తూర్పు గోదావరి జిల్లాలో వైయ‌స్ఆర్‌సీపీకి తిరుగేలేదు  

తూర్పు గోదావరి జిల్లా:  గ్రామీణ ఓటర్లు అధికార పార్టీకి పట్టం కట్టారు. స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలు ఇదే విషయాన్ని రుజువు చేస్తున్నాయి. జిల్లా వ్యాప్తంగా మొత్తం 1086 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగగా ఇప్పటి వరకు వెలువడిన ఫలితాల్లో వైయ‌స్సార్‌సీపీ 75 స్థానాల్లో విజయం సాధించింది.

గోదావరి జిల్లా తమకు కంచుకోట అని చెప్పుకునే టీడీపీ పరిస్థితి ఇక్కడ దారుణంగా మారింది. ఇప్పటి వరకు అందిన ఫలితాల్లో కేవలం ఒకే స్థానాన్ని దక్కించుకుంది. టీడీపీ కంటే మెరుగ్గా బీజేపీ 2  స్థానాల్లో, ఇతరులు ఒక స్థానంలో గెలిచారు. 61 జెడ్పీటీసీ స్థానాలు ఉండగా ఇంకా ఫలితాలు వెల్లడికాలేదు.

Back to Top