం అయింది. చంద్రబాబు అవినీతిపై రాష్ట్ర ప్రభుత్వం చేసిన ఆరోపణలు కావు కదా... ఇవి కేంద్ర దర్యాప్తు సంస్థలు తేల్చిన నిజాలు. మాట్లాడితే నిప్పును అనే చంద్రబాబు ఎప్పుడో తుప్పు పట్టేశారు. 

స్కిల్ డెవలప్మెంట్ పేరిట రూ.350 కోట్లు కాజేసిన చంద్రబాబు
సీమెన్స్ అనే సంస్థలో ఓ వ్యక్తి ద్వారా స్కిల్‌డెవలప్‌మెంట్‌ ద్వారా రూ. 3,356 కోట్లు గ్రాంటుగా పెడుతుందని చెప్పి రాష్ట్ర ప్రభుత్వ వాటా 10% క్రింద రూ.350 కోట్లు పెట్టాలన్నారు. ఆ విధంగా రాష్ట్ర ఖజానా నుంచి రూ.350 కోట్లు దారి మళ్లించారు. ఈ రూ.350 కోట్లు కూడా అత్యవసరంగా రాష్ట్ర కేబినెట్ ద్వారా టేబుల్ అజెండా ద్వారా మళ్లించారు. ఒక సెక్రటరీ, చంద్రబాబు ఈ నిధుల్ని విడుదల చేయమని ఆదేశించారని ఫైల్‌పై రాశారని టేబుల్ ఎజెండాగా రాయటం కూడా జరిగింది. ఎప్పుడైతే ఈ స్కాం వెలుగులోకి వచ్చిందో.. తన మనుషుల ద్వారా బయటపడటానికి చంద్రబాబు ప్రయత్నించారు. కానీ కుదరలేదు. చంద్రబాబు స్కిల్ డెవలప్మెంట్ పేరిట డబ్బులు కాజేశారు. మరోవైపు అమరావతి రాజధానిపేరిట వేల కోట్ల అవినీతికి పాల్పడ్డారు.  యూరో లాటరీ మాదిరిగా సీమెన్స్ పేరిట మోసం చేశారు. సీమెన్స్ అనే జర్మనీకి చెందిన సంస్థ సీఎస్‌ఆర్‌ కింద రూ.3వేల కోట్లు గ్రాంటు ఇస్తామంటే.. నమ్మేస్తారా? 

బాబు మనీ ల్యాండరింగ్‌పై ఈడీ జోక్యం చేసుకోవాలి
ఒకటి కాదు.. రెండు కాదు.. చంద్రబాబు స్కాములు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. సీమన్స్ నుంచి అమరావతి వరకు స్కాములు వెలుగు చూశాయి. చంద్రబాబు అనే దొంగ దొరికాడు. ఆయన చేసిన తప్పులు, అవినీతిని ప్రజల్లోకి తీసుకువెళ్తాం. చట్టం, మిగిలిన శాఖలు చేయాల్సిన పనులు చేస్తాయి. వీటితో పాటు చంద్రబాబు చేసిన తప్పులు అన్నీ బయటకు వస్తాయి. వీటన్నింటికీ చంద్రబాబు ప్రజా కోర్టులో సమాధానం చెప్పాలి. చంద్రబాబు దోచేసిన సొమ్మును తీసుకురావటానికి ఈడీలాంటి సంస్థలు జోక్యం చేసుకోవాలి. ఎందుకంటే దుబాయ్‌ లాంటి విదేశాల నుంచి డబ్బు మనీల్యాండరింగ్ జరిగింది. ఈడీ ఈ కేడీని పట్టుకోవాలని వైఎస్‌ఆర్‌సీపీ డిమాండ్ చేస్తోంది. 

 - ఎల్లో మీడియాలో చంద్రబాబుకు ఐటీ షోకాజ్ నోటీసులపై ఎందుకు చూపించరు.. ఎందుకు రాయరు? 
-కేంద్ర ప్రభుత్వం పరిధిలోని ఐటీ శాఖ 46 పేజీల షోకాజ్ నోటీసులో చాలా వివరంగా రాశారు. కావాలంటే చదువుకోండి. సీమన్స్ లో అవినీతి జరిగిందని కేంద్ర దర్యాప్తు సంస్థలు కూడా చెప్పాయి. 
- రాష్ట్ర ప్రభుత్వం నోటీసులు ఇస్తే కక్షసాధింపు చర్యలు చేశారని అంటారు. అలాంటి అవకాశం కూడా లేదు. కేంద్ర ఐటీ డిపార్ట్‌మెంట్ నోటీసులు ఇచ్చింది. 
- నిన్న ఎన్టీఆర్‌ నాణెం విడుదల సందర్భంగా నడ్డా ఒళ్లో కూర్చున్నది ఎవరు? మొన్న అమిత్‌షాతో మాట్లాడింది ఎవరు?
- ముఖ్యమంత్రి గారు కేంద్ర ప్రభుత్వంలో పెద్దలను కలవటానికి సీఎం హోదాలో వెళ్తారు. చంద్రబాబు వెళ్లింది కాళ్లు పట్టుకోవడానికి కాకపోతే ఢిల్లీకి ఎందుకు వెళ్లారు?

Back to Top