నేడు శ్రీకాకుళం జిల్లాలో శ్రీ వైయస్‌ జగన్‌ పర్యటన 

అంపోలు జిల్లా జైలులో మాజీ మంత్రి డాక్టర్‌ సీదిరి అప్పలరాజుతో ములాఖత్‌

అక్రమ కేసులు, రాజకీయ వేధింపులకు గురవుతున్న పార్టీ నాయకులకు అండగా వైయ‌స్ఆర్‌సీపీ

తాడేప‌ల్లి: వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైయస్‌ జగన్‌ ఈ రోజు శ్రీకాకుళం జిల్లాలో పర్యటించనున్నారు. అక్రమ కేసులో అరెస్టై శ్రీకాకుళం సమీపంలోని అంపోలు జిల్లా జైలులో రిమాండ్‌లో ఉన్న మాజీ మంత్రి, వైయ‌స్ఆర్‌సీపీ నాయకుడు డాక్టర్‌ సీదిరి అప్పలరాజును శ్రీ వైయస్‌ జగన్‌ ములాఖత్‌ ద్వారా కలుసుకుని పరామర్శించనున్నారు.

ఉదయం 9 గంటలకు తాడేపల్లిలోని తన నివాసం నుంచి బయలుదేరి విశాఖపట్నం విమానాశ్రయానికి చేరుకుంటారు. ఉదయం 11 గంటలకు విశాఖపట్నం విమానాశ్రయం నుంచి రోడ్డు మార్గంలో బయలుదేరి మధ్యాహ్నం 2 గంటలకు శ్రీకాకుళం సమీపంలోని అంపోలు జిల్లా జైలుకు చేరుకుంటారు. అక్కడ డాక్టర్‌ సీదిరి అప్పలరాజుతో ములాఖత్‌ అయి పరామర్శిస్తారు. అనంతరం అంపోలు జిల్లా జైలు నుంచి శ్రీ వైయస్‌ జగన్‌ తిరుగు ప్రయాణమవుతారు.
 

Back to Top